Jump to content

శోభన్ బాబు వర్ధంతి మార్చి 20 సందర్బంగా.....


JANASENA

Recommended Posts

1925079_751782854852974_1313090890_n.jpg

 

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం హైస్కూల్లో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు. హైస్కూలు చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువు పూర్తి చేసాడు.

చిన్నప్పటినుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడినని, తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను భాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పాడు.

అతనికున్న బిరుదులు: నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు.

శోభన్ బాబు నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.

మనుషులు మారాలి: యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం. ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది.
చెల్లెలి కాపురం: అప్పటికే అందాల నటుడిగా ఆంద్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిరం కలికితురాయి. అంద వికారుడయిన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయ పడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం.
ధర్మపీఠం దద్దరిల్లింది: తన కన్న కొడుకులు ముగ్గురూ అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురినీ అంతంచేసే తండ్రిగా శోభన్ బాబు ప్రదర్శించిన నటన అసామాన్యం.

శోభన్ బాబుకు మే 15, 1958న కాంత కుమారితో వివాహమయినది. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు: కరుణ శేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత.

ఎన్నటికీ ప్రేక్షలు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడులయిన హలో..గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్థి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు. శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నై లో మరణించాడు

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...