Jump to content

Jr.doctors Samme Seemandhra Kutra -Namasthetelangana


dhonifan

Recommended Posts

  • Replies 85
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • StuartBinny

    13

  • mustang302

    7

  • posaanisam

    7

  • sompapidi

    6

Popular Days

 

http://namasthetelangaana.com/Telangana/%E0%B0%9C%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%81%E0%B0%95-%E0%B0%B8%E0%B1%80%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0-1-2-422589.aspx#.VE-3uxaR_SJ

 

 

జూడాల సమ్మె వెనుక సీమాంధ్ర కుట్ర?
Updated : 10/28/2014 2:25:04 AM
Views : 952
-తరగతులు ప్రారంభమై నెల కూడా కాలేదు..
-ఇప్పుడే సమ్మె అవసరమేముంది?
-సీనియర్ల చేతుల పావులుగా మారిన జూనియర్లు
-ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు

దుండిగల్, అక్టోబర్ 27 (టీ మీడియా): గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె వెనుక సీమాంధ్ర కుట్రలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే తరగతుల్లో చేరిన జూడాలకు సమ్మె చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెడికల్ కౌన్సెలింగ్ అనంతరం కళాశాలల్లో చేరిన విద్యార్థులకు ఆగస్టు చివరివారంలోగానీ, సెప్టెంబర్ మొదటివారంలోగానీ తరగతులు ప్రారంభమవుతాయి.

ఇలా కొత్తగా విద్యార్థులను రెచ్చగొట్టి జూనియర్ డాక్టర్లు (హౌస్ సర్జన్స్) అనవసరంగా సమ్మె పేరుతో ఈ వివాదంలోకి లాగుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లోని కేఎంసీ మెడికల్ కాలేజీల్లో 60 శాతానికిపైగా సీనియర్ విద్యార్థులు, జూడాలు సీమాంధ్రకు చెందినవారే ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వంటి పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్న సీమాంధ్ర నేతలు.. తమ ప్రాంత వైద్య విద్యార్థులు, జూడాలను వాడుకొని సమ్మెకు ఉసిగొలిపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ విద్యార్థులు జూనియర్లను పావులుగా వాడుకుని సమ్మె చేయిస్తున్నారని, దీనివల్ల సర్కార్ దవాఖానాల్లో రోగులకు వైద్యసేవలు నిలిపిపోయి.. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు అవుతుందనే సీమాంధ్రుల కుట్ర ఉందని వారు అంటున్నారు. లక్షల రూపాయల ఫీజులను ప్రభుత్వమే భరించి వైద్య విద్యను విద్యార్థులకు అందిస్తుండగా మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సమ్మెకు దిగాల్సిన అవసరం ఏమొచ్చిందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శించడంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంలో జూనియర్ విద్యార్థులే ముందుభాగంలో కనిపిస్తున్నారని, సీనియర్లు మాత్రం తెరవెనుక తంతగం నడుపుతున్నట్టు కనిపిస్తున్నదని వారు అంటున్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సమ్మె పేరుతో తరగతులకు దూరమవుతుండగా ప్రైవేటు కళాశాలల్లో చేరిన విద్యార్థులు హాయిగా చదువుకుంటున్నారని గుర్తుచేస్తున్నారు. తమ పిల్లలకు సమ్మెలో పాల్గొనాలనే ఉద్దేశం లేకున్నా సీనియర్లు, జూడాలు బలవంతంగా సమ్మెలో కూర్చోబెడుతున్నట్లు కనిపిస్తున్నదని, ఈ సమ్మె వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో తెలియనిస్థితిలో వైద్య విద్యార్థులు ఉన్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే కరెంట్ తదితర విషయాల్లో ప్రభుత్వాన్ని పనిగట్టుకుని బద్నాం చేస్తున్న శక్తులు జూడాల సమ్మె వెనుక కూడా ఉన్నాయా? అన్నది దృష్టి సారించాలని కోరుతున్నారు. తెలంగాణ విద్యార్థుల విలువైన కాలాన్ని వృథా చేయడంలో భాగంగానే జూడాలను సమ్మెకు ఉసిగొలిపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశంతోనైనా జూడాలు సమ్మెవీడి చదువులపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

r23nmb.jpg

Link to comment
Share on other sites

×
×
  • Create New...