JANASENA Posted January 6, 2017 Report Share Posted January 6, 2017 తిరుమల: గతేడాది రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపద మొక్కుల వాడికి కానుకల వర్షం కురిపించారు. 2016 సంవత్సరంలో 2.55 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి డి.సాంబశివరావు తెలిపారు. హుండీ ఆదాయం కూడా భారీ స్థాయిలో వచ్చింది. ఏడాదిలో 1,018 కోట్ల రూపాయలను భక్తులు హుండీలో సమర్పించారు. 10.34లక్షల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు ఈవో వెల్లడించారు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరాయంగా భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు జరిగాయని వివరించారు. ఈనెల 8న ఉదయం 9గంటలకు తిరువీధుల్లో స్వర్ణరథంపై శ్రీవారి వూరేగింపు, 9న వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 8,9 తేదీల్లో అన్ని అర్జిత సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. కనుమ పండుగ రోజున తితిదే ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో గోపూజలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted January 6, 2017 Report Share Posted January 6, 2017 Zing zing ... amazing Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted January 6, 2017 Report Share Posted January 6, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
bindazking Posted January 6, 2017 Report Share Posted January 6, 2017 Venkanna ki 1000 kotlu... vintaaniki baane undhi.. kaani aa dabbu emi chesthunnaaro.. evadi intloki velthundho.. god only knows. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.