Hitman Posted March 2, 2016 Report Posted March 2, 2016 కొత్తూరు, కర్నూలు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఈ నెల 4వ తేదీ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలవనున్నట్లు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్పష్టం చేశారు. కొత్తూరు మండలం మాతల గ్రామంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాగా కర్నూలు జిల్లాకు చెందిన మరో వైకాపా ఎమ్మెల్యే బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు జిల్లా తెదేపా నాయకులు తెలిపారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆ ఎమ్మెల్యే మంగళవారం రాత్రే తన అనుచరులతో విజయవాడ బయలుదేరారని తెలిసింది.
Recommended Posts