Jump to content

ప్రమిద ఆకృతిలో స్మృతివనం


TampaChinnodu

Recommended Posts

ప్రమిద ఆకృతిలో స్మృతివనం 
ఆకట్టుకునే రీతిలో స్తూపం 
శిఖరాన తెలంగాణ తల్లి 
హుస్సేన్‌ సాగర్‌ తీరంలో 12 ఎకరాల్లో నిర్మాణం 
సీఎం కేసీఆర్‌ నిర్ణయం.. త్వరలో శంకుస్థాపన 
ఈనాడు - హైదరాబాద్‌ 
21ts-main1a.jpg

తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళిగా సచివాలయం ఎదురుగా హుస్సేన్‌సాగర్‌ తీరంలోని 12 ఎకరాల సలంలో నిర్మించనున్న స్మృతివనం, అత్యంత ఎత్తయిన స్తూపం ఆకృతుల నమూనాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఖరారు చేశారు. మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులు, పార్టీ నేతలతో చర్చించాక వీటికి ఆమోదం తెలిపారు. కేటీఆర్‌ వాటి నమూనా చిత్రాలను ట్విట్టర్‌లో పెట్టారు. స్మృతి వనం నమూనా వెలుగుతున్న దీపపు ప్రమిద ఆకారంలో ఉండగా, స్థూపం సైతం స్ఫూర్తిదాయక రీతిలో ఉంది. శిఖరం అంచున తెలంగాణ తల్లి బొమ్మ ఉండేలా, వెనకభాగంలో వెలుగులీనేలా చిత్రాన్ని రూపొందించారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని, అమరవీరుల త్యాగనిరతిని భవిష్యత్తు తరాలు తలచుకునేలా స్మృతివనం, స్థూపం నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటికి ప్రముఖ సంస్థల నుంచి ఆకృతులను తయారు చేయించారు. వచ్చిన వాటన్నింటిని పరిశీలించి తుది ఎంపిక జరిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించాలని ఆయన అధికారులకు నిర్దేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సమాచారంతో స్మృతివనాన్ని సాహిత్య, సాంస్కృతిక   కేంద్రంగా, తెలంగాణ గౌరవం ఉట్టిపడేలా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ కోసం జీవితకాలం పోరాడిన ఆచార్య జయశంకర్‌ వంటి ప్రముఖుల చరిత్రను ఇందులో పొందుపరచాలని ఆయన ఆదేశించారు. శాశ్వత మ్యూజియం, దృశ్యశ్రవణ మందిరం, సమావేశ మందిరం, భోజనశాల వంటివి ఇందులో ఉంటాయి.

21ts-main1b.jpg

త్వరలో శంకుస్థాపన: అమరవీరుల స్మృతివనం, స్థూపాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. వీటి ఆకృతులు అద్భుతంగా ఉన్నాయని కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

There is nothing wrong its a landmark to remember the sacrifices made by the martyrs of Telangana. Unlike AP which is building statue for NTR this is a very good cause. I support it

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...