Jump to content

India lo IT sector payi Vaetu ....


Bathai_Babji

Recommended Posts

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి ఐటీలో 12 ఏళ్ల అనుభవం ఉంది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన రెండేళ్లు బ్యాంకింగ్‌ రంగంలో పని చేసి, తర్వాత సాఫ్ట్‌వేర్‌పై మోజుతో ఇటు వచ్చారు. నెలకు రూ.80 వేల వేతనం. ట్రంప్‌, ఆటోమేషన్‌ దెబ్బకు నాలుగు నెలల క్రితం కంపెనీ యాజమాన్యం.. ప్రతిభ పేరిట బలవంత రాజీనామా చేయించింది. అప్పుడు వచ్చిన నగదు నెల రోజులకే ఖర్చయిపోయింది. మూడు నెలలుగా ఉద్యోగం దొరకక, బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేక ఆందోళన చెందుతున్నారు.

మరో కంపెనీలో తొమ్మిదేళ్ల అనుభవమున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి యాజమాన్యం పింక్‌ స్లిప్‌ ఇచ్చింది. తెలంగాణలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన అతను మూడు నెలలుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా లభించలేదు. రుణ వాయిదాలు, తల్లిదండ్రులకు వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో మానసికంగా కుంగిపోయారు. అప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ స్నేహితుల దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నారు.

కటో తేదీన రావాల్సిన వేతనం రెండు రోజులు ఆలస్యమైతేనే ఆందోళన నెలకొంటుంది. అలాంటి హఠాత్తుగా ఉద్యోగం వూడిపోతే? ఇంటి అద్దె, పాఠశాల ఫీజులు, సామగ్రి, రుణాల నెలవారీ వాయిదాల గడువు సమీపిస్తుంటే? గుండె దడ పెరిగిపోతుంది. ఏం చేయాలో తోచక మానసికంగా కుంగిపోతుంటారు. ఐటీ రంగంలో పనితీరు, ప్రతిభ, యాంత్రీకరణ పేరిట ఉద్యోగాలు కోల్పోతున్నవారి పరిస్థితి అలాగే ఉంది. ఇల్లు, కారు వాయిదాలు, ఫీజులు, ఖర్చుల భారం గుదిబండల్లా మారుతున్నాయి. కుటుంబ భారాన్ని మోసేందుకు తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలకూ సిద్ధమవుతున్నారు.

దేశవ్యాప్తంగా ఐటీ సంస్థల్లో తొలగింపులు పెరుగుతున్నాయి. గత ఏడాది వరకు 5 నుంచి 7 శాతం వరకు ఉన్న తొలగింపుల సంఖ్య ఈ ఏడాదికి 10 శాతాన్ని మించనున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి పదిమందిలోనూ ఒకరికి కొలువు పోయే ముప్పు ఉందన్నమాట. పనితీరు, ప్రతిభ, నూతన సాంకేతిక పరిజ్ఞానం పేరిట ఇటీవల తొలగింపులు ఎక్కువయ్యాయి. అధిక వేతనాలు పొందుతున్నవారు, సీనియర్‌ ఉద్యోగులు ఎక్కువగా వేటుకు గురవుతున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 1500కు పైగా ఐటీ సంస్థల్లో 4.3 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. ఇక్కడా తొలగింపులు ఎక్కువయ్యాయి. నెలకు రూ.లక్షకు పైగా వేతనం పొందుతున్న ఉద్యోగులకు పనితీరు బాగాలేదని తాఖీదులిచ్చి బయటకు పంపిస్తున్నారు. ఈ చర్యలు ఐటీ పరిశ్రమను నమ్ముకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్న వారిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఆరు నెలల్లో ఉద్యోగాలు కోల్పోయిన నిపుణుల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. నూతన కోర్సులు నేర్చుకున్నప్పటికీ తక్కువ వేతనాలకు కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడంతో కొలువు దక్కడం గగనమవుతోంది. ఏదైనా ఉద్యోగం చూసి గండం గట్టెక్కించాలని సహోద్యోగులను వేడుకుంటున్నారు. ఎంత ప్రయత్నించినా కొలువు దొరక్క తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరికి మానసిక ప్రవర్తనలో కూడా తేడాలు వస్తున్నాయి.

