Peddayana Posted July 27, 2017 Report Posted July 27, 2017 I'm suspecting that it might be a seller who sells in Amazon , he might have twisted the advertising as if the store itself is Amazon , creativity Quote
Bhai Posted July 28, 2017 Report Posted July 28, 2017 11 hours ago, Hitman said: Pattabi... "కనమర్లపూడి పట్టాభి రామయ్య "ఆ పేరు వింటేనే మా చీరాల చుట్టుపక్కల ఒక ఇరవై మండలాల ప్రజలు నోట్లో ఒక జీడిపప్పు లడ్డుముద్ద ఉన్నట్టు ,తియ్యగా మారిపోతారు .పేద మధ్యతరగతి ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా ,పట్టాభి గారి లడ్డో, బాదుషానో ,జాంగ్రీనో విస్తట్లో పడాల్సిందే !నలుగురన్నదమ్ముల్లో పట్టాభి గారు పెద్ద ,మొదట మా చీరాల ప్రసాద్ థియేటర్ సెంటరులో ఒక చిన్న బడ్డీకొట్లో స్వీట్ షాప్ ప్రారంభించిన పట్టాభి గారు ,మొన్నటి దాకా తమ్ముళ్ళని సాకి ,మొదటినుండి పాలతో తయారయ్యే ఖరీదయిన స్వీట్ల జోలికిపోకుండా ఏవో ప్రధానంగా ఒక ఐదు రకాలు మాత్రమే మంచి నాణ్యత తోబాటు అతి చవగ్గా అందించటం మొదలెట్టారు .ఏ స్వీటు అయినా "కిలొ యనభై రూపాయాలు మాత్రమే".సగం జీడిపప్పు కూరిన xxx (త్రిబుల్ ఎక్స్) లడ్డు మాత్రం కిలోకి నూటఇరవై రూపాయాలు ,అదికూడా జీళ్ళ రేటు పెరగటంవల్లే !!అంత క్వాలిటీ ఉన్న లడ్లు అంత తక్కువరేటుకు ఇవ్వడం వలన చీరాలకి రెండువందల కిలొమీటర్ల దూరంలో ఉన్న గిద్దలూరు ప్రాంతం వాళ్ళు కూడా RTC బస్సు ల వాళ్ళ చేత తెప్పించుకుంటారు పెళ్లిళ్లకి .కొట్లో కుర్రాళ్ళకి టి తాగటానికి టైముండదు . మనం అడ్వాన్స్ ఇవ్వకుండా ఒక వంద కేజీలు ఆర్డర్ చెప్పి, వెళ్లకపోయినా !!మనకి కనీసం ఫోను కూడా చెయ్యరు వాళ్ళు ,ఎందుకంటే ,వాటిని కొట్లో పెడితే ఒక నాలుగుగంటల్లో అమ్ముడుపోతాయ్ !! చాలా షాపుల్లో మిఠాయిలు పెట్టిన పళ్లెం అట్లాగే ఉంటుంది ,రెండుమూడు రోజులకి కూడా అవ్వి అమ్ముడుపోక!! .పట్టాభి గారి కొట్లో మాత్రం పది కేజీల పళ్ళాలు వస్తూ ఉంటాయ్ !!అయిపోతూ ఉంటాయ్ !!నాకయితే మాయాబజార్ సినిమాలో sv రంగారావు గారి వివాహ భోజనమ్ము పాట గుర్తొస్తుంది ఆషాపుకెళ్లినప్పుడల్లా !!విచిత్రం గా పట్టాభి గారి కొట్టు ప్రక్కనే మరొ రెండు మిఠాయి కోట్లున్నాయ్ ,ఇక్కడ సరుకు దొరకక ఉత్త చేతుల్తో వెళ్లడం ఇష్టపడనివాళ్ళు అక్కడ కెళ్లి కొనుక్కుపోతూ వుంటారు .పట్టాభి గారికొట్లో సీజన్లో రోజుకి వెయ్యి కిలొల వరకు చేస్తారని పేరుంది ......... కేవలం మిఠాయిలు అమ్మే! జనాల మనసు దోచుకున్నాడా అంటే !సమాధానం !!ఏదన్నా గుడి కట్టాలన్నా !చర్చిల్లో వేడుకయినా !దర్గాల్లో గంధ మహోత్సవాలయినా !కాదనకుండా సహాయం చేసే గుణం పట్టాభిగారిది .చీరాల అయ్యప్ప స్వామి గుళ్లో ఒక రెండునెలల పాటు రెండుపూట్లా పంచభక్ష్య పరమాన్నాలతో అన్నదానం చేసేవారాయన .ఆయన వున్నరోజుల్లో ఏదన్నా కొత్త వ్యాపారానికి మొదటి కొనుగోలుదారులు పట్టాభి గారే!!ఆయన హస్తవాసికి అంతమంచి పేరుంది . మునిసిపల్ ఎన్నికల్లో మా చీరాల్లో ఉనికిలేని బీజేపీ తరఫున కొన్సిలర్ గా పోటిచేసి ,గెలిచిన తర్వాత ఓటేసిన వాళ్లకి ,వెయ్యని వాళ్లకి కూడా పెద్ద పెద్ద లడ్లు పంచాడాయన !!విశేషం ఎంటంటే ఆ వార్డులో "నవాబ్ పేట" లోని సగం ఇళ్ళు కలిసి ఉంటాయ్ ..చీరాల లో పాతుకుపోయిన మిఠాయి కొట్లు రవి, రమ్య షాపులకు నీళ్లు పోసింది పట్టాభి గారే!!!! ఆయన మరణించిన చాల రోజులు మాత్రం చీరాల చుట్టుపక్కల ఏ స్వీటు నోట్లో వేస్కొన్నా చేదుగా మారిపోయింది .ఒక నెలరోజుల పాటు అనధికార సంతాపదినాలు పాటించారు మా జనాలు .. idhi e site lo dorikindi?? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.