Jump to content

Recommended Posts

Posted
5 hours ago, i_sudigadu said:

Nice .. Edaina documentaries vunte post cheyandi 

documentaries  la emi levu kaani. Veetitho adjust avvu.

 

 

 

Posted

prathi oori lo horse ekkina cotton dhora statue quite common in gdzillas bl@st

Posted
11 hours ago, fake_Bezawada said:

Cotton dora manavadu vatchadu 2 years back india ki bezawada kooda vatchadu appudu

 

10 hours ago, siru said:

Maa guntur side almost God like figure..

bl@st

 

Posted
12 hours ago, ParmQ said:
635989110385752280.jpg
  • ఆంధ్రమాతను అన్నపూర్ణగా చేసిన కాటన్‌దొర
  • నేడు కాటన్‌ దొర జయంతి
 
రేపల్లె: ఒకప్పుడు ఉత్తరాంధ్రలో జనజీవనాన్ని ప్రకృతి వైపరీత్యాలు, కరువు, కాటకాలు అతాలకుతలం చేశాయి. 1791 నుంచి 1839 వరకు కాకినాడ ప్రాంతంలో ఉప్పెన వచ్చి సముద్రం పొంగి వేలాది మంది ప్రజలు అశువులు బాశారు. ఇదే సమయంలో ఈ ప్రాంతానికి ఇంగ్లండ్‌ నుంచి ఉద్యోగ రీత్యా ఆపద్భాంధువుడిలా ఇండియాకు వచ్చిన కాటన్‌ దొర చలించిపోయారు. ఆనకట్టలు కట్టాలని ఆలోచనతో ముందుకెళ్ళారు.
జనరల్‌ ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ క్రీ.శ. 1803 మే 15వ తేదీన ఇంగ్లండ్‌లో జన్మించారు. ఆదివారం ఆయన జయంతి సందర్బంగా ఆనాడు ఆయన చేసిన గొప్ప పనులు పలువురికి ఆదర్శంగా నిలిచాయి. 1820 జనవరి 31న సెకండ్‌ లెఫ్ట్‌నెంట్‌గా ఆర్డినెన్స్‌ సర్వేలో చేరి బ్రిటీషు దీవుల సర్వే మ్యాప్‌లను తయారు చేశారు. 1821 మేలో ఇండియాలో ఈస్ట్‌ ఇండియా కంపెనీలో మిలటరీ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1832-33లో సంభవించిన నందన క్షామం, గుంటూరు క్షామంలో గోదావరి, కృష్ణా మండలాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
 
             ఒక్క గుంటూరు జిల్లాలోని మూడు లక్షలకుపైగా ప్రజలు, రెండు లక్షలు పై చిలుకు పశువులు, 70వేలకు పైగా గృహాలు కూలిపోయాయి. ప్రభుత్వానికి కోటి రూపాయల మేర నష్టం కలిగించింది. ఆ ఘోర క్షామంలో తినటానికి తిండి దొరకక ప్రజలు మలమల మాడిపోయారు. గుంటూరు సీమలో ప్రతి అయిదురుగురికి ఇద్దరు, గోదావరి సీమలో ప్రతి నలుగురికి ఒకరు చొప్పున మృతి చెందారు. 1847 ఏప్రిల్‌లో గోదావరిపై ఆనకట్ట నిర్మాణాన్ని మహాయజ్ఞంగా ప్రారంభం చేశారు. కృష్ణానదిపై ఆనకట్టనిర్మాణం ప్రధాన కాలువ తవ్వకాల పనులు 1852 లో ప్రారంభమై 1855లో పూర్తి చేయబడ్డాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర పరికరాలు ఉండే ఈరోజుల్లో ఏ చిన్న ప్రాజెక్ట్‌ నిర్మాణం చేయాలన్నా దశాబ్ధ కాలం పడుతుంటే, నిర్మాణం కాలంలో ప్రవాహాన్ని మళ్ళించటం ఎంతో కష్టమైనా కృష్ణాలోయలో మూడేళ్ళ కాల వ్యవధిలో ఆనకట్ట నిర్మించటమంటే ఆషామాషీ కాదు.
 
 
               ఆర్థర్‌ కాటన్‌ కెప్టెన్‌ ఆర్‌ల యొక్క సాంకేతిక పరిజ్ఞానం, ధృడసంకల్పం, నిరంతర కృషి వల్లనే ఈ మహాకార్యం సాధ్యమైంది. మొదట్లో అయిదు లక్షల 80 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు సౌకర్యం కల్పించబడగా, 1894లో ఆనకట్ట ఎత్తును మరోమూడు అడుగులు పెంచటం వల్ల ఆయకట్టు ఎనిమిది లక్షల ఎకరాలకు పెరిగింది. 1925లో ఆరు అడుగులు తలుపులను బిగించటం వల్ల ఆయకట్టు 12 లక్షల ఎకరాలకు పెరిగింది. 1957లో శిథిలావస్థకు చేరిన ఆనకట్ట స్థానంలో ప్రకాశం బ్యారేజ్‌ నిర్మించబడింది. ఆయకట్టు 13 లక్షల 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కృష్ణా తూర్పు డెల్టాలో 378 కి.మి, పశ్చిమ డెల్టాలో 307 కి.మీ పొడవు గల ముఖ్యమైన కాల్వలు, మరెన్నో చిన్న కాల్వలు తవ్వబడ్డాయి. కాల్వలకు లాకులు వుండటం వల్ల రవాణా మార్గాలు సులభమయ్యాయి. నిజాంపట్నం కాలువ ద్వారా పడవలు సముద్రంలోకి వెళ్ళేందుకు అవకాశం ఏర్పడింది.
 
             ఆ నాడు కాటన్‌ దొర మన దేశానికి వచ్చి ఉండ కపోతే కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణం అప్పట్లో జరిగి వుండేది కాదని, కృష్ణా డెల్టా ఎప్పటికీ కరువు కాటకాలతో నిండిపోయి ఉండేదన్న భావన చాలామందిలో ఉండేది. ఆనాడు ఎటువంటి సౌకర్యాలు లేకుండా నిస్తేజంగా ఉన్న కుగ్రామంగా పడి ఉన్న బెజవాడ ఈనాడు అన్ని సౌకర్యాలు కలిగిన విజయవాడగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందంటే కృష్ణా డెల్టా ప్రజలు పాడి పంటలతో తులతూగి ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా దేశంలో అగ్రస్థానంలో ఉన్నారంటే అది కాటన్‌ దొర చలువేనని ప్రజలు ఇప్పటికీ కొలుస్తుంటారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే ప్రస్తుతం గుంటూరు, కృష్ణాజిల్లాలకు అనుసంధానంగా నిర్మించిన ప్రకాశం బ్యారేజి, తూర్పుగోదావరి జిల్లాలో నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్టలు నూతన నవ్యాంధ్ర రాష్ట్రంలో ఉండటంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం రాజధాని నిర్మాణం ఈ ప్రాంతంలో ఉండటంతో కాటన్‌ దొర జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Good post

Posted
54 minutes ago, tom bhayya said:

prathi oori lo horse ekkina cotton dhora statue quite common in gdzillas bl@st

 

Posted

hey ee article endulo vacchindo cheppava please, facebook lo share chestha. 

Mahaneeyudiki vandanamulu

Posted
21 hours ago, Bullimasteru said:

hey ee article endulo vacchindo cheppava please, facebook lo share chestha. 

Mahaneeyudiki vandanamulu

Ajyothy.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...