Guest Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 ఎమ్మెల్యే చేతిలో కర్ర 29-05-2016 01:02:28 ఈయన పేరు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ.. ఈయన ఇలా కట్టె పట్టుకుని ఎందుకు నిలబడ్డారు? ఎవరిని దంచేందుకు? ఏం చేస్తే కొట్టేందుకు? ‘మొక్కేకదా అని పీకేస్తే... పీక కోస్తా!’... ఇది సూపర్ డూపర్ హిట్ డైలాగ్! ‘మొక్కేకదా అని నాటకపోతే... షాపు మూస్తా!’... ఇది అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక! ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చొరవ ఆయన మాటే శాసనంగా అమలు.. ప్రతి ఇల్లు, షాపు ముందు మొక్క లేదంటే... దుకాణం బంద్, కొళాయి కట్ ప్లాస్టిక్ కవర్లపై పదేళ్లుగా నిషేధం.. కాగితాల్లోని సకలం ప్యాకింగ్ ఊరు చెడితే ఊరుకోడు! ‘స్వచ్ఛ - పచ్చ’లో తాడిపత్రి స్పెషల్ (తాడిపత్రి) ‘మొక్కలు నాటవలెను. ప్లాస్టిక్ కవర్లు వాడరాదు. ఎక్కడ పడితే అక్కడ ‘సుస్సు’ పోయరాదు. చెత్త వేయరాదు’.. ఇవన్నీ అన్ని చోట్లా కనిపించే, వినిపించే నినాదాలే! అమలు విషయానికొచ్చేసరి�� �ి అంతా తుస్సే! కానీ... తాడిపత్రిలో మాత్రం పరమ సి్ట్రక్టు! ఎవరైనా, ఎక్కడైనా రోడ్డు పక్కన పాస్ పోద్దామనుకుంటే... ‘దుడ్డుకర్ర పట్టుకుని నిలుచున్న ఎమ్మెల్యే’ ఫొటో కళ్లముందు కనిపిస్తుంది. అంతే... ‘జిప్ చుప్’! ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జనాన్ని భయపెట్టి మరీ తాడిపత్రిని ‘స్వచ్ఛంగా’ ఉంచుతున్నారు. ‘భయమో, భక్తో... అంతా మన మంచికే! ఆయన వల్లే మా తాడిపత్రి శుభ్రంగా ఉంటోంది’ అని జనమూ సహకరిస్తున్నారు. కవరుకు కటకటే తాడిపత్రి బస్తీమే సవాల్... ఎవరైనా, ఎక్కడైనా ఒక్క ప్లాస్టిక్ కవర్ (క్యారీ బ్యాగ్) చూపించగలరా? చూపించలేరు. మునిసిపాలిటీలో ‘ప్లాస్టిక్’ నిషేధం యమ సి్ట్రక్టుగా అమలవుతోంది. కిరాణా షాపులో కందిపప్పు కొన్నా, బండి మీద అరటిపండ్లు కొన్నా... కాగితంలోనే ప్యాక్ చేసి ఇస్తారు. దీనికీ జేసీ ప్రభాకర్ రెడ్డి చొరవే కారణం. పదేళ్లుగా ఇక్కడ ప్లాస్టిక్‌పై నిషేధం అమలవుతోంది. అది కూడా సంపూర్ణంగా! ప్లాస్టిక్ కవర్లను విక్రయించరాదని పట్టణంలోని దుకాణాదారులతో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా పేపరు కవర్లు, జనపనార సంచులను వాడాలని సూచించారు. అప్పట్లో ఎమ్మెల్యే ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నార�� �. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణంలోని పలు షాపులపై మునిసిపల్ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించారు. ఎమ్మెల్యే తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చి భవిష్యత్తులో మరోసారి ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు జరిపితే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో పట్టణంలో కవర్లు అమ్మే వారు కరువయ్యారు. చిల్లర దుకాణాల యజమానులు కూడా ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాగితం కవర్లను వాడటం మొదలుపెట్టారు. మొదట్లో ఎమ్మెల్యే ఆదేశాలను భయంతో అమలు చేసినప్పటికీ... ఆ తర్వాత దీనిపై అందరిలోనూ చిత్తశుద్ధి కనిపించింది. