kingmakers Posted July 8, 2010 Report Posted July 8, 2010 పీఆర్పీ ఎమ్మెల్యే హుషార్!మంత్రి పదవులపై ఆశల పల్లకిహైదరాబాద్ : కాంగ్రెస్‌లోని తాజా పరిణామాలు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేల్లో హుషారు పెంచుతున్నాయి. జగన్ వేరుకుంపటి పెడతారన్న ప్రచారంతో కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద తమ పరపతి పెరుగుతుందని, ప్రభుత్వ మనుగడకు తమపై ఆధారపడక తప్పదని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేల వదనాల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. మంత్రివర్గ విస్తరణలో తమకూ కొన్ని బెర్తులు వస్తాయని వారు భావిస్తున్నారు.ఎన్ని మంత్రి పదవులు అడగాలనుకొంటున్నారని ఒక ఎమ్మెల్యేను ప్రశ్నించినప్పుడు 'మేం అడగడం ఏంటి? ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వమే మమ్మల్ని అడిగే పరిస్థితి ఉంది' అని బదులిచ్చారు. రెండు, మూడు పదవులు దక్కవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఎవరికి అవకాశాలు ఉంటాయన్న దానిపై తర్జనభర్జనలూ మొదలయ్యాయి. ప్రస్తుత పీఆర్పీ ఎమ్మెల్యేల్లో ఒకసారికి మించి ఎన్నికైన వారిలో బండారు సత్యానందరావు, గంటా శ్రీనివాసరావు, శోభా నాగిరెడ్డి ఉన్నారు.వంగా గీత ఎమ్మెల్యేగా లేకపోయినా రాజ్యసభ సభ్యురాలిగా, జడ్పీ చైర్‌పర్సన్‌గా చేశారు. వీరిలోనే కొందరికి మంత్రిపదవులు దక్కవచ్చని కొందరు అంచనా వేస్తుండగా, మరి కొందరు మాత్రం ప్రాంతాలు సామాజిక సమీకరణాలను బట్టి ఇంకొన్ని పేర్లు కూడా పరిశీలనకు రావచ్చని చెబుతున్నారు. చిరంజీవి మంత్రివర్గంలో చేరతారా లేదా అన్నదానిపై మాత్రం నోరు విప్పడం లేదు. 'ఆయన చేరకపోవచ్చు. ఆయనను సీఎం అభ్యర్థిగా పరిగణిస్తున్నాం. జగన్ బయటకు వెళ్లిపోతే కాంగ్రెస్ నాయకత్వం చిరంజీవిని భవిష్యత్ సీఎం అభ్యర్థిగా ముందుకు తెచ్చే అవకాశాలు లేకపోలేవు' అని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.మళ్లీ పీఆర్పీ గూటికి చేరిన అనిల్తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ఎరావత్ అనిల్ మళ్లీ ఆ పార్టీ గూటికి చేరారు. బుధవారం అసెంబ్లీలో పీఆర్పీ తరఫున మాట్లాడే అవకాశాన్ని అనిల్‌కు ఇవ్వడం దీన్ని «ద్రువీకరించింది. చిరంజీవి కూడా 'అనిల్ మాతోనే ఉన్నారు. అప్పటి పరిస్థితుల్లో కొంత స్తబ్దంగా ఉన్నారు. అది ఆయన తప్పు కాదు.అక్కడి పరిస్థితులను బట్టి వ్యవహరించారు. అధిక సంఖ్యాకుల అభిప్రాయాలకు అనుగుణంగా మేం వ్యవహరించాం' అని అసెంబ్లీ లాబీల్లో చెప్పారు. తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కూడా మళ్లీ వస్తారా అన్న ప్రశ్నకు 'అది చర్చించాల్సిన అంశం' అంటూ వెళ్లిపోయారు.
Recommended Posts