SonyKongara Posted March 7, 2017 Report Posted March 7, 2017 కొత్త కొత్తగా! అమరావతికి సరికొత్త డిజైన్ల రాక శాసనసభ కొత్త భవనం ప్రారంభం నేడే ప్రపంచ టాప్-5లో అమరావతి ఈ లక్ష్యానికి అనుగుణంగా డిజైన్లు అందరి అభిప్రాయాలకూ విలువ: సీఎం నాలుగు రకాల డిజైన్ల పరిశీలన నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ ప్రతి కట్టడం విలక్షణంగా ఉండాలి ఎలాంటి లోపాలు ఉండకూడదు మాస్టర్ ఆర్కిటెక్ట్‌కు సీఎం ఆదేశం ప్రభుత్వ భవన సముదాయాలకు.. 4 ప్రాథమిక డిజైన్లు అందజేసిన నార్మన్ ఫోస్టర్ అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సిద్ధం చేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో వీటిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో చేపట్టే నిర్మాణాల డిజైన్లు అత్యంత విలక్షణంగా ఉండాలని మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు అత్యుత్తమంగా ఉండాలని, ఐకానిక్ బిల్డింగులుగా నిర్మించదలచిన అసెంబ్లీ, హైకోర్టు భవంతులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలోని ప్రతి కట్టడం దేనికదే విలక్షణంగా ఉండాలని స్పష్టం చేశారు. రాజధాని ఏదో ఒక స్థాయి నగరంగా రూపొందితే చాలని తాము అనుకోవడం లేదని, ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా అది నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాజధానిలోని ప్రతి నిర్మాణం, కట్టడంలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించాలన్న సీఎం రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా రాజధానిలోకి ప్రవేశించగానే అది తమ సొంతమని భావించేలా దాని నిర్మాణం జరగాలని సూచించారు. ఈ ఉద్దేశంతోనే రాజధాని కట్టడాల డిజైన్ల రూపకల్పనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతోపాటు అనుభవజ్ఞులైన స్థానిక ఆర్కిటెక్ట్‌ల సహాయ సహకారాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోనే గొప్ప నూతన రాజఽధాని నగరాలుగా పేరొందిన గాంధీనగర్, నయా రాయపూర్, చండీగఢ్ వంటి వాటిలోనూ ఒక్కొక్క దానిలో ఒక్కోరకమైన లోపం కనిపిస్తుందని, అయితే అమరావతిలో మాత్రం అలాంటి దానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వని రీతిలో డిజైన్లు రూపొందాలన్నారు. అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించనున్న ప్రభుత్వ భవంతుల సముదాయం (గవర్నమెంట్ కాంప్లెక్స్)కు సంబంధించి తాము రూపొందించిన 4 ప్రాథమిక డిజైన్లు(కాన్సెప్ట్యువల్ లెవల్ డిజైన్స్) కేవలం ఏఏ ప్రభుత్వ భవనాలు ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుందనే అంశంపై రూపొందించినవి మాత్రమేనని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చెప్పారు. వీటిపై అందరి అభిప్రాయాలను తీసుకుని త్వరలోనే ముసాయిదా, తుది డిజైన్లను రూపొందిస్తామని చెప్పారు. అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటాం రాజధాని డిజైన్లు, నిర్మాణానికి సంబంధించిన అంశాలపై రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయాలను తీసుకోవాలని, సోషల్ మీడియాను ఇందు కోసం ఉపయోగించుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు త్వరలో ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించాలని ఏపీసీఆర్డీయే కమిషనర్ శ్రీధర్‌ను ఆదేశించారు. ప్రాథమిక డిజైన్లపై అభిప్రాయాలు, సలహాలు సూచనలు తెలుసుకునేందుకు గురువారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, అన్ని శాఖల అధిపతులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాంను ఆదేశించారు. ఆ గ్రామాలు అస్తిత్వం కోల్పోకూడదు అమరావతి నిర్మాణ ప్రక్రియ కారణంగా రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్థిత్వాన్ని ఏదో ఒక రూపంలో నిక్షిప్తం చేయాల్సి ఉందని, ఇందుకోసం ఒక కార్యప్రణాళికను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సూచనతో చంద్రబాబు ఏకీభవించారు. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో, నగర నిర్మాణంలో ఏ తరహా విధానాలను అనుసరించాలో నిర్ణయించేందుకు ప్రపంచంలో ఉన్న అన్ని అత్యుత్తమ విధానాలను పరిశీలించాలని సీఎం సూచించారు. Quote
