Jump to content

ముగిసిన బాబు, పవన్ల ఏకాంత భేటీ


JANASENA

Recommended Posts

31BRK100A.jpg

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏకాంత భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ ఏకాంత భేటీలో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలతో పాటు, పోలవరం, రాజధాని నిర్మాణం, మంజునాథ కమిషన్‌ నివేదిక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. అమరావతి నిర్మాణానికి ఈ మూడేళ్లలో తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబు.. పవన్‌కు వివరించినట్టు సమాచారం. కాపు రిజర్వేషన్లపై చర్యలు ముమ్మరం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

31BRK100B.jpg

పవన్‌ చొరవ ముదావహం: సీఎం 
ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవ తీసుకోవడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా పీడిస్తూనే ఉందని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. హార్వర్డ్‌ వైద్య బృందం సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని సీఎం స్పష్టంచేశారు. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామన్నారు. వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్గించే అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుందన్నారు.

31break100d.jpg

హార్వర్డ్‌ వైద్య బృందంతో సీఎం భేటీ 
ఏకాంత భేటీ అనంతరం హర్వర్డ్‌ ప్రొఫెసర్లు, వైద్యుల బృందంతో కలిసి పవన్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య హార్వర్డ్‌ వైద్య బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    10

  • johnubhai_01

    5

  • Pipucbn

    5

  • Raithu_bidda_

    2

Popular Days

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...