Jump to content

నిన్న రాజమౌళి.. నేడు బోయపాటి..


TampaChinnodu

Recommended Posts

అమరావతిలో నిర్మాణాలపై సినీ దర్శకులతో సీఎం చంద్రబాబు భేటీలు
తాజాగా ప్రజంటేషన్‌ సమర్పించిన దర్శకుడు బోయపాటి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం సినీ దర్శకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరుసగా సమావేశమవుతున్నారు. రాజధానిలో నిర్మాణాల కోసం ఇంతకుముందు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో భేటీ అయిన సీఎం చంద్రబాబు తాజాగా మరో సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సమావేశమయ్యారు. రాజధానిలోని పవిత్ర సంగమం దగ్గర వెంకటేశ్వరుని ఆకృతి ఆలయ శిఖర నిర్మాణానికి సంబంధించిన ప్రజంటేషన్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను బుధవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. తిరుమలేశుని మూడు నామాలు, ఆలయ గోపురం కింద నుంచి గోదావరి నదీ ప్రవాహం సాగేలా నిర్మాణం ఈ నిర్మాణం ఉండనుంది. దశావతారాల థీమ్‌తో ఆలయ శిఖర ఆకృతికి దర్శకుడు బోయపాటి శ్రీను రూపకల్పన చేశారు. ఈ మేరకు ప్రజంటేషన్‌ను సీఆర్‌డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బోయపాటి అందజేశారు.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    7

  • Kontekurradu

    4

  • SD86

    4

  • mahesh1

    3

Popular Days

Top Posters In This Topic

దశావతారాల శిఖరం 
పవిత్ర సంగమం వద్ద ఆలయ నిర్మాణం 
ఆకృతి రూపొందించిన దర్శకుడు బోయపాటి శ్రీను 
రాజధానిలో ఐదు జోన్లలో రూ.10 వేల కోట్లతో వసతులు 
అమరావతిలో 20 ఎకరాల్లో క్రీడా సముదాయం 
సీఆర్‌డీఏ, పురపాలికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష 
ఈనాడు - అమరావతి 
4ap-main1a.jpg

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమ స్థలిలో దశావతారాల అంశంతో ఆలయ శిఖరాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ఆకృతిని సిద్ధం చేశారు. తిరుమలేశుని మూడు నామాలు, దానిపై ఆలయ గోపురం ఉండేలా... వాటి కింది నుంచి నదీ ప్రవాహం వెళ్లేలా ఈ నిర్మాణం ఉంటుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పనుల పురోగతి, పురపాలకశాఖలపై ఆ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ, పురపాలకశాఖ అధికారులతో సమీక్షించారు. రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టులు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తిరిగి స్థలాలు కేటాయించిన లేవుట్‌లకు (ఎల్‌పీఎస్‌) సంబంధించి ఐదు జోన్లలో రూ.10 వేల కోట్లతో హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో ప్రధాన మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అమరావతిలో అభివృద్ధి చేసే క్రీడానగరంపై చర్చించారు. వివిధ క్రీడలు ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా 20 ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు బ్రిటన్‌కు చెందిన స్టేడియా ఎరీనా సంస్థ ముందుకు వచ్చింది. వారం రోజుల్లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వచ్చే రెండు వారాల్లో అమరావతిలో రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తారు. ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా రాజధాని పనులు జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్మాణాత్మక సలహాలు ఎవరు అందించినా స్వీకరించాలని, అర్థవంతమైన చర్చ జరగాలని, మేధోమథనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే నవంబరులో కృష్ణా నదిలో అంతర్జాతీయ స్థాయిలో పవర్‌ బోట్‌ రేస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బోయపాటి శ్రీను కూడా పాల్గొన్నారు. తాను రూపొందించిన గోపురం ఆకృతికి సంబంధించి త్రీడీ చిత్రాల రూపంలో ఆయన ప్రజంటేషన్‌ ఇచ్చారు. దశావతారాల థీమ్‌తో ఆలయ శిఖర ఆకృతికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. బోయపాటి రూపొందించిన ఈ కాన్సెప్ట్‌పై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగమశాస్త్ర నిపుణులు, తితిదే పండితులతో చర్చించి 10 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఆకృతి నమూనా చిత్రాల్ని రహస్యంగా ఉంచారు. తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే బయట పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ గోపుర నిర్మాణం ఐకానిక్‌గా ఉండాలని సీఎం సూచించారని, ప్రాచీన దేవాలయ భవన నిర్మాణ రీతుల్ని దృష్టిలో ఉంచుకుని ఆకృతిని రూపొందించామని బోయపాటి ‘ఈనాడు’కి తెలిపారు. 
 

