Pioneer Posted June 6, 2009 Report Posted June 6, 2009 జగదేక సుందరిగా పేరు పడ్డ శ్రీదేవి తన కూతురు జాహ్నవిని మరో రెండేళ్ళలో (2011)తెరంగ్రేటం చేయించాలని ముచ్చటపడుతోంది. అయితే ఆ అమ్మాయి ప్రారంభ చిత్రం హిందీనా, తెలుగా అన్నది డిసైడ్ చెయ్యలేదు. ఈ మధ్య రాధ కూతురు కార్తీకను నాగార్జున కుమారుడుతో సినిమా చేస్తోందని తెలిసి ఈ నిర్ణయానికి వచ్చిందని వినికిడి. అందుకు సంభందించిన నృత్యాలు, డైలాగ్ డెలివిరి, నటన వంటివి ఇప్పటి నుంచే శిక్షణ ఇస్తోందని చెప్తున్నారు. ఈ విషయం ఆమె తన శ్రేయాభిలాషులుతో చెప్పి సలహాలు అడిగిందని తెలుస్తోంది. అలాగే తాను కూడా మిస్టర్ ఇండియా సీక్వెల్ లో చేస్తానంటూ చెప్తోంది. అయితే ఆ సీక్వెల్ ఎప్పుడు చేస్తోందో మాత్రం క్లారిఫై చేయటం లేదు. అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకే చిత్రంలో కనిపిస్తారా అంటే అంత తెలివి తక్కువ పని మాత్రం చేయనని చెప్తోంది.ఇక తాను నటిని అవుతాననే విషయం జాహ్నవికీ ఎగ్జైట్ మెంట్ గా ఉందని శ్రీదేవి చెపుతోంది. అయితే అప్పటివరకూ చదువు నిర్లక్ష్యం చేయకూడదని, అది పూర్తయ్యాకే సినిమా అయినా మరైదైనా అని స్క్రిక్టుగా చెప్పానని తల్లిగా చెప్పుతోంది. అలాగే ఆ చిత్రం తమ స్వంత బ్యానర్ పైనే చేసే అవకాశం ఉందని ఇంకా కథ, స్క్రిప్టులు వంటివి అనుకోలేదని ఇంకా చాలా టైమ్ ఉందని శ్రీదేవి చెప్తోంది. బెస్ట్ ఆప్ లక్ జాహ్నవి.
Recommended Posts