naku_siggu_ledhu Posted March 14, 2016 Report Posted March 14, 2016 టాలీవుడ్లో ఇప్పటి వరకు బర్నింగ్‌స్టార్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సంపూర్ణేష్‌బాబు. హృదయకాలేయం అన్న ఒకే ఒక్క సినిమాతో సంపూ ఒక్కసారిగా స్టార్ అయిపోవడంతో ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే బర్నింగ్‌స్టార్ అయిపోయాడు. నిన్నటి వరకు బర్నింగ్ స్టార్ అంటే ఒక్క సంపూనే కాని తాజాగా టాలీవుడ్లో ఆర్.పి.పట్నాయక్ తులసీదళం సినిమా రిలీజ్ అయిన తర్వాత మరో బర్నింగ్‌స్టార్ వచ్చాడు. ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కి ఈ శుక్రవారం రిలీజ్ అయిన హర్రర్, థ్రిల్లర్ మూవీ తులసీదళం సినిమా ద్వారా ఎన్ఆర్ఐ సురేష్‌రెడ్డి ఉయ్యూరు వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. హర్రర్, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన తులసీదళంలో సురేష్‌రెడ్డి నటనకు మంచి ప్రాధాన్యం లభించింది. సురేష్రెడ్డిలోని నటనను గుర్తించిన ఆర్.పి ఆయనకు తులసీదళంలో ఛాన్స్ ఇవ్వగా తొలి సినిమాతోనే తన టాలెంట్‌ను ఆయన ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సురేష్ నటన రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా బాగా మెప్పిస్తోంది. కాలీఫోర్నియాలోని సెరా థియేటర్స్‌లో ఇటీవల ప్రదర్శించిన తులసీదళం స్పెషల్ షోకు కోమటి జయరాం లాంటి ప్రముఖులతో పాటు పలువురు హాజరై సురేష్‌రెడ్డి నటనను ప్రశంసించారు. అలాగే అమెరికాలోని పలువురు ఎన్ఆర్ఐలతో పాటు అక్కడ తులసీదళం సినిమా చూసిన వారు సురేష్‌రెడ్డి ఉయ్యూరుకు బే ఏరియా బర్నింగ్‌స్టార్ అని బిరుదు కూడా ఇచ్చారు. ఈ బే ఏరియా బర్నింగ్స్టార్కు టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించాలని అప్పుడే ఆఫర్స్ కూడా వస్తున్నాయి. తొలి సినిమాకే బర్నింగ్‌స్టార్ ఎంత పాపులర్ అయ్యాడో ఇప్పుడు సురేష్‌రెడ్డి కూడా బే ఏరియా బర్నింగ్‌స్టార్‌గా పాపులర్ అయ్యాడు. చూద్దాం టాలీవుడ్ తెరపై ఈ న్యూ బర్నింగ్‌స్టార్ హంగామా ఏం రేంజ్లో ఉంటుందో..
Recommended Posts