Jump to content

Janallo Serials Prabhavam Gattiga Undi.


turtle

Recommended Posts

ప్రియురాలికి కన్యాదానం..! 
అనంతరం ఆ పెళ్లి చెడగొట్టేందుకు పన్నాగం 

hyd-top1a.jpg

హైదరాబాద్‌: అతడో మాయగాడు.. ఓ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. మతాలు వేరు కావడంతో ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో ఏకంగా మతం మార్చుకున్నాడు.. అయినా అతడి కల నెరవేరలేదు.. ప్రియురాలికి వేరే పెళ్లి నిశ్చయించడంతో పెళ్లి పెద్ద హోదాలో ఆమెకు కన్యాదానం చేశాడు.. తర్వాత ఆ బంధాన్ని చెడగొట్టేందుకు ప్రియురాలి భర్తను పురుష వ్యభిచారిగా చిత్రీకరించి వెబ్‌సైట్‌లో తప్పుడు   ప్రొఫైల్‌ సృష్టించాడు.. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆ మోసగాడి లీలలు బహిర్గతం కావడంతో కటకటాల పాలయ్యాడు. సినిమా కథను తలపించిన ఈ వ్యవహారం సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

షేక్‌ సయ్యద్‌ వలీ అలియాస్‌ రామ్‌ అద్వైత్‌రెడ్డి 
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన షేక్‌ సయ్యద్‌ వలీ(32) స్థానిక ప్రభుత్వ కళాశాలలో 2006లో డిగ్రీ పూర్తి చేశాడు. రెండేళ్లపాటు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను, ఆ తర్వాత 2016 వరకు గుంతకల్లు, తిరుపతి, కర్నూలులో మెడికల్‌ రిప్రజెంటెటీవ్‌గా పనిచేశాడు. ఫార్మా కంపెనీని మోసగించడంతో కర్నూలు నాలుగో పట్టణ ఠాణాలో గతయేడాది మార్చిలో అతడిపై చీటింగ్‌ కేసు నమోదైంది. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఎల్‌బీనగర్‌లో ఉంటూ జాబ్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానంటూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో గ్రూపులు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాడు. ఇదేక్రమంలో ఓ యువతి అతడికి పరిచయమై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకునేందుకు మతం అడ్డుగా ఉంటుందని యువతి చెప్పడంతో ఓ పథకమేశాడు. ఆమె కుటుంబసభ్యులతో పెళ్లి విషయం మాట్లాడేందుకు హిందువుల్లా నటించాలని వలీ తన తల్లిదండ్రుల్ని కోరాడు. అందుకు వారు నిరాకరించారు. ఈసారి తనే రామ్‌ అద్వైత్‌రెడ్డిగా పేరు మార్చుకుని యువతి తల్లిదండ్రులను కలిసి పెళ్లి గురించి ప్రతిపాదించాడు. కానీ వారు అంగీకరించలేదు. గత ఏడాది సెప్టెంబరులో యువతి తల్లిదండ్రులు కల్యాణ్‌ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న వలీ.. కల్యాణ్‌తోపాటు అతడి కుటుంసభ్యులకు ఫోన్‌ చేసి తీవ్రంగా బెదిరించడంతో పెళ్లి ఆగిపోయింది.

కొడుకులా ఉంటానని నమ్మించి..: వలీ బెదిరింపు విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు మరోసారి ఇంటి గడప తొక్కొద్దని హెచ్చరించారు. ఈసారి అల్వాల్‌కు చెందిన సంతోష్‌తో పెళ్లి నిర్ణయించారు. ఈలోపు కల్యాణ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. అయితే కల్యాణ్‌.. సంతోష్‌ ఇద్దరూ దూరపు బంధువులే కావడంతో వలీ మరోసారి కల్యాణ్‌కు ఫోన్‌ చేశాడు. యువతికీ, తనకు మధ్య ప్రేమ ఉన్న విషయం సంతోష్‌కు చెప్పి పెళ్లి ఆపించాలని కోరాడు. అందుకు అంగీకరించకపోవడంతో మరోసారి బెదిరింపుల పర్వానికి దిగాడు. తన భార్య విషయంలో బెదిరింపులకు దిగడంతో కల్యాణ్‌ ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటికీ వలీని యువతి మరిచిపోనప్పటికీ.. తల్లిదండ్రులు తీవ్రంగా మందలించడంతో సంతోష్‌తో పెళ్లికి అంగీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వలీ మరో కొత్త నాటకానికి తెర తీశాడు. గతమంతా మర్చిపోయి కొడుకులా ఉంటానని యువతి తల్లిదండ్రులను నమ్మించాడు. ఆమె పెళ్లిని ముందుండి నడిపించాడు. ఆమెకు సోదరుడిలా వరుడి తరఫు కుటుంబాన్ని నమ్మించాడు. గత ఏడాది నవంబరులో జరిగిన పెళ్లిలో ఆమె కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు.

