TampaChinnodu Posted September 26, 2017 Author Report Posted September 26, 2017 కార్పొరేషన్ కలిపింది.. ముగ్గురినీ..! వీఎంసీ ఉద్యోగుల్లో కలకలం సంచలనం సృష్టించిన అనిశా దాడులు నోరెేళ్లబెట్టిన అధికారులు ఈనాడు, విజయవాడ నగరపాలక సంస్థలో ఉద్యోగులుగా పరిచయం.....తరువాత పరిణాయానికి దారితీసింది. దంపతులయ్యారు. వారికి మరో ఉన్నతోద్యోగి పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ఆర్థిక లావాదేవీల వైపు నడిపించింది. అక్రమ సంపాదనకు బినామీలుగా మారారు. ఉద్యోగులుగా ఉంటూనే సంస్థలు ప్రారంభించారు. సేవ పేరుతో ఆస్తులు కూడబెట్టారు. వూరిచివర ఒంటరిగా ఉన్న బంగ్లాలో ఆ దంపతులు ఇద్దరే కాపురం ఉంటూ సాయిమందిరం నిర్మాణం చేసి భక్తితత్వంతో తరిస్తున్నారని అందరూ భావించారు. కానీ అవినీతి నిరోధక శాఖ దాడుల్లో వారి అసలు స్వరూపం బయటపడింది. కట్టల పాములే కాదు.. బంగారు కొండలు.. వెండి మేటలు. స్థిరాస్తుల కాగితాల గుట్టలు వెలగు చూశాయి. ఇది తెలిసిన స్థానికులు నోరు వెళ్లబెట్టారు. అనిశా అధికారులు సైతం అవాక్కయ్యారు. తాము నిర్వహించిన దాడుల్లో ఇంత భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూడలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. బంగారం అపురూపంగా చూసుకుంటారు. ఉన్న కొద్దిపాటి బంగారాన్నైనా జాగ్రత్తగా భద్ర పరుచుకుంటారు. లేదా బ్యాంకు లాకర్లలో దాచేస్తారు. కానీ ఈ దంపతులు మాత్రం బంగారు గొలుసులు బట్టలు ఉతికే యంత్రం (వాషింగ్ మిషన్)లో దాచారు. రూ.కోట్ల విలువ చేసే ఆభరణాలు ఇతర చర ఆస్తులు దగ్గర ఉంచుకొని ఏమాత్రం దొంగల భయం లేకుండా ఆ వెంచర్‌లో ఒక్కరే నివాసం ఉండటం అనిశా పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. సోమవారంనాడు అనిశా దాడుల్లో వెలుగు చూసి శివప్రసాద్ దంపతుల శైలి ఇది. విజయవాడ నగరపాలక సంస్థలో జూనియర్ టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్న వెంకటశివప్రసాద్ గన్నవరం మండలంలో రాఫిన్ రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన వెంచర్ భార్గవి నగర్‌లో నిర్మాణం చేసిన ఒకే ఇంటిలో వీరు నివాసం ఉంటున్నారు. పక్కనే వీరే నిర్మాణం చేసిన సాయిబాబా దేవాలయం ఉంది. విజయవాడ కార్పొరేషన్‌లో సర్కిల్ 3లో పటమట సమీపంలోని కార్యాలయంలో శివప్రసాద్ జూనియర్ టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్నారు. కార్పొరేషన్ కలిపింది..! రాష్ట్ర పట్టణ, నగరప్రణాళిక సంచాలకులు గొల్లవెంకటరఘు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అనిశా సోమవారం ఉదయం నుంచే దాడులు నిర్వహించారు. అందులో భాగంగా రఘు బినామీగా భావిస్తున్న శివప్రసాద్ నివాసంపై దాడులు నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. అసలు నిందితుని కంటే బినామీ దగ్గరే రూ. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించడం విశేషం. దస్తావేజుల విలువ ప్రకారం దాదాపు రూ.15.25 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. కానీ స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ కలిపి ప్రస్తుత మార్కెట్ ప్రకారం వంద కోట్ల పైగా ఉంటుందని అంచనా. డీటీసీపీ డైరెక్టర్ రఘును, శివప్రసాద్ దంపతులను విజయవాడ నగరపాలక సంస్థ కలిపింది. రఘు వీఎంసీలో మూడేళ్లపాటు సిటీ ప్లానర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు ఆయన విజయవాడ కార్పొరేషన్‌లో పనిచేశారు. ఆసందర్భంలో ఏర్పడిన వారి పరిచయం కాస్త స్నేహ బంధంగా మారింది. అత్యంత ఆప్తులుగా మారారని తెలిసింది. దీంతో అన్ని వైపుల నుంచి అక్రమ సంపాదన ప్రవాహం చేరింది. విజయవాడ నగరానికి చెందిన శివప్రసాద్ గుణదల ప్రాంతంలో ఉండేవారు. ఐటీఐ మాత్రమే చదివారు. 1984లో విజయవాడ నగరపాలక సంస్థలో ఎన్‌ఎంఆర్‌గా వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 1991లో ఆయనను శాశ్వత ఉద్యోగిగా నియామకం చేశారు. 1992లో చింతమనేని గాయత్రి నగరపాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. మోరంపూడి గ్రామానికి చెందిన వీరభద్రరావు, సరోజిని దేవిల కుమార్తె. తండ్రి మునసబ్‌గా పనిచేసేవారు. తల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తూ కాలం చేయడంతో కారుణ్య ఉద్యోగం పొందారు. దీనికింద మొదట వీఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన ఆమె తర్వాత 1997లో ఏఈఈగా పదోన్నతి పొందారు. శాఖపరమైన పరీక్షలు రాసి పదోన్నతి సాధించారు. నగరపాలక సంస్థలో పరిచయమైన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో వీఎంసీలో గాయత్రి ఒక్క వెలుగు వెలిగారు. జూనియర్ అసిస్టెంటుగా ఉన్న ఆమె తన స్థాయికి మించి ఇంఛార్జి హోదాలో పదవులు నిర్వహించారు. నాడు పనిచేసిన ఓ కమీషనర్‌తో పరిచయం ఏర్పడింది. ఆపరిచయంతో ఆమెకు పదవులు లభించాయనే ఆరోపణ ఉంది. నగరపాలక సంస్థలో ఉద్యాన శాఖకు బదిలీ అయిన ఆమె రాజీవ్ గాంధీ పార్కుకు ఇంఛార్జిగా వ్యవహరించారు. ఇంఛార్జి హోదాలోనే కేర్‌టేకర్‌గా, ఏడీహెచ్ ఇంఛార్జిగా వ్యవహరించారు. ఆసమయంలో పలు ఫిర్యాదులు వచ్చాయి. పార్కు నిర్వహణలో నిధులు స్వాహా అయినట్లు ఆరోపణలు వచ్చాయి. కడియం మెక్కల పేరుతోనూ నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. మచిలీపట్నం, జగ్గయ్యపేటలకు బదిలీ అయింది. తర్వాత తిరిగి విజయవాడ కు వచ్చారు. 2015 డిసెంబరులో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీఎంసీలో పనిచేసే సమయంలోనే రఘు 2002లో సిటీ ప్లానర్‌గా బదిలీపై వచ్చారు. ఆయనతో పరిచయం ఏర్పడింది. ఇది స్నేహబంధానికి దారి తీసింది. నాటి నుంచి వారి స్నేహం కొనసాగుతూనే ఉంది. శివప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాప, బాబు. ఒకరు బెంగళూరులోనూ, మరొకరు హైదరాబాద్‌లోనూ చదువుతున్నారు. ఇద్దరే ప్రస్తుతం ఉంటున్నారు. శివప్రసాద్ పటమటలోని సర్కిల్ 3 కార్యాలయంలో జెటీఓగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉండగానే సంస్థలు..! శివప్రసాద్ భార్య గాయత్రి ఉద్యోగంలో ఉండగానే పలు సంస్థలను ప్రారంభించడం విశేషం. వాటికి ఒకే చిరునామా ఉన్నాయి. సాయి సాధన ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ సంస్థను 2012లో మాచవరంలో ప్రారంభించారు. సాయి సుధా అవెన్యూ ప్రైవేటు లిమిటెడ్, సబూరి బిల్డర్స్, శ్రీమాతా ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్ పేరుతో స్థిరాస్తి వ్యాపారాలు ప్రారంభించారు. సాయి మిధుల పేరుతో 1.40 ఎకరాలల్లో ఒక పెద్ద కల్యాణమండపం నిర్మాణం చేశారు. స్థిరాస్తులకు కొదవే లేదు. విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. భవనాలు, నివేశన స్థలాలు, ఫ్లాట్లు ఉన్నాయి. వ్యవసాయ భూములు, కొబ్బరితోటలు కొనుగోలు చేయడం విశేషం. ఇవన్నీ వాస్తవ విలువను తగ్గించి చూపినట్లు తెలిసింది. గాయత్రి నివాసంలో దొరికిన బంగారు, వజ్ర వైఢూర్యాల, వెండి ఆభరణాలు దాదాపు 8కేజీలు. వీటి విలువ రూ.4కోట్లుగా చెబుతున్నారు. వీటిలో కొన్ని టీడీసీపీ డైరెక్టర్ రఘు భార్య పేరుతో కొనుగోలు చేసినట్లు రశీదులు దొరికాయి. దీన్ని బట్టి బినామీగా అనుమానిస్తున్నారు. రఘు, గాయత్రి మధ్య ఉన్న పరిచయం మేరకు ఎక్కువ స్థిర ఆస్తులు ఆమె పేరుతోనే కొనుగోలు చేసినట్లు అనిశా అధికారులు చెబుతున్నారు. Quote
TampaChinnodu Posted September 26, 2017 Author Report Posted September 26, 2017 విజయవాడ నగరపాలక సంస్థలో జూనియర్ టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్న వెంకటశివప్రసాద్ గన్నవరం మండలంలో రాఫిన్ రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన వెంచర్ భార్గవి నగర్‌లో నిర్మాణం చేసిన ఒకే ఇంటిలో వీరు నివాసం ఉంటున్నారు. పక్కనే వీరే నిర్మాణం చేసిన సాయిబాబా దేవాలయం ఉంది. Quote
guduraju Posted September 26, 2017 Report Posted September 26, 2017 Tagore cinema lo laa evado okkadu ravali ... 500 crs ante aasala ela tintunaru ee lucha gallu Quote
mustang302 Posted September 26, 2017 Report Posted September 26, 2017 Edho nalugu stones venakesukunnaru. Adhi koodha thappena..! Quote
libraguy863 Posted September 26, 2017 Report Posted September 26, 2017 endi raa nayana intha dabbula .. edi too much Quote
timmy Posted September 26, 2017 Report Posted September 26, 2017 had to appreciate ACB they are really working well, even chepala cheruvulu, royyala cheruvulu unna valla meedha kooda raids jaruguthunnayi. entha chesina mana corruption laws strict gaa levu. Jan lokpal bill inka implement kaaledhu, central govt is not showing any interest in implementing it. Quote
TampaChinnodu Posted September 26, 2017 Author Report Posted September 26, 2017 8 minutes ago, timmy said: had to appreciate ACB they are really working well, even chepala cheruvulu, royyala cheruvulu unna valla meedha kooda raids jaruguthunnayi. entha chesina mana corruption laws strict gaa levu. Jan lokpal bill inka implement kaaledhu, central govt is not showing any interest in implementing it. em labam man. okkadu kooda jail ki podu last ki. corrupt people ki ela bayata padalo telusu kabatte antha dairyam gaa sestharu corruption. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.