Jump to content

న్యూ ట్విస్ట్‌: బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంప‌లేదా..?


rajurocking50

Recommended Posts

ఓ మూవీలో మొద‌లైన అనుమాన‌పు ప్ర‌శ్న చాలా రోజులుగా జ‌నాల్లో తరచూ నాన‌డం చాలా అరుదైన అంశంగా చెప్పాలి. అలాంటి ప్ర‌శ్న సంధించిన ఘనత ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కే సొంతం. ఆయన బాహుబలి చిత్రంలోని ఒక ప్రశ్న సినీ ప్రేక్షకులనే కాదు.. సాధారణ ప్రజానీకం కూడా దాని గురించి మాట్లాడుకునేలా చేయటమే కాదు.. అదో హాట్ టాపిక్ గా మారింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నే ప్ర‌శ్న‌కు ఇప్ప‌ట‌కీ ఎవ్వ‌రూ స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. కాని ఇప్పుడు మ‌రో ప్ర‌శ్న మొద‌లైంది. అస‌లు క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని చంపాడా ? అనే ప్ర‌శ్న మొద‌లైంది. తాజాగా ఈ విషయం మీద ఆసక్తికర మాట ఒకటి ఈ సినిమా స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ నుంచి వ‌చ్చింది.

 

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయంపై కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ మొదలుకొని.. దర్శకుడు రాజమౌళి వరకూ పెదవి విప్పింది లేదు. తాజాగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం మీద విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బాహుబలికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న సస్పెన్స్ కు తెర దించాలన్న మాటకు స్పందిస్తూ.. అసలు బాహుబలి చనిపోయాడని ఎందుకు అనుకుంటున్నారంటూ ఆయన కొత్త సమాధానం చెప్పుకొచ్చారు. ఈ స‌మాధానంతో బాహుబలిని కట్టప్ప చంపేశాడా? లేదా? ఎందుకు చంపేశాడన్నది వదిలేసి.. బాహుబ‌లి చ‌నిపోలేదా అన్న కొత్త ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Link to comment
Share on other sites

3 yrs kritham start ina jungle book kooda release ipothundhi..with too much grapiks..but baahubali matram avuthado ledho telvadhu..!!

Link to comment
Share on other sites

3 yrs kritham start ina jungle book kooda release ipothundhi..with too much grapiks..but baahubali matram avuthado ledho telvadhu..!!

Disney valla budget mana budget different no
Link to comment
Share on other sites

Disney valla budget mana budget different no

synma kooda adae range lo untadhi ga..pedha budget..pedha level gapiks..too many team..too much co-ordination neede..too much time kooda teesukuntadi..yet still only 3 yrs tooked..but mana movie..em undadhu but still 3 yrs..!!

Link to comment
Share on other sites

×
×
  • Create New...