4ap-main1b.jpgగోదావరి-కృష్ణా నదులను అనుసంధానించి అఖండ గోదావరి నుంచి పవిత్ర సంగమం మీదుగా రాష్ట్రంలో జలసిరికి హారతి పడుతున్నాం. అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పూనుకున్నాం. అమరావతిలో తిరుమలేశుని ఆలయాన్ని తిరుమల తరహాలో దేదీప్యమానంగా నిర్మించాలన్నది నా ఆలోచన. వైకుంఠపురం దానికి అనువైన ప్రదేశంగా భావిస్తున్నాను...
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

అమరావతిలో జలక్రీడోత్సవం 
కృష్ణా నదిలో వచ్చే సంవత్సరం నవంబరులో జలక్రీడల నిర్వహణకు ఇటలీకి చెందిన యూఐఎం సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమై, తమ ప్రతిపాదన వివరించారు. ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. హెచ్‌2ఓ రేసింగ్‌ పేరుతో పవర్‌బోట్‌ రేసింగ్‌, ఎఫ్‌1హెచ్‌2ఓ పేరుతో బోటు రేసింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆక్వాబైక్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం దృష్ట్యా చైనా, ఫ్రాన్స్‌, యూఏఈ తర్వాత ఈ పోటీల నిర్వహణకు అమరావతిని ఒక సర్క్యూట్‌గా తీసుకుంటున్నట్టు యూఐఎం ప్రతినిధులు తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జలవనరులే అతి పెద్ద ఆకర్షణ. అందుకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయి జలక్రీడల నిర్వహణకు అనువైన వాతావరణం అమరావతిలో కల్పించాలి. పర్యాటకం, వినోదం, క్రీడలకు అమరావతిని చిరునామాగా మలచాలి...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదులలో ఏడాది పొడవునా జలక్రీడలు, పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖను ఆదేశించారు. జలక్రీడలకు సంబంధించిన పరికరాలు, పడవలు, ఇతర సాధనాలకు అవసరమైన అనుమతులిచ్చేందుకు త్వరలో ప్రత్యేకంగా ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యూఐఎం సంస్థ 40 దేశాల్లో పోటీలు నిర్వహిస్తోందని మంత్రి నారాయణ విలేఖరులకు తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదన్నారు.

11న లండన్‌కు సీఆర్‌డీఏ బృందం 
శాసనసభ, హైకోర్టు భవనాల తుది ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలపై నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఆర్కిటెక్ట్‌లతో చర్చించడానికి సీఆర్‌డీఏ అధికారుల బృందం ఈ నెల 11 నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనుంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవంతుల భావనాత్మక ప్రణాళికలను ఈ నెల 12న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ సీఆర్‌డీఏ అధికారులకు అందజేస్తుంది. అమరావతిలో వీఐపీ గృహ నిర్మాణ ప్రాజెక్టుకి ఈ నెల 9న ప్రొక్యూర్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు.

పట్టణాల్లో మౌలిక వసతులకు రూ.5 వేల కోట్ల రుణం 
తాగునీరు, రహదారులు, మురుగునీటి పారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు వంటివి పట్టణాల్లో కల్పించాల్సిన ప్రధాన మౌలిక వసతులని మంత్రి నారాయణ బుధవారం విలేఖరులకు తెలిపారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో వచ్చే రెండేళ్లలో రోడ్లు, డ్రెయిన్లు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, పార్కులు వంటి ప్రధాన మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.11 వేల కోట్లు కావాలని తెలిపారు. రాబోయే రెండేళ్లలో 14వ ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వ నిధులు, స్థానిక సంస్థలకు సొంత నిధులు పోగా మరో రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని, హడ్కో వంటి సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. రాజధాని అమరావతిలో నిర్మించే వివిధ రహదారులకు సంబంధించి 90 శాతం రూ.13 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచారని, మిగతా టెండర్లు మరో 15 రోజుల్లో పిలుస్తారని చెప్పారు. వచ్చే డిసెంబరు 31 లోగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కుక్కలకు సంతాన ఉత్పత్తి నియంత్రణకు స్టెరిలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Link to comment
Share on other sites

Adenti capital city lo unde core buildings architecture and designs kosam boya ni teeskunnar ani greatandhra etc sites rasayi ga..ipudemo just edo temple kosam antunnar

Link to comment
Share on other sites

Quote

ఈ సమావేశంలో బోయపాటి శ్రీను కూడా పాల్గొన్నారు. తాను రూపొందించిన గోపురం ఆకృతికి సంబంధించి త్రీడీ చిత్రాల రూపంలో ఆయన ప్రజంటేషన్‌ ఇచ్చారు. దశావతారాల థీమ్‌తో ఆలయ శిఖర ఆకృతికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. బోయపాటి రూపొందించిన ఈ కాన్సెప్ట్‌పై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగమశాస్త్ర నిపుణులు, తితిదే పండితులతో చర్చించి 10 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

real architects opinion avasaram ee leda naa matta ()>>

Link to comment
Share on other sites

monna rajamouli kuda clear ga cheppadu tanu chese pani emito ani. boyapati gurinchi kuda clear ga undi.

enduku anavsaramga launza posts lu estav gajji nayala @TampaChinnodu 

antha jagan gajji unte poyi aadi MG. siggu leni daridralu. america vachi em prayajonam ra me valla gajjilaunzak's

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...