వెబ్‌సైట్‌లో మేల్‌ ఎస్కార్ట్‌గా ప్రొఫైల్‌ 
పెళ్లి చేసిన చేతులతోనే ప్రియురాలి కాపురాన్ని కూల్చేందుకు వలీ పన్నాగం పన్నాడు. వివాహం జరిగిన రోజే అశ్లీల వెబ్‌సైట్‌లో సంతోష్‌నే మేల్‌ ఎస్కార్ట్‌(పురుష వ్యభిచారి)గా తప్పుడు ప్రొఫైల్‌ నమోదు చేశాడు. మార్ఫింగ్‌ చేసిన సంతోష్‌ చిత్రాలతోపాటు ఫోన్‌నంబరును ఉంచాడు. మరోవైపు సంతోష్‌తో కాపురం చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని అతని భార్య (వలీ ప్రియురాలు) కోరింది. సరిగ్గా నెల తర్వాత ఓ రోజు రాత్రి సదరు వెబ్‌సైట్‌లో నీ పేరుతో ప్రొఫైల్‌ ఉందంటూ భర్తకు చెప్పింది. అదే విషయంలో పంచాయతీ పెట్టించి అత్తింటి నుంచి వెళ్లిపోయింది. దర్యాప్తు చేయాలని సంతోష్‌ గత ఫిబ్రవరి 1న సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. వలీ లీలలు బహిర్గతమయ్యాయి. అతడే సంతోష్‌ పేరుతో తప్పుడు ప్రొఫైల్‌ సృష్టించినట్లు తేలడంతో అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఉద్యోగాల పేరుతో రూ.1.4లక్షలు తీసుకున్నందుకు మియాపూర్‌లో, రూ.2.4లక్షలు వసూలు చేసినందుకు మాదాపూర్‌లో కేసులున్నట్లు వెల్లడైంది. కాగా.. తప్పుడు ప్రొఫైల్‌ కేసులో యువతి ప్రమేయం ఏమాత్రం ఉంది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

http://www.eenadu.net/homeinner.aspx?category=crime&item=break39

Link to comment
Share on other sites

Just now, Lakhan said:

Ademi incident

Lover kosam husband ni champesi, lover face meeda acid posi disfugure sesindi. hospital join cheyinchindi husband laaga. plastic surgery seyinchi same husband face laaga seddamani plan sesindi. kaani Lover gaadu Vegetarian and Husband was Non-vegetarian. akkade dorikipoyaru. 

https://www.scoopwhoop.com/bowl-of-mutton-soup-helped-solve-murder/#.i5q8vi864

Link to comment
Share on other sites

11 minutes ago, turtle said:

Lover kosam husband ni champesi, lover face meeda acid posi disfugure sesindi. hospital join cheyinchindi husband laaga. plastic surgery seyinchi same husband face laaga seddamani plan sesindi. kaani Lover gaadu Vegetarian and Husband was Non-vegetarian. akkade dorikipoyaru. 

https://www.scoopwhoop.com/bowl-of-mutton-soup-helped-solve-murder/#.i5q8vi864

THis was not in Kurnool I think 

Soewhere in TG, I think Nizambad 

Link to comment
Share on other sites

23 minutes ago, turtle said:

Lover kosam husband ni champesi, lover face meeda acid posi disfugure sesindi. hospital join cheyinchindi husband laaga. plastic surgery seyinchi same husband face laaga seddamani plan sesindi. kaani Lover gaadu Vegetarian and Husband was Non-vegetarian. akkade dorikipoyaru. 

https://www.scoopwhoop.com/bowl-of-mutton-soup-helped-solve-murder/#.i5q8vi864

Yes I remember. But

12 minutes ago, Kontekurradu said:

THis was not in Kurnool I think 

Soewhere in TG, I think Nizambad 

 

Link to comment
Share on other sites

14 minutes ago, Kontekurradu said:

THis was not in Kurnool I think 

Soewhere in TG, I think Nizambad 

naagar kurnool ani TG lo undi. akkade jarigindi.baby_dc1

Link to comment
Share on other sites

2 hours ago, turtle said:

naagar kurnool ani TG lo undi. akkade jarigindi.baby_dc1

Mari murder Ki digaledu ee case... konchem better.

 

adaitr edho Hollywood movie range lo planning and execution.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...