SonyKongara Posted March 7, 2017 Author Report Posted March 7, 2017 నార్మన్‌ఫోస్టర్ ఆకృతులపై చంద్రబాబు సమీక్ష అమరావతి: కృష్ణా నది ఒడ్డున నిర్మించే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి నదీ ప్రవాహక కాలువ ప్రత్యేక ఆకర్షణ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నది నుంచి ప్రభుత్వ భవన సముదాయం ఉండే ప్రాంతం వరకు కాలువ ద్వారా నీరు ప్రవహించి, తిరిగి తనకు నదిలో కలిసేలా ప్రణాళికలు ఉండాలని నార్మన్ ఫోస్టర్ సంస్ధ ప్రతినిధులకు తెలిపినట్లు సీఎం వివరించారు. రాజధానిలో వాహన కాలుష్య నియంత్రణకు ఈ కాలువ మార్గం ద్వారా స్పీడ్ బోటింగ్, వాటర్ టాక్సీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అమరావతిలో పరిపాలన నగర నిర్మాణం కోసం బ్రిటీష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ అందించిన ప్రణాళికలపై మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. నార్మన్ ఫోస్టర్ అందించిన ప్రణాళికలపై మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను స్వీకరించారు. అమరావతి నిర్మాణంపై అందరి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకునేందుకు ఇకపై తరచూ సమావేశాలు నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు. పరిపాలన నగరం ఒక్కటే కాకుండా అమరావతిలో నిర్మించ తలపెట్టిన మరో 8 నగరాలు, 27 టౌన్ఫషిప్లపై సూచనలు, సలహాలు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రజలలో విస్తృతంగా చర్చ జరగాలని, నిర్మాణాత్మక సూచనలు వారి నుంచి కూడా స్వీకరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. అమరావతి ప్రణాళికలపై డిబేట్ జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త రాజధానిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏసీ పెట్టించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగులు సౌకర్యవంతంగా వుంటేనే ఫలితాలు వస్తాయని, ఉత్పాదకత పెరుగుతుందని సీయం చంద్రబాబు అన్నారు. Quote
BaabuBangaram Posted March 7, 2017 Report Posted March 7, 2017 niyavva inka enni rojulu ra ee sollu... Quote
fake_Bezawada Posted March 7, 2017 Report Posted March 7, 2017 na laptop lo kooda masthu designs vunnayi ma menaludu chesadu na laptop lo 15 years kid intakante bavuntayi Quote
BaabuBangaram Posted March 7, 2017 Report Posted March 7, 2017 1 hour ago, fake_Bezawada said: na laptop lo kooda masthu designs vunnayi ma menaludu chesadu na laptop lo 15 years kid intakante bavuntayi naa mobile lo kuda vunnayi..... Quote
SonyKongara Posted March 7, 2017 Author Report Posted March 7, 2017 CBN Experience anta vundadu mi vayasu..meeru malli matladadam Quote
BaabuBangaram Posted March 7, 2017 Report Posted March 7, 2017 7 minutes ago, SonyKongara said: CBN Experience anta vundadu mi vayasu..meeru malli matladadam ayina em peekadu vaaya..... Quote
SonyKongara Posted March 7, 2017 Author Report Posted March 7, 2017 1 minute ago, BaabuBangaram said: ayina em peekadu vaaya..... Vijayawada flyover, assembly, raithu runa maafi, patti seema.. Quote
BaabuBangaram Posted March 7, 2017 Report Posted March 7, 2017 1 hour ago, SonyKongara said: Vijayawada flyover, assembly, raithu runa maafi, patti seema.. anni mee daggare chesikunte inka maaku migiledhi enti bochhu Quote
SonyKongara Posted March 7, 2017 Author Report Posted March 7, 2017 1 hour ago, BaabuBangaram said: anni mee daggare chesikunte inka maaku migiledhi enti bochhu meedi, maadi enti bro manadi..mana amaravathi Quote
Jai_MegaStar Posted March 7, 2017 Report Posted March 7, 2017 6 hours ago, fake_Bezawada said: na laptop lo kooda masthu designs vunnayi ma menaludu chesadu na laptop lo 15 years kid intakante bavuntayi Illu kattinchuko baa. aa designs tho Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.