Jump to content

అవినీతి సర్వేంతర్యామి

TampaChinnodu

Recommended Posts

అవినీతి సర్వేంతర్యామి 
ఐదేళ్లలో రూ.200 కోట్ల అక్రమార్జన 
ఏసీబీకి చిక్కిన సర్వే ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీగణేశ్వరరావు 
విశాఖపట్నం భూ కుంభకోణంలో కీలక నిందితుడు 
4 సార్లు సస్పెండైనా తీరు మార్చుకోని అధికారి 
ఏసీబీ బృందంపై కుక్కలను వదిలిన కుటుంబ సభ్యులు 
18ap-main1a.jpg

ఈనాడు - అమరావతి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖకు భారీ చేప చిక్కింది. గతంలో అక్రమాలకు పాల్పడి పట్టుబడినా ఏమాత్రం తీరు మార్చుకోని ఓ అధికారిని ఏసీబీ మరోసారి వలవేసి పట్టుకుంది. విజయనగరం జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ డైరెక్టర్‌ కార్యాలయంలో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు) పనిచేస్తున్న గేదెల లక్ష్మీగణేశ్వరరావు   నివాసాల్లో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో 18 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఏసీబీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, హైదరాబాద్‌లోని వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.200 కోట్ల విలువైన (మార్కెట్‌) అక్రమాస్తులు గుర్తించారు. వీటి పుస్తక విలువ రూ.7.30 కోట్లు ఉంటుందని లెక్క తేల్చారు. విశాఖపట్నం భూ కుంభకోణంలోనూ కీలక నిందితుడైన లక్ష్మీగణేశ్వరరావుపై సిట్‌ అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో అరెస్టై రిమాండులో ఉన్న ఆయన వారం రోజుల కిందటే బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటినుంచి అతని కదలికలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అతను అక్రమాస్తులను కలిగి ఉన్నారంటూ తాజాగా కేసు నమోదు చేశారు.

18ap-main1c.jpg

పెంట్‌హౌస్‌లో దాక్కుని... 
ఏసీబీ డీఎస్పీ రమాదేవి బృందం విశాఖపట్నం శ్రీనగర్‌ ప్రాంతంలోని సువర్ణ రెసిడెన్సీలో లక్ష్మీ గణేశ్వరరావుకు చెందిన ఫ్లాటు వద్దకు చేరుకుని తలుపుతట్టగా... అతని కుటుంబ సభ్యులు గణేశ్వరరావు ఇంట్లో లేరని, హైదరాబాద్‌ వెళ్లారని 
సమాధానమిచ్చారు. అనుమానంతో ఏసీబీ బృందం అపార్ట్‌మెంట్‌ పైభాగంలోని పెంట్‌హౌస్‌ వద్దకు చేరుకుంది. అక్కడ బయట నుంచి తాళం వేసి ఉండటంతో అతని ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పెంట్‌ హౌస్‌ లోపల ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని బయటకు రమ్మని కోరారు. గంటకు పైగా సమయం గడిచినా అతను బయటకు రాకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారమందించి పెంట్‌హౌస్‌ తాళాలు పగలగొట్టించారు. ఈ క్రమంలోనే గణేశ్వరరావు మీరు నాపై దాడికి పాల్పడుతున్నారని,  ప్రైవేటు కేసు నమోదు చేస్తానంటూ ఏసీబీ అధికారులపై బెదిరింపులకు దిగాడు. అదే సమయంలో అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, అక్కడున్న ఏసీబీ బృందంపైన ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలను ఉసిగొల్పాడు. దీంతో విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఏసీబీ అధికారులు అతనిపై పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు.

18ap-main1d.jpg

తప్పుడు పత్రాలతో రూ.34 కోట్ల రుణం 
గణేశ్వరరావు లేని ఆస్తులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.కోట్లలో రుణాలు పొందేవాడని ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖపట్నం సమీపం లోని ఆరిలోవలో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినప్పుడు సింహాచలం దేవస్థానానికి చెందిన ఆరు ఎకరాల భూములకు సంబంధించి కె.గొల్లయ్య అనే వ్యక్తితో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆ భూమినే ఎస్‌బీఐలో తనఖా పెట్టి రూ.34 కోట్ల మేర రుణం పొందాడు. ఈ బాగోతంపై 2014లో కేసు కూడా నమోదైంది. తన కుమారుడు స్నేహితుడి పేరిట కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి...వాటితో స్థానిక బ్యాంకుల నుంచి రూ.3 కోట్లు పొందినట్లు ఏసీబీ గుర్తించింది.

