Jump to content

Recommended Posts

Posted
intha comedy article ee madya chadavaledhu bros....
 
 
ఆయన మొన్నటివరకు తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త. నిన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో కీలక శాఖలకు మంత్రి. అటు గ్రామాలు, ఇటు ఐటీని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతలు ఆయన భుజస్కందాలపై పడ్డాయి. కానీ అర్ధరాత్రి వరకు జరుగుతున్న సమావేశాలపై మాత్రం ఆయన సీరియస్ అయ్యారు. ఆ నేత ఎవరో, ఎందుకు అంత సీరియస్ అయ్యారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
 
 
             పార్టీ బాధ్యతల నుంచి క్యాబినేట్‌లో కీలక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌కు కోపం వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ, అందరితో చలోక్తులు విసురుతూ మాట్లాడే లోకేశ్‌లో అసహనం ఉప్పొంగింది. ఊరకనే పెద్దలకి కోపం రాదు కదా! లోకేశ్‌బాబుకి కూడా ఇదే లాజిక్‌ వర్తించక తప్పదు మరి!
 
 
               నిన్నటివరకు గట్టుమీద ఉండి ప్రభుత్వాన్ని పరిశీలించిన లోకేశ్‌ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చేశారు. పైగా ఆయనకు అప్పగించిన శాఖలు కూడా సామాన్యమైనవి కావు. పంచాయతీరాజ్ అంటే గ్రామీణప్రాంతాలలో ప్రజానీకం సమస్యలను అర్ధంచేసుకుని పరిష్కరించే శాఖ. రోడ్లు, పంచాయతీలు, పారిశుద్ధ్యం, మంచినీరు... ఇలా ఒకటేమిటి- గ్రామీణ ప్రాంతాలకు చెందిన అన్ని బాధ్యతలు ఈ శాఖలో పరిధిలోనే ఉంటాయి. దీంతోపాటు ఆయనకి అప్పగించిన మరో కీలక శాఖ "ఐటీ''!
 
 
                రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకపోవడం ఒక లోటు అయితే- పరిశ్రమలు, ఐటీ రంగంలో వెనుకబాటు మరో లోటు! ప్రస్తుతం ఏపీలోని నిరుద్యోగులంతా ఐటీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వేలాదిగా బయటకొస్తున్న యువత కూడా ప్రస్తుతం ఐటీ ఉద్యోగవకాశాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలను ఏర్పాటుచేసి నిరుద్యోగులకు అవకాశాలను కల్పించాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీశాఖ కూడా లోకేశ్‌ వద్దే ఉంది. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి లోకేశ్‌ శాఖల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
 
                 ప్రస్తుత వేసవి సీజన్‌లో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటుచేస్తున్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉన్నట్టుగా సమాచారం అందితే గంటల వ్యవధిలోనే దాన్ని పరిష్కరించేలా అధికారులను పరుగులు తీయిస్తున్నారు. గ్రామీణప్రాంతాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. అధ్వానంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణానికి ప్రణాళికను సిద్ధంచేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కూడా పరుగులు తీయించాలన్న పట్టుదలతో లోకేశ్‌ పనిచేస్తున్నారు.
 
 
                ఇదిలా ఉంటే, ఇటీవల ముఖ్యమంత్రి వద్ద పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం మరికొన్ని సమీక్ష సమావేశాలు జరిగాయి. రాత్రి పదకొండు గంటలవరకు వాటితోనే కాలం గడిచింది. మరుసటి రోజు సీఎంఓలో జరుగుతున్న ఓ సమావేశానికి లోకేశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఒక అంశాన్ని అధికారులకు స్పష్టంచేశారు. రాత్రి ఎనిమిది దాటి తర్వాత ఎటువంటి సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. అవసరమైతే మరుసటి రోజు నిర్వహించుకోవాలని సూచించారు. సీఎంఓ అధికారులకు సైతం ఈ మేరకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వయసునీ, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోరా అంటూ సూటిగా ప్రశ్నించారు. అర్థరాత్రి సమావేశాలతో అధికారులకే కాదు ముఖ్యమంత్రికి కూడా ఇబ్బందేనని అన్నారు.
 
 
              చినబాబు పెద్ద మనసుతో చేసిన ఈ సూచనను అధికారులు వెంటనే అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలు రాత్రి ఎనిమిదిన్నర గంటల్లోపు ముగిసిపోతున్నాయి. దీంతో అటు అధికారులు, ఇటు సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. పైగా వెలగపూడి సచివాలయం నుంచి సీఎం ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో పలు గ్రామాలతోపాటు కృష్ణానది కరకట్ట కూడా ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా అంత రాత్రివేళ ప్రయాణించడం మంచిది కాదని కొంతమంది సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ చేసిన సూచన వల్ల పోలీసులు, మంత్రుల సహా మీడియా ప్రతినిధులకు కొంత వెసులుబాటు కల్పించిందనే చెప్పాలి. అయితే ఆయన ఆదేశాల ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో వేచిచూడాలి
Posted
Just now, kiraak_poradu said:

oh my konda dora save ap

ABN trying very hard to prove loki babu as leader ......  AP lo  jaggadu and loki babu options aa next terms ki  @~`

Posted

comedy em vundi samara. me ayya kastapaduthunte e age lo nuvvu kuda ilane chesthav 

Posted
Just now, ramudu said:

ABN trying very hard to prove loki babu as leader ......  AP lo  jaggadu and loki babu options aa next terms ki  @~`

God PK leda option kinda?

Posted
1 minute ago, trent said:

comedy em vundi samara. me ayya kastapaduthunte e age lo nuvvu kuda ilane chesthav 

ayyo raja .... ayya laa daka poinavaa ....  antee AP CBN sothaa , good to know 

Posted
Just now, ramudu said:

ayyo raja .... ayya laa daka poinavaa ....  antee AP CBN sothaa , good to know 

ante panditha puthra parama shunta antundu kaka....

 

Posted
2 minutes ago, kiraak_poradu said:

God PK leda option kinda?

vadi mind eppudu ela untadoo thelidhu ..... but unna vallaloo veedu better option 

Posted
Just now, ramudu said:

vadi mind eppudu ela untadoo thelidhu ..... but unna vallaloo veedu better option 

jaggadu antava?

 

Posted
Just now, kiraak_poradu said:

ante panditha puthra parama shunta antundu kaka....

 

lol .... criticism ni face cheyaleru kadha bro ..... assalu aa article chaduvuthy picha comedy gaa undi 

Posted
1 minute ago, kiraak_poradu said:

jaggadu antava?

 

God bro ... jaggadiki isthy AP ni ammesthadu :) 

Posted

after CBN

 

jaggade gathi AP ki 

iga discussions waste

Posted
Just now, ramudu said:

God bro ...

paisal levu ani cheppesindu kada kaka

iga etla gelusthadu etla manage chesthadu 

money leni elections vasthayi anla gelusthada?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...