kondal508 Posted May 11, 2009 Report Posted May 11, 2009 కెవిపి రామచంద్రరావు అల్లు అరవింద్‌లు బుధవారం కృష్ణాజిల్లా లోని వరహాపట్నంలో ఓ ప్రముఖుని ఇంటిలో జరిగిన కార్య క్రమానికి హాజరై రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. కైకలూరు అసెంబ్లీ నియోజక వర్గ పీఆర్పీ అభ్యర్ధి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తల్లి దివంగత రాజేశ్వరమ్మ పెద్దకర్మ బుధవారం జరిగింది. దీనికి వీరిద్దరూ విడివిడిగా హాజరైనా ఓ రహస్య ప్రదేశంలో సమా వేశం అయినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడి మూడో బలమైన ప్రాంతీయ పార్టీగా అవతరిం చిన పీఆర్పీకి ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీ పీఆర్పీకి మద్దతు ఇచ్చే విధంగా ఒక వేళ అలా కాకుండా పిఆర్పీకి 50 సీట్లు లోపు వస్తే ఆ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విధంగా చర్చలు జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో చిరంజీవి సూచనల మేరకు చర్చలు జరిగినట్టు తెలిసింది. ఒకే రోజు చిరంజీవి-బొత్సలు విశాఖపట్నంలోను కెవిపి-అరవింద్‌లు ఓట్ల లెక్కింపు ముందు కృష్ణాజిల్లాలోను ఈ విధమైన రహస్య సమావేశాలు జరపటం ఇరు పార్టీల శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి.
psycopk Posted May 11, 2009 Report Posted May 11, 2009 100 aaa....adi kudaradu kani inko mata cheppu.....
Recommended Posts