ఏసీబీ చేతికి రెండోసారి... 
* లక్ష్మీగణేశ్వరరావు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండగా 2009లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో 2012లో ఏసీబీ అధికారులు అభియోగపత్రం కూడా దాఖలు చేశారు.

ప్రస్తుతం ఆ కేసు విచారణ సాగుతోంది. 
* 1988లో జామి మండలంలో డిప్యూటీ సర్వేయర్‌గా పనిచేసినప్పుడు తహసీల్దార్‌ను కొట్టారన్న అభియోగాలపై సస్పెండ్‌ అయ్యారు. 2008లో విశాఖపట్నంలో తప్పుడు పట్టాలు సృష్టించారన్న అభియోగాలపైన, 2009లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి పట్టుబడి, తాజాగా 2017లో భూకుంభకోణాల కేసుల్లో నిందితుడిగా ఉండటంతో సస్పెండ్‌ అయ్యారు.

18ap-main1b.jpg

* లక్ష్మీగణేశ్వరరావు వేతనం నెలకు రూ.60 వేలు. అయిదేళ్లలో ఆయన సంపాదించిన అక్రమాస్తి రూ.200 కోట్లు. 
* ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపైన ఎనిమిదేళ్ల వ్యవధిలో ఏసీబీకి రెండు సార్లు పట్టుబడ్డారు. తొలిసారి (2009లో) గుర్తించిన అక్రమాస్తులు రూ.కోటి (పుస్తక విలువ) కాగా రెండోసారి సోదాల్లో అంతకు ఏడు రెట్లు అంటే రూ.7.30 కోట్ల మేర (పుస్తక విలువ) ఉన్నట్లు తేలింది. వీటి మార్కెట్‌ విలువ రూ.200 కోట్లని అంచనా. 
* 35 ఏళ్ల సర్వీసులో నాలుగుసార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యారు. వీటిలో మూడు సార్లు అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లోనే. 
* ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లు, పాసుపుస్తకాల సృష్టి, రెవెన్యూ దస్త్రాల ట్యాంపరింగ్‌, భూ కబ్జాల కేసులు ఎదుర్కొంటున్నారు.

Link to comment
Share on other sites

Quote

* 35 ఏళ్ల సర్వీసులో నాలుగుసార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యారు. వీటిలో మూడు సార్లు అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లోనే. 

Same old story. Suspend ina, dorikina kooda it will be very very easy to get out of that case and get back into same job and get promotions in the same department. 

antha easy ani telisaka evadu matram enduku aaputhadu corruption. 

Link to comment
Share on other sites

ఇంట్లోనే సినిమా థియేటర్‌ 
తిరిగేందుకు వోల్వో కారు 
విలాసవంతమైన జీవితం 
ఇదీ లక్ష్మీ గణేశ్వరరావు అవినీతి కథ 
ఈనాడు - అమరావతి 
18ap-main9a.jpg

సేదతీరేందుకు రూ.2.50 లక్షల విలువ చేసే ఖరీదైన కుర్చీ...అందులో అలా నడుం వాల్చి దర్జాగా నచ్చిన సినిమా చూసుకోవడానికి వీలుగా ఇంట్లోనే ఓ సినిమా థియేటర్‌...తిరగడానికి అత్యంత ఖరీదైన వోల్వో కారు. ఇదీ... సర్వే శాఖలోని లొసుగుల ఆధారంగా భూ దస్త్రాలను తారుమారు చేసి రూ.వందల కోట్లు అక్రమంగా సంపాదించిన సర్వే ఇన్‌స్పెక్టర్‌ గేదెల లక్ష్మీ గణేశ్వరరావు విలాసవంతమైన జీవితం. 1982లో రూ.680 వేతనానికి డిప్యూటీ సర్వేయర్‌గా ఉద్యోగంలో చేరి పదోన్నతులతో నేడు రూ.60 వేల వరకు జీతాన్ని తీసుకుంటూ సర్వే ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి చేరిన ఆయన అత్యంత వైభోగ జీవితాన్ని అనుభవిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

