kingmakers Posted May 12, 2009 Report Posted May 12, 2009 మొసలి కన్నీరు కారుస్తున్న చిరంజీవి తమ అభిమాన హీరో చిరంజీవి కోసం ప్రాణాలను సైతం లెక్క జేయని మెగా అభిమానులు, గత ముప్పై సంవత్సరాలుగా అతని విజయం కోసం, తమ సర్వసము వదులుకొని కృషి చేసారు. ఇందుకోసం తమ జీవితాలను పాడు చేసుకొన్న వీరభిమనులు ఎందరో ఉన్నారు.అన్న ఆజ్ఞానుసరం అన్న పేరిట బ్లడ్డు బ్యాంకులు పెట్టి,కొన్ని లక్షల మంది తమ రక్తాన్ని దానం చేసిన వారు ఉన్నారు. వారికి అన్న అజ్ఞా అంటే సుగ్రీవాజ్నే మరి. అన్న వాక్కు వేద వాక్కు. అన్నకోసం వారు ఏమైనా చేసేందుకు సిద్దం. అటువంటి వీరాబిమనులు, తమ మెగా హీరో పార్టి పెట్టాలని, రాజకీయాలలోకి రావాలని, ఊరేగింపులు జరిపి సభలు సమావేశాలు పెట్టి అతని రాక కోసం చకోర పక్షులుల ఎదురు చూసారు. వారి కలలు నిజం చేస్తూ ప్ర.రా.పా.రానేవచ్చింది. కానీ ఆ తరువాత ఏమి జరిగిందీ? మూడు దశాబ్దాలుగా తన కోసం రక్తం దారబోసిన అభిమానులకు మొండి చేయి చూపించి, అంతవరకు వేరే పార్టీలలో పదవులు అధికారము అనుబవించి, అవకాసవాద రాజకీయాలకు మారుపేరైన నేతలు ఒకరొకరుగా కప్పు గెంతులు వేసు కొంటూ ప్ర.రా.పా.లోకి దుకుతుంటే వారి రాజకీయానుబవమును వాడుకొని, అధికారము దక్కించుకోవాలనే పేరాసతో, కనీసము మొకపరిచయము కూడా లేని రాజకీయ గుంట నక్కలని చేరదీసి, తన వీరాభిమానులను పొమ్మని చెప్పకుండా పొగ బెట్టి మరీ బయటకి గెంటించాడు, మెగా మహానుబావుడు మన చిరంజీవి. ఎలక్షన్ల ముందు ఎవరెలా పొతున్నా కనీసము ఒక ఫోను చేసి వారించే ప్రయత్నమైన చేయని చిరంజీవికి, నేడు ఎలక్షనులు ఐపోయాక తాపీగా మొసలి కన్నీరు కారుస్తూ, అభిమానులను క్షమించమని వేడు కొంటునాడు. ఆరోజు మిమ్మలిని అందరిని దూరం చేసుకొన్నాను, అందుకు పరిస్థితులే కారణం అని సెలవిస్తునాడు. అప్పుడు నిర్లక్ష్యము చేసినా, మల్లి రేపు అధికారము లోకి వచ్చి నప్పుడు తప్పక అదరిస్తానని హామీలు ఇస్తునాడు. "యేరు దాటాక ముందు ఓడ మల్లన్న, యేరు దాటేక బోడి మల్లన్న" అనే చిరంజీవి ఇప్పుడు మళ్లీ ఏ యేరు దాటాలని అభిమానులని పిలుస్తున్నాడో, అతనికే తెలియాలి. ఒకసారి అతని నిజ రూపం తెలుసు కొన్నప్పటికి, మనసులో దేవుడిలా కొలుచుకొనే తమ అన్న మళ్లీ పిలవగానే, అన్ని మరిచిపోయి అన్నవెనుక చేరేవారు తప్పక ఉంటారని , వారు మళ్లీ వగచే కాలం తప్పక వస్తుందని చేపెందుకు పెద్ద తెలివి తేటలు అవసరము లేదు. ఒకసారి మోసము చేసినవాడు మరో సారి చేయడని అనుకోవడము ఆత్మవంచన అవుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకొనేకన్నా, ముందే మేలుకోవడం మంచిది కదా. U R GR8 ACTOR SIRJEE # # #
Recommended Posts