JANASENA Posted May 2, 2015 Author Report Posted May 2, 2015 విశాఖలో జ్యూరిచ్ వాటర్ పార్క్! హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): స్విట్జర్లాండ్‌లో ప్రసిద్ధి చెందిన జ్యూరిచ్ వాటర్ పార్క్ విశాఖ నగరానికి రానుంది. యూరోప్‌లోని పెద్ద వాటర్ పార్కుల్లో ఒకటిగా ఉన్న జ్యూరిచ్ పార్కును అత్యాధునిక సాంకేతికతతో నిర్వహిస్తున్నారు. అదే తరహాలో, సముద్రంలో అలల తీవ్రత, గాలుల వేగపు అనుభూతి ప్రత్యక్షంగా కలిగేలా ఈ పార్కును విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. రకరకాల వాటర్ స్పోర్ట్స్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. కొంతకాలం క్రితం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన జ్యూరిచ్‌లో, అక్కడి తెలుగువారి సూచనల మేరకు వాటర్ పార్కును సందర్శించి దాని నిర్వాహకులను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. ఆ సంస్థ ప్రతినిధులు, ఇటీవల రెండు మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ రాషా్ట్రన్ని సందర్శించి, పలు ప్రదేశాలు పరిశీలించాక, చివరకు విశాఖ నగరాన్ని ఎంపిక చేసుకున్నారు. సొంత నిధులతోనే వారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటే, మరో పర్యాటక ప్రాజెక్టు గురించి కూడా ఆ సంస్ధ యాజమాన్యం ఆసక్తితో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలో ఇదే అత్యాధునిక వసతులు ఉన్న వాటర్ పార్కు అవుతుంది.
dappusubhani Posted May 2, 2015 Report Posted May 2, 2015 ee pic houses anni enti edho miniature la kanipistunnai..
JANASENA Posted May 2, 2015 Author Report Posted May 2, 2015 12 Most Scenic Train Routes In India https://www.youtube.com/watch?v=3N3JbKxF_z8&feature=youtu.be
Recommended Posts