సెల్లారులో ‘అక్రమ’ ఫ్లాటు 
న్యాయవాది పేరుతో బోర్డు 
లక్ష్మీగణేశ్వరరావు రామాటాకీస్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంటు సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఓ ఫ్లాటు నిర్మించారు. తన అక్రమ కార్యకలాపాలకు దాన్ని వినియోగించుకునేవాడని ఏసీబీ గుర్తించింది. ఈ ఫ్లాటులోకి దర్యాప్తు బృందాలు ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు బయట హైకోర్టు న్యాయవాది అనే పేరుతో ఓ బోర్డును తగిలించినట్లు సోదాల్లో వెలుగు చూసింది. వాస్తవంగా ఆ భవనంలో ఎవరూ ఉండటం లేదని వారి దర్యాప్తులో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాటు కట్టడాన్ని ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే ఇలా న్యాయవాది అనే పేరు అడ్డం పెట్టుకున్నట్లు గుర్తించారు. 
* అక్రమార్జనతో తన సొంత గ్రామమైన విజయనగరం జిల్లా కురుపాం మండలం మొండెంకల్లులో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ రూ.50 లక్షలు వెచ్చించినట్లు దర్యాప్తులో తేలింది.

18ap-main9b.jpg

పాతకాలం నాటి పత్రాల సృష్టికి పాత టైపు మిషన్‌ 
భూములకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించేందుకు, రికార్డులు తారుమారు చేసేందుకు, తమవి కానీ భూములు తమవేనని చెప్పి కబ్జా చేసేందుకు అవసరమైన నకిలీ ఆధారాలు సృష్టించేందుకు తన ఇల్లునే కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. ఓ పాత కాలం నాటి టైపు మిషన్‌ను ఇంట్లో పెట్టుకుని దానితో ఎప్పుడో దశాబ్దాల కిందట ఉండే పత్రాల మాదిరి పత్రాలను సృష్టిస్తున్నట్లు గుర్తించారు. ట్యాంపరింగ్‌కు వీలుగా ఇంట్లోనే వివిధ హోదాల్లోని అధికారుల పేర్లతో కూడిన స్టాంపులు కూడా లభించాయి.

18ap-main9c.jpg

అక్రమాస్తుల చిట్టా! 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి పట్టుబడ్డ లక్ష్మీగణేశ్వరరావు 01.04.2012 నుంచి 18.11.2017 మధ్యనే రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తులను కూడబెట్టాడు. గతంలో అతనిపైన ఏసీబీ అధికారులు దాడులు చేసి ఉండటంతో సింహభాగం అక్రమాస్తులను తన ఇద్దరు కుమారులు, బినామీ గుడాల సత్యనారాయణ పేరిటే ఉంచాడు. విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కొమ్మాదిలోనే సుమారు 22 ఎకరాల భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీని మార్కెట్‌ విలువ రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

మొత్తం అక్రమాస్తులు ఇవీ.. 
* ఇళ్ల స్థలాలు: 5 
* ఫ్లాట్లు: 19 
* వ్యవసాయ భూమి: 30.36 ఎకరాలు 
* స్వాధీనం చేసుకున్న నగదు: రూ.34 వేలు 
* రద్దైన పాత వెయ్యి, రూ.500 నోట్లు: రూ.25 వేలు 
* బ్యాంకుల్లో నిల్వ: రూ.10 లక్షలు 
* బంగారం: కిలో 
* వెండి: 3.2 కిలోలు (రూ.1 లక్ష విలువ) 
* కార్లు: 3 
* ద్విచక్ర వాహనాలు: 2

గణేశ్వరరావు పేరుపై ఉన్నవి 
* విశాఖ సీతమ్మధారలోని సత్య బాలాజీ హైట్స్‌ అపార్ట్‌మెంటులో 1575 చదరపు అడుగుల ఫ్లాటు.

భార్య సరిత పేరిట... 
* విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వివేక్‌ కాలనీలో 293.33 చదరపు గజాల స్థలం 
* విశాఖపట్నం సీతమ్మధారలోని అంబేద్కర్‌ నగర్‌లో: 1525 చదరపు అడుగుల ఫ్లాటు

