Jump to content

కేసీఆర్ చుట్టూ సిబిఐ ఉచ్చు?


Annayya_fan

Recommended Posts

  • Replies 95
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    45

  • SSTNKM

    21

  • DiscoKing

    9

  • tables

    4

Popular Days

Top Posters In This Topic

1 hour ago, Annayya_fan said:

తమను ధిక్కరించేవారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

అది నిజమేనడానికి కేజ్రీవాల్, శశికళ, మాయావతి, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ లను ఉదాహరణగా చూపుతున్నారు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ పై కూడా అదే అస్త్రం ప్రయోగించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

బిజెపి కార్యవిస్తరణ యోజనలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెరాస ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తప్పుడు లెక్కలతో అబద్ధాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేసిన కేసీఆర్ కు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లు 'అమిత్ షాను తప్పుపట్టే స్థాయికి మీరు ఎదిగిపోయారా' అంటూ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ దెబ్బకి అమిత్ షా కూడా 'మేము ఎవరినో భయపెట్టడానికో, ఓడించడానికో రాలేదు' అని వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

అయితే... కేసీఆర్ దూకుడుని ఏమాత్రం ఊహించని బిజెపి శ్రేణులు ఒకింత తత్తరపాటుకి గురైనట్లుగానే తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణాదిన మొత్తం బిజెపికి గడ్డుకాలం దాపురిస్తుందని, ఎవరూ కేంద్రాన్ని లెక్కచేయరనే భయాందోళనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అందుకే కేసీఆర్ ని ఎలాగైనా నిలువరించాలని అధిష్టానాన్ని స్థానిక నాయకులు కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్నంతా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం 2006లో కేంద్ర కార్మిక శాఖా మంత్రిగా పనిచేసినప్పుడు కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలను బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అది 7,255 కోట్ల భారీ కుంభకోణం. కేంద్రమంత్రిగా కేసీఆర్ చేసిన ఒక్క సంతకంతో ఏకంగా 11 లక్షల మంది ఉద్యోగులు నష్టపోయినట్లుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం (ఈ పీ ఎఫ్ ఓ) సహారా గ్రూపులో జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. సహారా ఇండియా పరివార్ లోని ఐదు కంపెనీలకు సంబంధించిన ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను తామే స్వంతంగా నిర్వహించుకుంటామని సహారా గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం, ఈ పీ ఎఫ్ ఓ అభ్యంతరాలను కూడా తోసిరాజని అప్పటి కార్మిక శాఖా మంత్రి కేసీఆర్ ఇందుకు అనుమతిచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2006 జూన్ 12 న సహారాకు మినహాయింపు ఇచ్చిన కేసీఆర్ ఆ తరువాత రెండున్నర నెలలకే, అంటే ఆగస్టు 22న మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆయన తరువాత కార్మిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ అంశంపై సమగ్ర దర్యాప్తుకు అంగీకరించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఆ తరువాత ఆయన కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టేసారు. మంత్రిగా రాజీనామా చేసిన తరువాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు.

అప్పట్లో కేసీఆర్ కు సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న రాజశేఖర్ రెడ్డి అనే అధికారిపై కూడా సిబిఐ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంవో లో ప్రత్యేక కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. అప్పట్లో ఈయనే కేసీఆర్ కు ఓఎస్డీ గా పనిచేసారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే విలువైన సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది.

ఇది ఒకప్పటి విషయం. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం మళ్ళీ ఈ వ్యవహారాన్ని బయటకు తీయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆ కేసును చూపించి కేసీఆర్ ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే కేసీఆర్ కు కష్టాలు మొదలైనట్లే. మాటల మాంత్రికుడు ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాలి.

 

 

hamayya ma babu peru ledu chalu lekapothe manchitanam ane mata sachipoyedi

Link to comment
Share on other sites

Just now, Gundepotu_Gummadi said:

hamayya ma babu peru ledu chalu lekapothe manchitanam ane mata sachipoyedi

aa news cutting mana telangana vadula nunde gummadi i290xs.gif?1290241415

Link to comment
Share on other sites

Atlane ee TANA celebrations lo ee budda lafangi ni edho broker case lo irikinchi nalllolla cell ki partner ga paminvheyandi modi sir

Link to comment
Share on other sites

4 minutes ago, TOM_BHAYYA said:

Atlane ee TANA celebrations lo ee budda lafangi ni edho broker case lo irikinchi nalllolla cell ki partner ga paminvheyandi modi sir

edho case enduku vaa mana dubai sekhar apatalo bane case lu set chese vaadu dane open chesthe ipoye +-

Link to comment
Share on other sites

Just now, DiscoKing said:

edho case enduku vaa mana dubai sekhar apatalo bane case lu set chese vaadu dane open chesthe ipoye +-

TANA sabhalaki chevi reddy  guest anta @3$%@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...