Jump to content

ఆ యాప్తో దొంగలకు చుక్కలే...!


BaabuBangaram

Recommended Posts

అనంత పోలీసుల సరికొత్త ప్రయోగం 
* అది అనంతపురంలో ఒక నివాసం.. ఆ ఇంట్లో వాళ్లు వూరికి వెళుతూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంట్లో ఒక పరికరాన్ని అమర్చారు. ఒకరోజు గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తలుపు తట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు.. ఒక్కసారిగా అక్కడి జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటరులో అలారం మోగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్పందించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సదరు వ్యకి ఏదోఒక సంస్థకు చెందిన కరపత్రాలు పంచే క్రమంలో ఆ ఇంటి తలుపు తట్టినట్లు గుర్తించారు. అదేంటి.. ఎక్కడో ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి తలుపు తెరిస్తే జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో అలారం ఎలా మోగింది. అది ఏ ఇంట్లో మోగిందో పోలీసులకు ఎలా తెలిసింది. ఇలాంటి సందేహాలు రావడం సహజం. అదే పోలీసులు నూతనంగా ప్రవేశపెట్టిన లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌. సేఫ్‌ అనంతపురం పేరిట అక్కడి పోలీసులు ఈ యాప్‌ను ప్రవేశపెట్టి విజయవంతంగా ’నిర్వహిస్తున్నారు. ఇప్పుడీ యాప్‌ను జిల్లాలోనూ ప్రవేశపెట్టాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇందు కోసం జిల్లాకు 40 కెమెరాలు కేటాయించేందుకు డీజీపీ నండూరి సాంబశివరావు సైతం అంగీకరించారు.

ఇలా వినియోగిస్తారు.. 
ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ ద్వారా సంబంధిత వ్యక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. తాము ఎప్పుడైనా మూడు, నాలుగు రోజులు ఇంటికి తాళం వేసి వూరికి వెళ్లాల్సి వస్తే యాప్‌లో సదరు వివరాలు నమోదు చేసుకోవాలి. వూరికి వెళ్లే రోజు రెండు గంటల ముందు పోలీసులు వారిని ఫోన్‌ ద్వారా సంప్రదిస్తారు. సదరు ఇంటికి వెళ్లి ప్రధాన ద్వారం కనిపించేలా రహస్య ప్రదేశంలో నిఘా కెమెరాను అమర్చుతారు. దీనికి వైఫై సైతం ఏర్పాటు చేస్తారు. ఇంట్లో ఒక లైటు ఎప్పుడూ వెలిగి ఉండేలా చూస్తారు. ఈ సీసీ కెమెరాను జిల్లా పోలీసు కేంద్రంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరుతో అనుసంధానిస్తారు. గృహస్థులు తాళం వేసి వెళ్లిన తర్వాత ఎవరైనా ఆ ఇంట్లోకి వెళితే వెంటనే సీసీ కెమెరా పసిగడుతుంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో అలారం మోగుతుంది. తద్వారా సదరు ఇంట్లో ఎవరో ప్రవేశించినట్లు తెలిసిపోతుంది. కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలుపుతారు. వారు వెంటనే అప్రమత్తమైతే నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే అవకాశమూ ఉంటుంది. ఒకవేళ అప్పటికి వారు తప్పించుకుపోయినా సీసీ కెమెరాలోని పుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించి పట్టుకునే వీలుంటుంది. దొంగలు సీసీ కెమెరాను గుర్తించి దాన్ని తమతో పాటు ఎత్తుకుపోయినా వచ్చిన ఇబ్బందేమీ లేదు. జిల్లా పోలీసు కేంద్రంలో ఈ పుటేజీ భద్రంగా ఉంటుంది. సుమారు ఆరు నెలలుగా అనంతపురం పోలీసులు దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సుమారు పదివేల మందికి పైగా దీనిలో నమోదై ఉన్నారు. వీరి ప్రయత్నాన్ని డీజీపీ నండూరి సాంబశివరావు స్వయంగా అభినందించారు.

త్వరలోనే అమలు 
జిల్లాలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీ సాంబశివరావు ఈ విషయంపై ఎస్పీ త్రివిక్రమ వర్మతో చర్చించారు. జిల్లా కేంద్రానికి 40 కెమెరాలు ఇస్తామనీ.. సదరు యాప్‌ ఆధారిత సేవలను జిల్లాలోనూ చేపట్టాలని సూచించారు. దీనికి జిల్లా ఉన్నతాధికారులు సైతం సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ యాప్‌ను జిల్లాలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఎస్పీ త్రివిక్రమ వర్మ చెప్పారు.

 

PS : IDHI EENADU PAPER LO VACHHINDHI

 
Link to comment
Share on other sites

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Luke

    14

  • Android_Halwa

    14

  • ParmQ

    3

  • BaabuBangaram

    2

Popular Days

Top Posters In This Topic

3 minutes ago, Luke said:

#maagavale

Pacha Picha na Puke Luke

Pacha Pichi ekki pichi pichi ga Luke gani Puke kuda yellow ae..

Link to comment
Share on other sites

Just now, Luke said:

fraud howle gaadi pani katham anamaata ee app to @3$%

Mee bhajana batch motham diwala teeyadam khayam...govinda govinda..

Pacha Picha na Puke Luke

Pacha Pichi ekki pichi pichi ga Luke gani Puke kuda yellow ae..

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Mee bhajana batch motham diwala teeyadam khayam...govinda govinda..

Pacha Picha na Puke Luke

Pacha Pichi ekki pichi pichi ga Luke gani Puke kuda yellow ae..

 

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Mee bhajana batch motham diwala teeyadam khayam...govinda govinda..

Pacha Picha na Puke Luke

Pacha Pichi ekki pichi pichi ga Luke gani Puke kuda yellow ae..

 

1 minute ago, Android_Halwa said:

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...