పెద్ద కుమారుడు విజయశేఖర్‌ పేరిట 
* విశాఖపట్నంలోని పెదవాల్తేరులో 320 చదరపు గజాల ఇంటి స్థలం 
* విశాఖపట్నంలోని చినముసిదివాద గ్రామంలో 242 చదరపు గజాల విస్తీర్ణం గల రెండు ఇళ్ల స్థలాలు 
* విశాఖ రామాటాకీస్‌ సమీపంలోని సువర్ణ రెసిడెన్సీలో 1500 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాటు 
* సీతమ్మధార అంబేద్కర్‌ నగర్‌లో 1575 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాటు 
* విజయనగరంలోని కంటోన్మెంట్‌ వార్డులో 1110 చదరపు అడుగుల ఫ్లాటు 
* విజయనగరంలోని హెచ్‌ఎన్‌ఆర్‌ ఎంపైర్‌లో 4400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు ఫ్లాట్లు 
* పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో 2.26 ఎకరాల వ్యవసాయ భూమి 
* విశాఖపట్నం జిల్లా మధురవాడ సమీపంలోని కొమ్మాది గ్రామంలో 21.28 ఎకరాల భూమి

రెండో కుమారుడు రాజశేఖర్‌ పేరిట 
* విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వివేక్‌ కాలనీలో 293..3 చదరపు గజాల ఇంటి స్థలం 
* విశాఖపట్నం నగరంలోని శ్రీనగర్‌లోని సువర్ణ రెసిడెన్సీలో 1070 చదరపు అడుగుల ఫ్లాటు 
* సీతమ్మధారలోని అంబేద్కర్‌ నగర్‌లో 1575 చదరపు అడుగుల విస్తీర్ణం ఫ్లాటు 
* విజయనగరం కంటోన్మెంట్‌ వార్డులో 1110 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాటు 
* పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో 1.94 ఎకరాల వ్యవసాయ భూమి 
* పశ్చిమగోదావరి జిల్లా బేతపూడి గ్రామంలో ఎకరా వ్యవసాయ భూమి 
* విశాఖపట్నం జిల్లా మధురవాడ సమీపంలోని కొమ్మాది గ్రామంలో 3.88 ఎకరాల భూమి

బినామీ గూడల సత్యనారాయణ పేరిట 
* విశాఖపట్నం శ్రీనగర్‌లో సూర్యశక్తి రెసిడెన్సీలో 1070 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాటు 
* విశాఖపట్నం శ్రీనగర్‌లోని సువర్ణ రెసిడెన్సీలో 1070 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాటు 
* సువర్ణ రెసిడెన్సీలో సెల్లార్‌లో 1070 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాటు 
* సువర్ణ రెసిడెన్సీలోని నాలుగో ఫ్లోరులో పెంట్‌ హౌస్‌ 
* విశాఖపట్నం అంబేద్కర్‌నగర్‌లోని శ్రీ సత్యబాలాజీ హైట్స్‌లో ఒక్కొక్కటి 1575 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన మూడు ఫ్లాట్లు.

Link to comment
Share on other sites

Quote

* అక్రమార్జనతో తన సొంత గ్రామమైన విజయనగరం జిల్లా కురుపాం మండలం మొండెంకల్లులో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ రూ.50 లక్షలు వెచ్చించినట్లు దర్యాప్తులో తేలింది.

_%~

Link to comment
Share on other sites

2-3days news lo untadu, tarvatha musugulo % ichesi silent chesestadu officials ni media ni, waste of discussing

govt edho chestundi anukovatam kuda muurkhatvam, bcos vaalla ki % andhuthaay kavati

Link to comment
Share on other sites

1 hour ago, perugu_vada said:

2-3days news lo untadu, tarvatha musugulo % ichesi silent chesestadu officials ni media ni, waste of discussing

govt edho chestundi anukovatam kuda muurkhatvam, bcos vaalla ki % andhuthaay kavati

Agreed. Already 4 times alane sesadu past lo.  inko saari sesthadu. case court lo thele lopu 1000% retire or dead. 

Link to comment
Share on other sites

17 hours ago, TampaChinnodu said:
అవినీతి సర్వేంతర్యామి 
ఐదేళ్లలో రూ.200 కోట్ల అక్రమార్జన 
ఏసీబీకి చిక్కిన సర్వే ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీగణేశ్వరరావు 
విశాఖపట్నం భూ కుంభకోణంలో కీలక నిందితుడు 
4 సార్లు సస్పెండైనా తీరు మార్చుకోని అధికారి 
ఏసీబీ బృందంపై కుక్కలను వదిలిన కుటుంబ సభ్యులు 
18ap-main1a.jpg

