Mr Mirchi Posted March 9, 2016 Report Posted March 9, 2016 ఏదో దత్తత తీసుకున్నా కదా అని రోడ్లు, మరుగు దొడ్లు కట్టించడం కాకుండా ఆ ఊరి జనానికి శాశ్వతంగా పనికొచ్చే పనులకి ప్రకాష్‌రాజ్ శ్రీకారం చుట్టారు. వారితో పొదుపు పథకాలు మొదలు పెట్టించడమే కాకుండా, ఆ ఊరిలో మద్యం షాపు అనేదే లేకుండా చేసారు. రెండెకరాల భూమిలో పిల్లల కోసం ప్రాథమికోన్నత పాఠశాల నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. ఆ ఊరి ఆడవాళ్లు ఎవరూ బహిర్భూమికి ఆరు బయట వెళ్లాల్సిన అవసరం లేకుండా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మంచినీళ్ల ఎద్దడి ఉన్న ఆ ఊరికి ట్యాంకర్లు వేయించి నిత్యం నీటి సరఫరా చేయిస్తున్నారు. బోర్లు వేసినా నీళ్లు పడని భూములు కావడంతో నీళ్లు ఉన్న చోటికే వెళ్లి ఆ ట్యాంకర్లు ఊరందరికీ మంచినీళ్లు సరఫరా చేస్తున్నాయి. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారం, పది రోజులకోసారి కొండారెడ్డిపల్లికి స్వయంగా వెళ్లి పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. తాను లేనపుడు అక్కడి ప్రజల అవసరాలు తీర్చడానికి ఒక మనిషిని నియమించారు. డబ్బులున్న వాళ్లు చాలా మందే ఊళ్లని దత్తత తీసుకుంటూ ఉంటారు కానీ ఆ ఊరిని నిజంగా కన్నబిడ్డలా సాకేదెవరు? ఎప్పటికప్పుడు ఆ ఊరి ఎదుగుదల కోసం తపన పడుతూ, అనునిత్యం దానికోసం శ్రమించేదెవరు? ఒక ఊరిని అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న ప్రకాష్‌రాజ్‌కి, ఆయన ఫౌండేషన్‌కి నిజంగా హేట్సాఫ్. యు ఆర్ ట్రూలీ ఏ గ్రేట్ పర్సన్ సర్.
Recommended Posts