TOM_BHAYYA Posted May 21, 2016 Report Share Posted May 21, 2016 వచ్చే వరకూ అలాగే ఉంటుంది. వచ్చాక అలవాటైపోతుంది లే… అని సగం మనసుతో సరిపెట్టుకోనక్కర్లేదు. కచ్చితంగా హైద్రాబాద్ కన్నా అమరావతి ది బెస్ట్ అని రుజువు కాబోతోంది ఉద్యోగుల విషయంలో. ఏంటో ఎలా ఉందో అంటూ గుంపులు గుంపులుగా వచ్చి చూస్తున్న ఉద్యోగుల కోసమే కాదు ఏపీ మొత్తానికి… ప్రపంచానికి కూడా అర్థం కావాలనే ఇలా చెప్పడం. అవును. అమరాతి ది బెస్ట్. మాములుగా అయితే పుట్టినప్పటి నుంచి క్రమంగా పెరుగుతుంది నగరమైనా… జీవితమైనా. కానీ అమరావతి మాత్రం ఆలోచనలో పెరిగి… అమాంతం కళ్లముందు దిగుతోంది. ఓ 35 ఏళ్ల తర్వాత పరిస్థితికి తగ్గట్టుగా రూపు దిద్దుకుంటున్న నగరం కాబట్టి ఇప్పటి సౌకర్యాలు పెద్ద విషయం కాదు. కచ్చితంగా ఉంటాయ్. అంతకు మించి… అద్భుతం దిగొచ్చిందా అనిపిస్తాయ్. ప్రభుత్వ ఆఫీసులు సచివాలయం కాబట్టి మనం పెద్దగా పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే చాలు… అదే పబ్లిసిటీ అయిపోతుంది ఆటోమేటిగ్గా. ఎక్కడా లేనివి… ఇప్పటి వరకూ తెలుగునేల చూడని సదుపాయాలు అక్కడ ఉన్నాయంటే మరి పబ్లిసిటీ కాక మరేమిటి… అందుకే అంటున్నది అమరావతే ది బెస్ట్ అని. హైద్రాబాద్ లో మన సీనేంటి…? ఎదిగే గుడ్డును పొదగాలి కానీ పొగడకూడదు. అందుకే డైరెక్ట్ విషయానికొద్దాం. మిగతా విషయాన్నీ తర్వాత సెక్రటేరియట్ సంగతి చూద్దాం. ఇప్పుడక్కడ హైద్రాబాద్ లో కళ్ల ముందు ఎలా కనిపిస్తుందో చెప్పుకుంటే అమరావతి ఎందుకు బెస్టో అర్థమైపోతుంది. హైద్రాబాద్ లో సెక్రటేరియట్ కి వచ్చే ఉద్యోగులు బ్యాగులో గోధుమపిండి వేసుకొని బయల్దేరితే ఆఫీసుకొచ్చేసరికి చపాతీ పిండి రెడీ అయిపోతుంది అదే బ్యాగులో. అంత చెమట, అంత రద్దీ, తోపుడు, ఒత్తిడి ఉంటాయ్. ఉన్న ఎనర్జీలో కనీసం సగం లాగేసే వరకూ సెక్రటేరియట్ స్టాప్ అయితే రాదు. వచ్చాక కాళ్లు ఈడ్చుకుంటూ లోపలకి వెళ్లేసరికి పదకొండున్నర అయిపోతుంది. ఈలోగా కుర్చీలు ఖాళీగా ఉన్నాయ్ అని కొత్తగా వచ్చిన ప్రతి న్యూస్ ఛానెల్ స్టోరీలు వేయడం చాలాసార్లు చూశాం. ఇక సౌకర్యాల సంగతి అంటారా…అబ్బో అద్భుతం అనుకోవాలి. సీఎంలు మంత్రులు మన హైద్రాబాద్ సచివాలయ లిఫ్టులో ఇరుక్కుపోవడం, కొన్ని బ్లాకుల్లో రోజుల తరబడి కరెంటు పోవడం కామన్ అనిపించేన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయ్. ఎప్పుడు పవర్ కట్ అవువుతుందో… షార్ట్ సర్క్యూట్ అయి ఫైళ్లు, బిల్డింగులు కాలిపోతాయో లెక్కే లేదు. ఇక కరెంటు ఉన్నా కిర్రు కిర్రు అనే ఫ్యాన్ ల కింద కూర్చుని కుస్తీ పట్టాల్సిందే ఉద్యోగులు. అటు తర్వాత వర్షం పడితే వెంటనే ఇండికేట్ చేసినట్టు… లీకయ్యే రూఫ్ లు… ఎప్పుడు కూలిపోతాయో తెలియని బ్లాక్ లు ఇలా ఉంటుంది అక్కడ మన వ్యవహారం. అయినా హైద్రాబాద్ లో ఉన్నాం కాబట్టి… మన తో అవసరం కాబట్టి కాస్త బెట్టు చేయాలన్నట్టు నడుపుతున్నారు మన ఉద్యోగ రాజకీయం. అక్కడ పరిస్థితి చెప్పేశాం కదా… ఇక్కడ స్పెషాలిటీస్ చూస్తే ఇక అమరావతి హైద్రాబాద్ కన్నా ఎలా బెస్టో తెలుస్తుంది లెండి. అమరావతి 5 ఫీచర్స్… – బిల్డింగ్ నాణ్యత, వరల్డ్ క్లాస్ ఎక్విమెంట్, కేరింగ్ అన్నీ ఓకే. అవన్నీ ఇప్పుడు మళ్లీ చెప్పక్కర్లేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంటీరియర్ కోసం కోట్లు ఖర్చుపెట్టడం చూశారా ఎక్కడైనా… ఇలా అనగానే వృధా చేస్తున్నారు అంటూ… పేథటిక్ వయొలెన్ బైటకి తీయకండి ప్లీజ్. విషయం వినండి. మన వర్క్ కల్చర్, మన ఫెసిలిటీలు… మనం ఎంత మోడ్రన్ లా అప్ డేటెడ్ గా ఉన్నాం అని చెప్పేందుకు ఇంటీరియర్ మీద ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. మన ఇళ్లకి కూడా తీసుకోనంత శ్రద్ధ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసు కోసం తీసుకుంటున్నారు సింపుల్ గా చెప్పాలంటే. – సచివాలయం కోసం కోతల్లేని కరెంటు ఎలాగూ ఉంటుంది. ఇప్పుడిక సెంట్రలైజ్డ్ ఏసీ వచ్చేస్తోంది. అంటే ఇక చొక్క పై గుండీలు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు గవర్నమెంటు ఆఫీసులో కూడా. – రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లుంటాయ్. కుస్తీ పోటీల్లా తోపులాటలు కొట్లాటలూ జరగవ్. హెచ్ ఆర్ ఏ భారీగా పెరిగింది కాబట్టి బషీర్ బాగ్ ప్రాంతంలో ఇళ్లకన్నా మోడ్రన్ గా ఉన్న గుంటూరు నివాసాల్లో కులాసాగా ఉండొచ్చు – వారానికి ఐదు రోజులే కాబట్టి బెజవాడ, గుంటూరుల్లో కొత్తగా కట్టిన మల్టీప్లెక్స్ లన్నీ మనవే. అదే హైద్రాబాద్ లోనే ఉంటే శనివారం సాయంత్రం కూడా ట్యాంక్ బండ్ గాలి ఎక్కడ పీలుస్తామో అని భయపడి పరుగెడుతూ బస్సులెక్కాల్సిందే కదా. – రుణమాఫీ ఫైలు కావాలంటే బేగం పేట దగ్గరెక్కడో ఉన్న ఆఫీసులో ఉండేది. అధికారేమో సెక్రటేరియట్ లో ఉంటారు. ఆమోదించాల్సిన ఆర్థిక శాఖ ఆ చివరెక్కడో ఉంటుంది… తలాతోక లేని వ్యవహారంతో పని మీద వచ్చినవాడి మీద విసుక్కునేవాళ్లు. వాడేమో విసుగెత్తి ఏడుపు మొహంతో జిల్లాకి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు అలాంటి గతి లేదు. అంతా ఇంటిగ్రెటెడ్ కాబట్టి సంబంధిత శాఖలన్నీ ఒక్కచోటే ఉంటాయ్ కాబట్టి క్షణాల్లో అయిపోతుంది వ్యవహారం. ఇవన్నీ తాత్కాలిక సచివాలయంలోనే ఉంటే…ఇక శాశ్వత అమరావతి ఇంకెంత సౌకర్యంగా ఉంటుంది చెప్పండి. అందుకే రండి నవ్వుతూ రండి. అమరావతిలో తొలిసారి కాలుపెడుతున్నందుకు సంతోషించండి. ఇదీ మా రాజధాని స్థాయి అంటూ ప్రపంచానికి చాటిచెప్పే బ్రాండ్ అంబాసిడర్లు అవ్వండి తప్పితే, లేనిపోని రాగాలు తీసి నీరసం ఎక్కించాలనుకోకండి. అన్నిటికీ మించి… పొల్యూషన్ లేని పచ్చిగాలి, ఆహ్లాదం పంచే క్రిష్ణ, ఆకట్టుకునే పచ్చని పొలాలు బోనస్. ఇవన్నీ తట్టుకోలేక హుస్సేన్ సాగర్ కుళ్లుకంపు కూడా మాక్కావాలి అప్పుడే పనిచేస్తాం అమరావతిలో అనకండే… ప్లీజ్. అది అరేంజ్ చేయడం కష్టం. Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted May 21, 2016 Report Share Posted May 21, 2016 2 lines lo cheppu Tom B. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.