Jump to content

అతణ్ని పెళ్లాడటం తప్పా


solman

Recommended Posts

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tennisluvr

    7

  • ICANWIN

    5

  • mastercheif

    5

  • kiraak_poradu

    4

Top Posters In This Topic

7 hours ago, solman said:

ప్ర: నాకు ఇరవైమూడేళ్లు. నేను ఇంజినీరింగ్‌లో బంగారు పతకం సాధించినదాన్ని. ఓ ప్రభుత్వ సంస్థలో మంచి స్థాయిలోనే ఉన్నాను. నేను చదివేటప్పుడు ఒకబ్బాయి ‘పెళ్లి చేసుకుంటావా’? అని అడిగాడు. ‘ముందు జీవితంలో నువ్వు స్థిరపడు. అప్పుడు వచ్చి మా అమ్మానాన్నలతో మాట్లాడు..!’ అని చెప్పాను. ఈ విషయాన్ని అప్పట్లోనే అమ్మతో చెప్పాను. నవ్వి వూరుకుంది. ఆ అబ్బాయి నా మాటల్ని చాలా పట్టుదలగా తీసుకున్నాడేమో పోటీ పరీక్షలు రాసి కేంద్రప్రభుత్వంలో సైంటిస్టుగా ఉద్యోగం సాధించాడు. మళ్లీ వచ్చి నన్ను అడిగాడు. నాకు తిరస్కరించడానికి ఏ కారణమూ కనిపించడం లేదు. అమ్మతో ‘మీరు ఒప్పుకుంటే అతనొచ్చి మాట్లాడతాడు..!’ అని చెప్పాను. అప్పట్నుంచి అమ్మతీరు మారిపోయింది. ‘అతణ్ని పెళ్లాడితే బంధువులందరూ మమ్మల్ని దూరం పెడతారు. మాకు తలవంపులు!’ అంటోంది కోపంగా. అతను వేరే కులంవాడు కావడం ఓ కారణం అనుకుంటున్నా. అతని ప్రేమలో తప్పేంటీ అనిపిస్తోంది. నేను ఇంకే అబ్బాయినీ అంగీకరించలేకపోతున్నా. కానీ అమ్మానాన్నా సమ్మతి లేకుండా పెళ్లాడాలనీ లేదు! ఏం చేయమంటారు? - ఓ సోదరి 
జ: ఇదంతా ఓ చక్కటి సినిమా కథలా ఉంది కదా! మీరు అతనికో లక్ష్యం నిర్దేశించడం, అతను పట్టుదలతో దాన్ని సాధించి మీ దగ్గరకు రావడం, ఒకరిపై ఒకరికున్న ప్రేమ.. అద్భుతంగా అనిపిస్తోంది అవునా! మీ పరవశంలో తప్పులేదు. ఇద్దరూ జీవితంలో కలిసి నడవాలని అనుకోవడం కూడా నేరం కాదు. అయితే ఆ ఆనందం నడుమ కాస్త ఆలోచనకీ చోటివ్వండి. మొదట మీ తల్లిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చూడండి. సామాజిక తలవంపులు.. అన్నది పెద్దమాటే కావొచ్చు. కానీ ఇరుకుటుంబాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక అంతరాలు ఎక్కువగా ఉన్నప్పుడు భవిష్యత్తులో మీకూ ఇబ్బందులు తప్పవు. కులాంతర, మతాంతర ప్రేమవివాహాలు వద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని నిజాయతీగా అంచనావేయమంటున్నా. సమస్యలొచ్చినా ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గకుండా కలిసి ఉండగలం అనుకుంటేనే ముందుకెళ్లమని చెబుతున్నా. ‘మీ భయాలు నాకు అర్థమయ్యాయి. భవిష్యత్తులో తలెత్తే పరిస్థితులని మనందరం ఇలా ఎదుర్కోవచ్చు. ఒకవేళ ప్రతికూలతే ఎక్కువగా ఉంటే ఇద్దరం మీ మాటే వింటాం!’ అని చెప్పగలిగితే తల్లిదండ్రుల్లోనూ అందోళన తగ్గుతుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి కుటుంబ, ఆర్థిక పరిస్థితినీ చూడండి. అన్నింటా మీకు సరితూగనక్కర్లేదు. కానీ మరీ ఎక్కువ అంతరం ఉంటే.. భవిష్యత్తులో మీకు ఎదురీత తప్పదని తెలుసుకోండి. ఇరు కుటుంబాల్లోని వ్యతిరేకతా, అంతరాలూ ఓవైపూ, వాటిని అధిగమించగల ఇద్దరి ప్రేమా అన్యోన్యతని ఓ వైపూ రాసుకోండి. నిక్కచ్చిగా బేరీజు వేయండి. సానుకూలతలు ఎక్కువగా ఉంటే, లేదా ప్రతికూలతలకు సమానంగా ఉంటే కలిసి నడిచేందుకు ప్రయత్నించండి. ప్రతికూలతలే ఎక్కువగా ఉంటే.. మరోసారి ఆలోచించుకోండి. ‘నా కోసం కెరీర్‌ని గొప్పగా మలచుకున్నవాణ్ని ఎలా వదులుకోవడం?’ అంటారా.. పెళ్లికి అదొక్కటే అర్హత కాదు అని తెలుసుకోండి. కనీసం ఆ కోణంలో ఆలోచించడానికి ప్రయత్నించండి చాలు!

Bro, actual no one ask suggestion to these guys ..they will creats question n wrote answers..to attract new readers amd to improve circulations..  this info i got fron one of my friend working in print media 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...