ఈనాడు - అమరావతి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖకు భారీ చేప చిక్కింది. గతంలో అక్రమాలకు పాల్పడి పట్టుబడినా ఏమాత్రం తీరు మార్చుకోని ఓ అధికారిని ఏసీబీ మరోసారి వలవేసి పట్టుకుంది. విజయనగరం జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ డైరెక్టర్‌ కార్యాలయంలో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు) పనిచేస్తున్న గేదెల లక్ష్మీగణేశ్వరరావు   నివాసాల్లో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో 18 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఏసీబీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, హైదరాబాద్‌లోని వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.200 కోట్ల విలువైన (మార్కెట్‌) అక్రమాస్తులు గుర్తించారు. వీటి పుస్తక విలువ రూ.7.30 కోట్లు ఉంటుందని లెక్క తేల్చారు. విశాఖపట్నం భూ కుంభకోణంలోనూ కీలక నిందితుడైన లక్ష్మీగణేశ్వరరావుపై సిట్‌ అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో అరెస్టై రిమాండులో ఉన్న ఆయన వారం రోజుల కిందటే బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటినుంచి అతని కదలికలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అతను అక్రమాస్తులను కలిగి ఉన్నారంటూ తాజాగా కేసు నమోదు చేశారు.

18ap-main1c.jpg

పెంట్‌హౌస్‌లో దాక్కుని... 
ఏసీబీ డీఎస్పీ రమాదేవి బృందం విశాఖపట్నం శ్రీనగర్‌ ప్రాంతంలోని సువర్ణ రెసిడెన్సీలో లక్ష్మీ గణేశ్వరరావుకు చెందిన ఫ్లాటు వద్దకు చేరుకుని తలుపుతట్టగా... అతని కుటుంబ సభ్యులు గణేశ్వరరావు ఇంట్లో లేరని, హైదరాబాద్‌ వెళ్లారని 
సమాధానమిచ్చారు. అనుమానంతో ఏసీబీ బృందం అపార్ట్‌మెంట్‌ పైభాగంలోని పెంట్‌హౌస్‌ వద్దకు చేరుకుంది. అక్కడ బయట నుంచి తాళం వేసి ఉండటంతో అతని ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పెంట్‌ హౌస్‌ లోపల ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని బయటకు రమ్మని కోరారు. గంటకు పైగా సమయం గడిచినా అతను బయటకు రాకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారమందించి పెంట్‌హౌస్‌ తాళాలు పగలగొట్టించారు. ఈ క్రమంలోనే గణేశ్వరరావు మీరు నాపై దాడికి పాల్పడుతున్నారని,  ప్రైవేటు కేసు నమోదు చేస్తానంటూ ఏసీబీ అధికారులపై బెదిరింపులకు దిగాడు. అదే సమయంలో అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, అక్కడున్న ఏసీబీ బృందంపైన ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలను ఉసిగొల్పాడు. దీంతో విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఏసీబీ అధికారులు అతనిపై పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు.

18ap-main1d.jpg

తప్పుడు పత్రాలతో రూ.34 కోట్ల రుణం 
గణేశ్వరరావు లేని ఆస్తులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.కోట్లలో రుణాలు పొందేవాడని ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖపట్నం సమీపం లోని ఆరిలోవలో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినప్పుడు సింహాచలం దేవస్థానానికి చెందిన ఆరు ఎకరాల భూములకు సంబంధించి కె.గొల్లయ్య అనే వ్యక్తితో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆ భూమినే ఎస్‌బీఐలో తనఖా పెట్టి రూ.34 కోట్ల మేర రుణం పొందాడు. ఈ బాగోతంపై 2014లో కేసు కూడా నమోదైంది. తన కుమారుడు స్నేహితుడి పేరిట కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి...వాటితో స్థానిక బ్యాంకుల నుంచి రూ.3 కోట్లు పొందినట్లు ఏసీబీ గుర్తించింది.

ఏసీబీ చేతికి రెండోసారి... 
* లక్ష్మీగణేశ్వరరావు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండగా 2009లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో 2012లో ఏసీబీ అధికారులు అభియోగపత్రం కూడా దాఖలు చేశారు.

ప్రస్తుతం ఆ కేసు విచారణ సాగుతోంది. 
* 1988లో జామి మండలంలో డిప్యూటీ సర్వేయర్‌గా పనిచేసినప్పుడు తహసీల్దార్‌ను కొట్టారన్న అభియోగాలపై సస్పెండ్‌ అయ్యారు. 2008లో విశాఖపట్నంలో తప్పుడు పట్టాలు సృష్టించారన్న అభియోగాలపైన, 2009లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి పట్టుబడి, తాజాగా 2017లో భూకుంభకోణాల కేసుల్లో నిందితుడిగా ఉండటంతో సస్పెండ్‌ అయ్యారు.

