Jump to content

Will Visit Bandla Ganesh In Jail Says Sachin


Recommended Posts

Posted
Will-visit-Bandla-Ganesh-in-Jail-says-Sa

''డియర్ ఫ్రాడ్ బండ్ల గణేష్.. హ్యాపీ బర్త్ డే.. త్వరలోనే నువ్వు జైలుకు వెళ్తావ్'' అని ఒక మెసేజ్.. ''జాగ్రత్త.. ఎవరైనా ఈ బండ్ల గణేష్ తో సినిమా చేస్తే.. దానిని నేను అస్సలు రిలీజ్ అవ్వనివ్వను'' అంటూ మరో మెసేజ్. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పుట్టినరోజు నాడు.. అసలు ఇవేం మెసేజులు అనుకుంటున్నారా? అవి పెట్టింది ఎవరో కాదు.. సాక్షాత్తూ హీరో సచిన్ జోషి అలా చెప్పాడు. 

గతంలో బండ్ల గణేష్ కు ఏకంగా సచిన్ జోషి కోర్టు నోటీస్ పంపిన సంగతి తెలిసిందే. టెంపర్ సినిమా రిలీజ్ టైములో అప్పులుపాలైతే.. అప్పుడు ఆ సినిమాకు అప్పు ఇచ్చి మరీ సచిన్ కాపాడాడు. అందుకే అప్పట్లో టెంపర్ సక్సెస్ పార్టీ ''వైకింగ్ మీడియా'' (సచిన్ కంపెనీ) హోస్ట్ చేసింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కాని.. ఏకంగా కోర్టు నోటీస్ పంపేసి.. ట్విట్టర్లో బూతులు తిట్టాడు సచిన్. ఏకంగా 15 కోట్లుపైనే బండ్ల బాబు బకాయి పడ్డాడని అప్పట్లో రూమర్లు వినిపించాయి. ఆ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సచిన్ ట్విట్టర్లో తిడుతూనే ఉన్నాడు. కాని బండ్ల బాబు మాత్రం ఫుల్ సైలెంట్. 

ఇప్పుడు తాజాగా మరోసారి ఇలాంటి జలక్ ఇచ్చాడు సచిన్. అయినాసరే బండ్ల బాబు నో రిప్లయ్. తన బర్తడే కు వచ్చిన ట్వీట్లను రీ-ట్వీట్ చేసుకోవడమే కాని.. పెద్దగా ఏమి పట్టించుకోనట్లున్నాడు ఈ 'టెంపర్' ప్రొడ్యూసర్. 

 

×
×
  • Create New...