Jump to content

Baahubali 2 Movie Teaser And Trailers Release Dates


Recommended Posts

Posted
Baahubali-2-Movie-Teaser-and-Trailers-Re

బాలీవుడ్ లో బడా సినిమాల విడుదల తేదీల్ని ఒకటి రెండేళ్ల ముందే ఫిక్స్ చేయడం మామూలే. కానీ మన దగ్గర అలా ఉండదు. సినిమా పూర్తయ్యే దశలో కానీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రాదు. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’తో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు రాజమౌళి. 14 నెలల ముందే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. బాహుబలి: ది బిగినింగ్ తరహాలో ఈ సినిమా వాయిదాలు పడే అవకాశం కూడా లేదు. ఒకేసారి చాలా భాషల్లో రిలీజ్ చేయాలి కాబట్టి.. డేట్లు మారిస్తే సమస్య వచ్చేస్తుంది. బాలీవుడ్ లో సైతం ‘బాహుబలి-2’ విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి కాబట్టి.. అక్కడ ఇష్టానుసారం రిలీజ్ డేట్ మార్చడానికి వీలుండదు. కాబట్టి 2017 ఏప్రిల్ 14న బాహుబలి-2 పక్కా అంటే పక్కా అనుకోవచ్చు.

ఆ తేదీని దృష్టిలో ఉంచుకుని ‘బాహుబలి: ది కంక్లూజన్’ను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి రాజమౌళి అండ్ కో సన్నాహాలు చేస్తోంది. ఈ అక్టోబరుకల్లా సినిమా పూర్తి చేసేయాలని.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ - ప్రమోషన్ మీద దృష్టిపెట్టాలని భావిస్తున్నాడు జక్కన్న. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి ఆడియో వేడుక నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేస్తారట. ఫిబ్రవరికల్లా సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలూ పూర్తవుతాయని.. నెలన్నర పాటు విస్తృతంగా ప్రచారం కార్యక్రమాలు నిర్వహించి మాంచి హైప్ మధ్య ఏప్రిల్లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. మరి అంతా జక్కన్న అనుకున్నట్లే సాగుతుందేమో చూద్దాం.

 

×
×
  • Create New...