18ap-main1b.jpg

* లక్ష్మీగణేశ్వరరావు వేతనం నెలకు రూ.60 వేలు. అయిదేళ్లలో ఆయన సంపాదించిన అక్రమాస్తి రూ.200 కోట్లు. 
* ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపైన ఎనిమిదేళ్ల వ్యవధిలో ఏసీబీకి రెండు సార్లు పట్టుబడ్డారు. తొలిసారి (2009లో) గుర్తించిన అక్రమాస్తులు రూ.కోటి (పుస్తక విలువ) కాగా రెండోసారి సోదాల్లో అంతకు ఏడు రెట్లు అంటే రూ.7.30 కోట్ల మేర (పుస్తక విలువ) ఉన్నట్లు తేలింది. వీటి మార్కెట్‌ విలువ రూ.200 కోట్లని అంచనా. 
* 35 ఏళ్ల సర్వీసులో నాలుగుసార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యారు. వీటిలో మూడు సార్లు అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లోనే. 
* ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లు, పాసుపుస్తకాల సృష్టి, రెవెన్యూ దస్త్రాల ట్యాంపరింగ్‌, భూ కబ్జాల కేసులు ఎదుర్కొంటున్నారు.

Deenamma survey inspector gadiki 200 Cr aa , ma friend valla nanna sincere survey inspector vallaki sontha flat kuda ledu and sincerity valla year ki 2 transfers free

Link to comment
Share on other sites

1 minute ago, princeofheaven said:

Deenamma survey inspector gadiki 200 Cr aa , ma friend valla nanna sincere survey inspector vallaki sontha flat kuda ledu and sincerity valla year ki 2 transfers free

nice.. alantivallu kooda vuntaru lee bhayya

Link to comment
Share on other sites

1 minute ago, The Warrior said:

nice.. alantivallu kooda vuntaru lee bhayya

ilanti vallani chusaka i think next generation lo inka fewer sincere officers untaru

Link to comment
Share on other sites

5 minutes ago, princeofheaven said:

Deenamma survey inspector gadiki 200 Cr aa , ma friend valla nanna sincere survey inspector vallaki sontha flat kuda ledu and sincerity valla year ki 2 transfers free

NIjayateeki unde Viluve veru , aayana ala undatam valle nuvvu ayana gurinchi cheptunnavu gallery_731_18_368094.gif

Link to comment
Share on other sites

అవినీతి సర్వేంతర్యామి   ee title mathram apt gaa undhi
ఐదేళ్లలో రూ.200 కోట్ల అక్రమార్జన - retire ayye lopu  1000 C target pettukunnattunadu...pattukunna parledhu..malli bayataki raagane rettinchina utsaham tho modhaldathadu ..yuddham modhalu pettaka kanti kanapadalsindhi target mathrame.....ACB vallu "," mathrame pettagalaru "." pette anthe scene ledhu....

baaga adadu kadha
4 సార్లు సస్పెండైనా తీరు మార్చుకోని అధికారి - ila vadhilesi malla job lo join chesukunte 400 times pattubadina marchukodu evadu...
ఏసీబీ బృందంపై కుక్కలను వదిలిన కుటుంబ సభ్యులు - idhi high light assala..malla vaatalu ela vesukunataro tharuvatha.....siggu saram leni vedhavalu...

inka ee desanni baagu cheyyatam evadi valla kadhu....samba rasukora.....

Link to comment
Share on other sites

ఒక్క సూట్‌కేసు..రూ.12 కోట్ల పత్రాలు 
చిన్న క్లూతో ఏసీబీకి చిక్కిన వైనం 
గణేశ్వరరావుకు జ్యుడీషియల్‌ రిమాండు 
ఈనాడు - అమరావతి, విశాఖపట్నం 
19ap-main6a.jpg

