Jump to content

kanaka durga flyover today


Recommended Posts

Posted
6 minutes ago, JAPAN said:

DsIxRg5VsAAobA7.jpg

painting bagundhi .. hope they maintain it

Posted
Just now, snoww said:

Is this the same fly over they constructing from 4 years ? 

Yes 

Posted
8 minutes ago, snoww said:

Is this the same fly over they constructing from 4 years ? 

still constructing...

media lo baaga ekkesthunnaru kadha

elagola complete chestharule ..elections ki one day mundu janda vooputharu emo

Posted
44 minutes ago, MiryalgudaMaruthiRao said:

A country bro

vijayawada..F1 H2O teams and visitors vastharu kadha anduke ee muchata anamata

  • 3 weeks later...
Posted
On 11/16/2018 at 10:03 AM, JAPAN said:

DsB5BCtXQAAXTLy.jpg

పార్కు పనులపై అనుమానాలు? 
నగరపాలక సంస్థకు ఆర్‌అండ్‌బీ శాఖ నోటీసులు 
దిద్దుబాటు చర్యలకు సన్నాహాలు 
amr-gen14a.jpg

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలోని భవానీపురం ప్రాంతంలో రెండు జాతీయ రహదార్లను కలుపుతూ ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కనకదుర్గా పైవంతెన కింద నగరపాలక సంస్థ తాజాగా అభివృద్ధి చేసిన ఎఫ్‌1హెచ్‌2వో పార్కునకు వ్యతిరేకంగా ఆర్‌అండ్‌బీ శాఖ.. నగరపాలక సంస్థకు ప్రస్తుతం నోటీసులు జారీ చేసింది. పార్కును దాదాపు రూ.7 కోట్లకు పైగా వ్యయంతో నగరపాలక సంస్థ ఇటీవల పెద్దఎత్తున అభివృద్ధి చేసింది. అక్కడి పున్నమీఘాట్‌, బరంపార్కు వద్ద కృష్ణానదిలో ఇటీవల ఫవర్‌బోటు పోటీలు జరిగాయి. దాదాపు 800 మీటర్ల పొడవునా వర్టికల్‌ పార్కును అభివృద్ధి చేశారు. అక్కడి పలు పిల్లర్లకు రంగులు అమర్చారు. డిజైన్లు అద్దారు.

వాకింగ్‌ట్రాక్‌తోపాటు, ఫౌంటేన్లు, పచ్చదనాన్ని, స్క్రాప్‌ బొమ్మలను అమర్చారు. ఇక పైవంతెన కింద ఉన్న అనేక ఫిల్లర్లకు అందంగా మొక్కలు, చిన్నపాటి కుండీలు సైతం అమర్చారు. పలు పిల్లర్లకు పెద్దఎత్తున మొక్కల కుండీలు అమర్చిన అధికారులు వాటిని నిరంతరాయంగా నీరు అందేలా సూక్ష్మపైపుల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కింద మోటరు వదిలితే వర్టికల్‌గా నీరు వేగంగా మొక్కలకు చేరతాయి.  పలు పిల్లర్లకు అమర్చిన మొక్కలకు నీటిని నిరంతరం సరఫరా చేయడంవల్ల పైవంతెన పిల్లర్లు ధ్వంసం అవుతాయన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు భవిష్యత్తులో పిల్లర్లకు ప్రమాదం పొంచి ఉంటుందన్న ఆలోచనతో నగరపాలక సంస్థకు నోటీసులు జారీ చేశారు. ముందుస్తుగా అక్కడి పిల్లర్లకు నీటివల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల విషయంలో నగరపాలక సంస్థ అనుసరించిన తీరుపై ఆర్‌అండ్‌బీ సందేహాలను సైతం వ్యక్తంచేస్తూ వర్టికల్‌ గార్డెన్‌ (పార్కు) అభివృద్ధివల్ల స్థానికంగా పైవంతెనకు కలిగే నష్టంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ తగిన సమాధానం ఇవ్వాలంటూ ఆర్‌అండ్‌బి పంపిన నోటీసులు నగరపాలక సంస్థకు అందడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అందుకు సంబంధించి  ప్రస్తుతం వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఇంజినీరింగ్‌ అధికారులు, సాంకేతిక నిపుణులతో పిల్లర్ల తనిఖీలు, వాటి నాణ్యతా ప్రమాణాలు, నీరు పిల్లర్లకు తగలడంవల్ల కలిగే నష్టాలు వంటి అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేయించి ఆపై తగిన వివరణ ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే ఇటీవల జరిగిన ఎఫ్‌1,హెచ్‌2వో పోటీలకు సమయం లేకపోవడం పోటీల సమయం దగ్గరపడడంతో నగరపాలక సంస్థ అధికారులు రాత్రింబగళ్లు పార్కును ఆఘమేఘాలపై అభివృద్ధి చేశారు. అ సమయంలో కొన్ని పిల్లర్లకు నీటిని తట్టుకునేందుకు అనువుగా వాటర్‌ప్రూఫ్‌తోపాటు, పలు కెమికల్స్‌ కలిపిన సిమెంట్‌ను ఉపయోగించి ముందస్తుగా ప్లాస్టింగ్‌ చేసి వర్టికల్‌గా మొక్కలను అమర్చారు. అయితే కొన్ని పిల్లర్ల విషయంలో మాత్రం అటువంటి చర్యలు ముందుస్తు ఏర్పాట్లు చేయకుండానే మొక్కలు అమర్చేశారు. ఫలితంగానే పిల్లర్ల నాణ్యతా ప్రమాణాలపై ఆర్‌అండ్‌బీశాఖ ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేసింది. వారి అనుమానాలు నివృత్తి చేయడంతోపాటు, వారికి తగిన వివరణ ఇచ్చేందుకు నగరపాలక సంస్థకు సిద్ధమైంది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...