Jump to content

మన పరుగులు ఎప్పుడు?


TampaChinnodu

Recommended Posts

మన పరుగులు ఎప్పుడు? 
రికార్డులిక్కడ.. ప్రయాణాలక్కడ 
మెట్రో ప్రారంభంలో జాప్యం 
hyd-top1a.jpg

మన మెట్రో ఎప్పుడు? కొచి, బెంగళూరులో తాజాగా మెట్రో రైళ్లు ప్రారంభం కావడంతో సామాజిక మాధ్యమాల్లో హైదరాబాద్‌ మెట్రో ఎప్పుడనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా హెచ్‌ఎంఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఒక్కోటిగా మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కోచిలో ప్రధాని, బెంగళూరులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. మన దగ్గర 2014 నుంచి ఇదిగో అదిగో అంటున్నారే తప్ప కచ్చితంగా ఎప్పుడు ప్రారంభిస్తారనేదీ వెల్లడించడం లేదు. మంత్రి కేటీఆర్‌ ఈ ఏడాదిలోనే మెట్రో ప్రారంభిస్తామని తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విస్పష్టంగా ప్రకటించారే తప్ప ఎప్పుడనేదీ చెప్పలేదు.

అన్నీ చేజారుతూ.. 
దేశంలోనే అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్నది హైదరాబాద్‌ మెట్రోనే. రెండేళ్లలోనే నాగోల్‌-మెట్టుగూడ 8 కి.మీ., నాలుగేళ్లు తిరిగేసరికి మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు 12 కి.మీ. కలుపుకొని మొత్తం 20 కి.మీ. మార్గాన్ని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ పూర్తి చేసింది. ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లొచ్చని కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైలు సెఫ్టీ(సీఎంఆర్‌ఎస్‌) అనుమతులిచ్చేసింది. ప్రయాణికులకు అందుబాటులోకి రాకపోవడంతో వేగవంతమైన రికార్డులన్నీ నిరూపయోగంగా మారాయి.

అక్కడన్నీ స్వల్ప దూరాలే.. : అత్యంత వేగంగా పూర్తైన మెట్రోగా కోచి ప్రచారం జరుగుతున్నా అక్కడ దాదాపు నాలుగేళ్లలో పూర్తయ్యింది 13 కి.మీ. మాత్రమే. దేశంలోని అన్ని నగరాల్లోనూ నాలుగైదు ఏళ్లలో పూర్తయిన మెట్రో దూరాలు 10 కి.మీ. లోపే ఉన్నాయి. మన దగ్గర ఏకంగా ఒకేసారి 66 కి.మీ. పనులు జరుగుతున్నాయి. మూడు మార్గాల్లో పనులు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే పూర్తయిన మియాపూర్‌ నుంచి ఎఎస్‌ఆర్‌నగర్‌, నాగోల్‌ నుంచి మెట్టుగూడ స్వల్ప దూరాలే కావడంతో ప్రయాణికులకు పెద్దగా ఉపయోగకరంగా ఉండవని అధికారులు ఆలస్యాన్ని సమర్థించుకుంటున్నారు. మరింత ఎక్కువ దూరం పనులు పూర్తయ్యాక ప్రారంభిస్తామంటున్నా.. అక్కడ పనుల గడువును పొడిగించుకుంటూ పోతున్నారు.

hyd-top1b.jpg

ప్రశ్నల పరంపర 
నిత్యం ట్రాఫిక్‌లో నరకయాతన పడుతున్న నగరవాసులు... హైదరాబాద్‌ మెట్రో రైలు కార్యాలయానికి పౌరులు సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మెట్రో ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎందుకు జాప్యం? మలిదశ ఎక్కడెక్కడ ఉంటుందనే ప్రశ్నలను వేస్తున్నారు. దీనికి హెచ్‌ఎంఆర్‌ ఇది తమ పరిధిలో లేదని.. ప్రారంభంపై ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని సమాధానమిస్తున్నారు.

hyd-top1c.jpg
Link to comment
Share on other sites

9 minutes ago, Idassamed said:

Inka ennalllu dhora, metro start chesthava.ledha

elections time ki mundu edo oka phase start chestharu , leka pothe bad name ani.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...