కే ఒక్క సూట్‌కేసు...దాన్ని మాయం చేస్తే చాలు దాదాపు రూ.12 కోట్ల (మార్కెట్‌ ధర) విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాల గుట్టు ఏసీబీకి చిక్కేది కాదు. ఆ మేరకు చేసిన ప్రయత్నం విఫలమైంది. చిన్న క్లూతో ఆ సూట్‌ కేసును అధికారులు గుర్తించగలిగారు. సర్వే ఇన్‌స్పెక్టర్‌ గేదెల లక్ష్మీగణేశ్వరరావు ఇంటిలో సోదా చేస్తున్నప్పుడు అతని చిన్నకుమారుడు వారి కంటపడకుండా బయటకొచ్చాడు. చేతిలో తాళాలు లేకపోవడంతో...సెల్లార్‌లో ఉన్న కారు వెనుకవైపున ఉన్న అద్దాన్ని ధ్వంసం చేసి లోపల ఉన్న సూటుకేసును మాయం చేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయమైంది. ఈ కారును పరిశీలించడానికి వెళ్లిన ఏసీబీ అధికారులకు దాని వెనుక అద్దం ధ్వంసమవడం, రక్తపు మరకలు కనిపించాయి. గణేష్‌ పెద్ద కుమారుడు తమ సమక్షంలోనే ఉండటంతో చిన్నకుమారుడిని తమదైన శైలిలో ప్రశ్నించారు. తొలుత దబాయించినా అతని చేతికైన గాయం నిజాన్ని దాచలేకపోయింది. సెల్లార్‌లో మెట్ల కింద ఆ సూట్‌ కేసు పెట్టినట్లు అంగీకరించాడు. క్లూస్‌టీమ్‌ను పిలిపించి ఆ రక్తపు నమూనాలను సేకరించారు. దానికి నెంబర్‌ ప్లేట్‌ కూడా లేదని గుర్తించారు. విశాఖపట్నం సువర్ణ రెసిడెన్సీలోని గణేశ్వరరావు ఫ్లాటులో ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. 
* తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి ఆయన రూ.30 లక్షలు విరాళమివ్వగా... ఆ రసీదులను స్వాధీనం చేసుకున్నారు. బినామీల ద్వారా వడ్డీ వ్యాపారాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. 
* తరచూ విదేశీ విహారానికి వెళ్లేవారని గుర్తించారు. ఎప్పుడెప్పుడు విదేశాలకు వెళ్లారు? ప్రభుత్వ అనుమతితోనే వెళ్లారా? లేదా? తదితర అంశాలపైన ఆరా తీస్తున్నారు.

19ap-main6b.jpg

భార్య నుంచి విడాకుల పత్రాలు! 
తన అక్రమాస్తుల గుట్టు చిక్కకుండా ఉండేందుకు 2009లో తన భార్యతో లక్ష్మీగణేశ్వరరావు విడాకులు తీసుకున్నట్లుగా ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె పేరిట ఉన్న ఆస్తులతో తనకు సంబంధం లేదని చెప్పేందుకు ఈ ఎత్తుగడ వేశాడని భావిస్తున్నారు. కాగితంపైనే విడాకులు తీసుకున్నారే తప్ప ఇద్దరూ కలిసే ఉంటున్నారని దర్యాప్తులో వెల్లడైంది.

అరెస్టు.. న్యాయమూర్తి ఎదుట హాజరు 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన సర్వే ఇన్‌స్పెక్టర్‌ గేదెల లక్ష్మీగణేశ్వరరావును ఏసీబీ అధికారులు ఆదివారం  సాయంత్రం 4.30 గంటల సమయంలో అరెస్టు చేశారు. విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా డిసెంబర్‌ 1వ తేదీ వరకూ జ్యూడిషియల్‌ రిమాండు విధించారు. తమను బెదిరించి... విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఏసీబీ అధికారులు ఆయనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదైంది.

కొత్తగా గుర్తించిన అక్రమాస్తులివే... 
విశాఖపట్నం శివారు ఆనందపురం మండలందక్కవానిపాలెంలో లక్ష్మీగణేశ్వరరావు తల్లి సీతామహాలక్ష్మీ పేరిట: రెండెకరాల భూమి (మార్కెట్‌ విలువ రూ.10 కోట్లుగా అంచనా) 
* ప్రాంసరీ నోట్లు: 40 (రూ.45 లక్షలకు) 
* చెక్కులు: 18 (రూ.1.32 కోట్లు) 
* ఖాళీ చెక్కులు: 47 
* జ్యూయలరీ బిల్లులు: రూ.20 లక్షలు 
* ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌ పత్రాలు 
* ఖాళీ స్టాంపు పేపర్లు: 30 
* సంతకాలుచేసి వివరాలు నింపని ఖాళీపట్టాలు: 10 
* ఇతరులకు సంబంధించిన చెక్కు బుక్కులు: 5

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...