పరిహారంలోనూ మతలబే
కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగిని తొలగించాలంటే ముందుగా నోటీసిచ్చి ఉద్యోగి అభిప్రాయం తీసుకోవాలి. తొలగింపు అనివార్యమైతే కారణాలు తెలుపుతూ పరిహారం చెల్లించాలి. అయితే ఐటీ ఉద్యోగాల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఎప్పుడు ఏ పిడుగు పడుతుందోనన్న ఆందోళన అధికమవుతోంది. ఉద్యోగికి ఇచ్చే వేతనం వేలల్లో ఉన్నప్పటికీ మూల వేతనం తక్కువగా, ఇతర భత్యాలు (అలవెన్సులు) ఎక్కువగా ఉంటున్నాయి. నెలకు రూ.60 వేలకు పైగా వేతనం పొందుతున్న ఉద్యోగికి మూలవేతనం రూ.12 నుంచి 14 వేలే ఉంటోంది. ఈపీఎఫ్‌కు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను కూడా ఉద్యోగి నుంచే వసూలు చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించినపుడు మూడు నెలల వేతనాన్ని ప్యాకేజీ అంటున్న కంపెనీలు మూలవేతనాన్ని మాత్రమే ఇస్తుండడంతో చేతికొచ్చే మొత్తం రూ.50 వేలు దాటడం లేదు. ‘పరిహారం కింద మూలవేతనం మాత్రమే ఇస్తూ కంపెనీలు సాయం చేసినట్లు చెప్పుకుంటున్నాయని, ఇది నెల కూడా సరిపోవడం లేదని ఒక ఐటీ ఉద్యోగి చెప్పారు. కార్మిక చట్టాలను అమలు చేయాలంటూ ఉద్యోగులు ఇచ్చిన పిటిషన్లు కార్మిక శాఖలో మూలుగుతున్నాయి. అక్కడి అధికారులు న్యాయస్థానాలకు వెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

2hyd-story1b.jpg

పాఠశాల ఫీజులకు కష్టాలే
నాణ్యమైన విద్య కోసమని పిల్లల్ని ఎక్కువ ఫీజులు కట్టి పెద్ద పాఠశాలల్లో చేర్పించారు. ఏడాది ఫీజు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటోంది. పాఠ్యపుస్తకాలు, ప్రాజెక్టు వర్కుల ఖర్చు అదనం. ‘మా పిల్లలు ఒకరు ఏడో తరగతి, మరొకరు ఐదో తరగతి చదువుతున్నారు. తొలి రెండు సెమిస్టర్‌లకు కలిపి రూ.లక్ష ఫీజు కట్టాను. మూడు నెలలుగా ఉద్యోగం లేదు. ఈఎంఐలు చెల్లించడానికి కష్టమవుతోంది. త్వరలోనే మూడో సెమిస్టర్‌ ఫీజు కట్టకపోతే పిల్లల చదువులకు ఇబ్బందులు వస్తాయి. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఏడాది తక్కువ ఫీజులుండే పాఠశాలల్లో చేర్పించాల్సిందే’ అని ఇటీవల ఉద్యోగం కోల్పోయిన ఓ నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాదే. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఎకరా పొలం కూడా లేదు. సొంతంగా ఆదుకునేవారెవరూ లేరు. అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఏం చేయాలో తోచడం లేదు’ ఇది మరో ఉద్యోగి వేదన.

