Ruler4Dmasses Posted December 18, 2013 Report Posted December 18, 2013 Based on Silver's experience, dedicate this to all రోజువారి కార్యాలయపు బాధ్యతలు ప్రక్కన పెట్టి భారముతో కూడుకున్న భావోద్వేగపు భావనలతో విమానము ఎక్కిన "సిల్వర్" మదిలో వేలకొలది ప్రశ్నలు. జట్టు సభ్యులు, నాయకుడు, ఇత్యాది మొదలగువారు శుభము కోరినను, తన మది మాత్రము " ఒకరు" కొరకు పరితపించిపొయింది. తాను ప్రక్కన ఉన్నచో ఎంతటి ఆనందము కలిగిఉండెనో అని పదే పదే గురుతులను యోచిస్తూ ప్రయాసపడెను జరిగిన గతము గూర్చి జాగరిస్తూ జరుగబోవు భవిష్యత్ గూర్చి తర్కిస్తూ ఊసుల సయ్యాట నడుమ సాగిన ప్రయాణము, కాల్గరి ని చేరిన వానికి శీతల ఉష్ణము వొణుకు పుట్టించగా విడిది గృహమునకేగి సేదతీరెను అలసి సొలసెను. మరునాడు తారసపడబోవు క్షణములు గూర్చి మరల మరల తనమునకలై యోచిస్తూ, రేతిరిని గడిపాడు నిడురపట్టక విజయము సిద్ధించగలదని విశ్వసిస్తూ, మరునాడు ఉదయం దౌత్యకార్యాలయుము చేరెను, వరుస లో నిలబడి వేచెను క్షణమొక యుగముగా. సమస్త మస్తిష్క మండలి మొద్దుబారిపోయెలే సమరసమయం ఆసన్నమైన తరుణం , తత్తరపాటు తరంగాలు మదిని ముంచెను కార్యనిర్వాహణాధికారి చిరునవ్వుతో స్వాగతిస్తూ "సిల్వర్ "ని సువచనంతో పలకరించెను విజయుడవు రా సిల్వేరా అని పలుకుతూ ప్రయాణ పత్రము ను స్వీకరిశ్తూ మూడు దినముల పిదప ముద్రణ సిద్డంపగలదని శుభవార్త చల్లగా పలికెను. కృతజ్నభావంతో మనస్ఫూర్తిగా ధన్యవాదము తెలిపి మూడు రోజులు ఎవ్విదముగ గడువలేనో అని సంసయిస్తూ సందిగ్దతతో కూడుకున్న ఆనందం అతడిని ముంచెను అది వారాంతపు సమయము ఎటు చూసినా హిమమయం శీతల ఉధృతి ని ఒక్కడిని ఎటుల గడిపెదనో అంతో కొంటె ఆలోచన తేరుకుని చక్కని "కారు" ని అద్దెకు పైకం చెల్లించి గగనాన్ని పోలిన "కేల్గరి" ని, చుట్ట్టురా ప్రాంతాల్ని తనివి తీరా, తనువు బడలినా, మనసు అలువక చిందులేసెను "ఔరా ఇట్టి సుందర ప్రదేశమును ఎన్నడూ కానలేదే " అనుచూ తనని తాను కొత్తగా ఆవిష్కరిస్తూ ముందుకు సాగెను మన సిల్వర్ క్షణము క్షణమును అక్షయచంద్రుని వలె సాంసారిక విషయములను విసర్జించి రమిస్తూ తరించేనతడు అలసిన అతడు ఆకలితో భోజన శాల వైపు పరుగిడే సంప్రదాయము రీత్యా భారతీయ శైలి కి చెందినదా ఆ భోజన శాల నానారకముల ఒడిదుడుకులను ఒద్దికగా ఓర్చుకున్న తాను విరామ విశ్రాంత భరితుడై, భోజనపదార్ధములను మెల్లగా భుజించే. ఆ సమయమున తటస్థించే ఓ నవయవ్వన రాసి అచట చిరు నగవుతో, మిడిసిపడే మేని సొగసుతో వచ్చినవారి బాగోగులు చూచుచూ పనిచేసేను అచట సిల్వేరుడి గుండె "డప్ డప్" మని మోగే "మా ఆతిధ్యము నచ్చినదని విశ్వసిస్తున్నా"అని ఆమె పలకగా " ఆతిధ్యము బాగు బాగు, మీ చిరు నవ్వు బహు బాగు " అని చిలిపి చలోక్తు విసిరి ఇరువురు పేర్లను ఒకరికొకరు తెలిపిరి. చిరునగవుతో సంభాషణ ను ముగించి, వచ్చిన కార్యము జయముగా పూర్తిచేసి విజయపతాకము ఎగురవేసేను . నవరస భరితమైన ఈ ప్రయాణ ఘట్టము సిల్వర్ దే ఐనా, ప్రయాసపడి దేశసరిహద్దుని దాటుకు వెళ్లి వ్యయప్రయాసల కోర్చి, శ్రమించి, తెగించి ప్రయాణము చేసేడు వారందరిదీ దాదాపు ఇదే స్థితి అందరికి విజయం సిద్ధింపగలదని, సిద్దించవలెనని ముద్రణ గావించుకున్న, మరియు గాంచెడువారకును అంకితం Keep the flow flowing i say 1
SwamyRaRa Posted December 18, 2013 Report Posted December 18, 2013 this song dedicated to Ruler4Dmasses http://youtu.be/VkNRIbmchc0
SwamyRaRa Posted December 18, 2013 Report Posted December 18, 2013 say in 2 mukkal man keep the flow flowing baaaaaaaa.............
Ruler4Dmasses Posted December 18, 2013 Author Report Posted December 18, 2013 super super super... thanks baa
Ruler4Dmasses Posted December 18, 2013 Author Report Posted December 18, 2013 keep the flow flowing baaaaaaaa............. keep the flow flowing baa
mustang302 Posted December 18, 2013 Report Posted December 18, 2013 endi ee literature...!!silver vuncle english medium from last janma ..u noooo...!!
Ruler4Dmasses Posted December 18, 2013 Author Report Posted December 18, 2013 $s@d still feeling dullaa baa.. flow missingaa
Ruler4Dmasses Posted December 18, 2013 Author Report Posted December 18, 2013 calling silver baa.. baa nee experiences anni feel ayyi raasa baa common i say
Yuvatha Posted December 18, 2013 Report Posted December 18, 2013 still feeling dullaa baa.. flow missingaa musti tscolded me $s@d
Recommended Posts