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి జరిగే హాని గురించి ప్రజలతోపాటు విద్యార్థులకూ వివరించారు. పట్టణంలోని కూడళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు. తాడిపత్రిలో విజయవంతంగా జరుగుతున్న ప్లాస్టిక్ నిషేధంపై ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పర్యావరణ విద్యలో పాఠ్యాంశంగా మారడం విశేషం! ఎమ్మెల్యే సహకారం వల్లే! తాడిపత్రిలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, మొక్కల పెంపకం కేవలం ఎమ్మెల్యే కృషివల్లే విజయవంతమవుతోంది. ప్లాస్టిక్ నిషేధం అమలు గురించి రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు చెందిన అధికారులు తాడిపత్రికి వచ్చి ఆశ్చర్యపడ్డారు. తమ మున్సిపాలిటీల్లో కూడా సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం చేసేందుకు తాడిపత్రిలో అనుసరించిన విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. - శివరామకృష్ణ, మునిసిపల్ కమిషనర్ మొక్కకు లెక్క... తాడిపత్రిలో ప్రతి దుకాణం ముందూ మొక్కను నాటాల్సిందే. మొక్క నాటేసి చేతికి అంటిన మట్టిని దులుపుకొంటే సరిపోదు. దానికి నీరు పోయాలి. సంరక్షించాలి. పెంచి పెద్ద చేయాలి. మొక్క నాటకున్నా, నాటిన మొక్క ఎండిపోయినా... షాపు క్లోజ్, సీజ్! మళ్లీ మొక్కను నాటి, అది పచ్చబడిన తర్వాతే దుకాణం తెరుచుకుంటుంది. ఇప్పటిదాకా పట్టణంలోని ఏడు దుకాణాలను ఇలా సీజ్‌చేసి, రూ.2 వేలు చొప్పున జరిమానా విధించారు. ‘నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం’ అనే భయంతో ప్రతి దుకాణం యజమాని మొక్కలను శ్రద్ధగా పెంచుతున్నారు. ఈ నిబంధన షాపులకు మాత్రమే పరిమితం కాదండోయ్! ఇంటింటికీ మొక్కను పెంచాల్సిందే. పెంచకపోతే ఏం చేస్తారంటారా? కొళాయి కనెక్షన్ కట్ చేస్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఈ హెచ్చరిక చేశారు. ‘ఎమ్మెల్యే ఏం చెప్పినా చేస్తారు’ అనే భయంతో జనం ఇళ్లముందు మొక్కలు పెంచుకుంటున్నారు. వాటర్ వర్క్స్‌లో నర్సరీని ఏర్పాటు చేసి మునిసిపల్ అధికారులు మొక్కలు పంపిణీ చేస్తున్నారు Quote Link to comment Share on other sites More sharing options...
The Warrior Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 nice Quote Link to comment Share on other sites More sharing options...
idibezwada Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 CBN gadu idi across state apply cheyyali Quote Link to comment Share on other sites More sharing options...
The Warrior Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 3 minutes ago, idibezwada said: CBN garu idi across state apply cheyyali corrected Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 Calling @SonaParv_522 Quote Link to comment Share on other sites More sharing options...
DannyArcher Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 nice Gp Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Prabhas_Fan Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 very nice...Real hero Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 lol pulkhas kammagajjikutra Quote Link to comment Share on other sites More sharing options...
chichi Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 edoka laffooot gadu Quote Link to comment Share on other sites More sharing options...
Chanti_Abbai Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 Good Quote Link to comment Share on other sites More sharing options...
sampangi Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
ranku_mogudu Posted May 31, 2016 Report Share Posted May 31, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.