ముఖం చాటేస్తున్న బ్యాంకులు
ద్యోగంలో ఉన్నపుడు అప్పులిచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇప్పుడు వారివైపు చూడటం మానేశాయి. ‘ఎనిమిదేళ్లుగా పొదుపు - వేతన ఖాతా ఉన్న బ్యాంకులు అడిగినప్పుడు వెంటనే రుణాలు ఇచ్చాయి. ఏరోజూ డీఫాల్ట్‌ కాకుండా చెల్లించాను. సిబిల్‌ స్కోరు చక్కగా ఉంది. నెల రోజుల క్రితం పరిస్థితి వివరించి రుణం కావాలని కోరా. కనీసం ట్రాక్‌ రికార్డు పరిశీలించాలని అడిగా. ఉద్యోగం లేనిదే రుణం ఇవ్వలేమని ఆ బ్యాంకు సిబ్బంది తెలిపారు’ అని ఐటీ ఉద్యోగి తెలిపారు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు వైద్యం చేయించడానికి చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఆరోగ్య బీమా గడువు ముగుస్తోంది. దీంతో కుటుంబసభ్యులకు ఏమైనా అనారోగ్యం తలెత్తితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వమూ చొరవ తీసుకోవాలి
టీ ఉద్యోగులు తమ హక్కుల గురించి పోరాడటానికి సంఘాలుగా ఏర్పాటవుతున్నారు. ఈ సంఘాలు ఐటీ ఉద్యోగుల తరపున మాట్లాడం, కార్మికశాఖ వద్ద పిటిషన్లు దాఖలు చేయడం చేస్తున్నాయి. నిపుణులకు కొన్ని రోజుల వరకు భరోసా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.
* విదేశాల్లో మాదిరి కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
* ఉద్యోగికి నైపుణ్యం తక్కువగా ఉందని భావిస్తే తొలగించకుండా శిక్షణ ఇప్పించాలి.
* ఐటీ సంస్థలు చట్టాలకు లోబడి నోటీసిచ్చి, వివరణ తీసుకోవాలి. రాజీనామా చేయాలంటూ బెదిరించకూడదు.
* మూడు నెలలు, ఆరు నెలల ప్యాకేజీ అన్నప్పుడు మూలవేతనం కాకుండా భత్యాలను కూడా లెక్కించి ఇవ్వాలి.
* ఉద్యోగిని తొలగించినప్పటికీ వైద్య బీమాను ఏడాదిపాటు కొనసాగించాలి.
* నైపుణ్యం ఉన్నప్పటికీ అధిక వేతనాల పేరిట తొలగించిన ఉద్యోగులను సంఘటితపరిచి ప్రభుత్వమే స్టార్టప్‌ల వైపు ప్రోత్సహించాలి.
మీ పొదుపే మీకు రక్ష
టీ ఉద్యోగంలో కొత్తగా చేరిన ఉద్యోగికి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వస్తున్నాయి. వేతనం చూసి మురిసిపోకుండా భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఐటీ ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక ఉండాలని, పొదుపు చేస్తూ అవసరమైనంతే ఖర్చులు చేయాలని సూచిస్తున్నారు. గొప్పలకు పోవడం కన్నా, ఉన్నంతలో సర్దుకోవడం ఉత్తమమని ఐటీ ప్రొఫెషనల్స్‌ ఫర్‌ ఐటీ ప్రతినిధి ప్రవీణ్‌, తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధి సందీప్‌కుమార్‌ పేర్కొంటున్నారు.
* అనవసర ఖర్చులు, వృథా షాపింగ్‌లు తగ్గించుకోవాలి.
* ఖరీదైన హోటళ్లలో భోజనాలు, జంక్‌ఫుడ్‌ కన్నా ఇంటి ఆహారం ఆరోగ్యానికి, జేబుకు కూడా మంచిది.
* ఫ్లాట్‌ కొన్నాక అదనపు హంగుల కోసం అప్పులు చేయొద్దు.
* భారీ నగదుతో కొనాలనుకున్నప్పుడు వ్యక్తిగత గృహాలు కొనాలి. ఒక పోర్షన్‌ అద్దె వచ్చినా ఖర్చులకు పనికొస్తుంది.
* ప్రభుత్వ రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలి. సొంత కారు కొనాలనుకుంటే ముందుగా పాతది తీసుకోవడం ఉత్తమం.
* నెలకు కొంత నగదును పింఛను పథకాలు, ఇతర పథకాల్లో పొదుపు చేసుకోవాలి. అత్యవసరాలకో లేదంటే వ్యాపారానికి పెట్టుబడిగానో ఉపయోగపడుతుంది.
Link to comment
Share on other sites

Not a fake news. I Know personally few people who got impacted. 

Inthaka mundu companies were able to afford even 50% of its employees count on bench. ippudu kashtam. Automation , Devops and Cloud killing all support jobs. Tough times ahead. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

Not a fake news. I Know personally few people who got impacted. 

Inthaka mundu companies were able to afford even 50% of its employees count on bench. ippudu kashtam. Automation , Devops and Cloud killing all support jobs. Tough times ahead. 

what about jobs in US

Link to comment
Share on other sites

Just now, Baangaru said:

what about jobs in US

Majority of such support jobs were already outsourced to India. So Impact will be somewhat less here compared to India. Also trump reason valla companies will try to hire some here. 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

Majority of such support jobs were already outsourced to India. So Impact will be somewhat less here compared to India. Also trump reason valla companies will try to hire some here. 

nuvvu reverse chepav bhayya lot of IT jobs are moving to India and big companies in US are not hiring H1B. IT is good in India and bad in US

Link to comment
Share on other sites

7 minutes ago, Baangaru said:

nuvvu reverse chepav bhayya lot of IT jobs are moving to India and big companies in US are not hiring H1B. IT is good in India and bad in US

I am talking about support jobs. emerging tech's valla there will be no need of thousands of people for support. So India will be impacted more since Indian IT has more % of such jobs. 

Currently IT market baane vundi USA lo, its just that if you are on H1 or OPT the choices are less. GC , H4 EAD vallu kummukuntunnaru.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...