Jump to content

మన వారసత్వ సంపదపై మరో వివక్ష: namaste telangana


trent

Recommended Posts

-తెలంగాణ చారిత్రక ఇమేజ్‌పై కేంద్ర పురావస్తుశాఖ కుట్ర
-హైదరాబాద్‌ను మినీ సర్కిల్‌గా మార్చేందుకు యత్నం
-ఏపీలో రెండు సర్కిళ్ల కోసం ప్రతిపాదనలు?
-మాన్యుమెంట్స్ సంఖ్య తక్కువగా ఉన్నదనే నెపంతో ఏఎస్‌ఐలోని ఆంధ్ర ప్రాంత అధికారుల ఒత్తిడి


నూర శ్రీనివాస్/ వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చారిత్రక, వారసత్వ సంపదను మరుగునపడేసిన ఆంధ్రప్రాంత అధికారులు.. రాష్ట్రం విడిపోయినప్పటికీ వివక్ష మాత్రం మానడం లేదు. కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ)లో తెలంగాణలో మాన్యుమెంట్స్ సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో హైదరాబాద్ సర్కిల్‌ను మినీ సర్కిల్‌గా మార్చేందుకు యత్నిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇక్కడి చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తూ దేశంలోని వివిధ రాష్ర్టాలతోపాటు, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై నీళ్లు చల్లేందుకు ఏఎస్‌ఐ యత్నిస్తున్నది. ఢిల్లీ, అమరావతి కేంద్రంగా పనిచేసే కొంతమంది ఏఎస్‌ఐ ఉన్నతాధికారులు ఈ కుట్రకు ఆజ్యం పోస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే జాతీయస్థాయిలో తెలంగాణ చారిత్రక కట్టడాలకు ప్రస్తుతం ఉన్న ప్రభ, ప్రాముఖ్యం తగ్గిపోయి ప్రపంచ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఉన్నది.

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర అధికారుల ఆధిపత్య ధోరణి వల్ల.. తెలంగాణలోని చారిత్రక, వారసత్వ ప్రాధాన్యంగల ప్రాంతాలపై వివక్ష కొనసాగింది. ఆంధ్రాప్రాంతంలో అంతగా ప్రాముఖ్యం లేని అనేక ప్రాంతాలను ఏఎస్‌ఐ పరిధిలో చేర్చి.. తెలంగాణలోని ప్రాంతాలను పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 137 కట్టడాలను కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉంటే.. అందులో ఆంధ్రా ప్రాంతానికి చెందినవే 129 కట్టడాలు ఉండగా.. తెలంగాణకు చెందినవి ఎనిమిది మాత్రమే. కేంద్రప్రభుత్వం ప్రతిఏటా ఏఎస్‌ఐకి కేటాయించే నిధులను సంఖ్యాపరంగా అధికంగా ఉన్నాయని ఆంధ్రాకే ఎక్కువభాగం మళ్లించి తెలంగాణపై వివక్ష చూపారు. ఇందుకు ఉదాహరణ 2006లో ప్రారంభమైన వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి మంటప నిర్మాణ పనులు 13 ఏండ్లు గడిచినా పూర్తికాకపోవడమే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అనేక పర్యాయాలు ఏఎస్‌ఐకి విన్నవించినా స్పందించిన పాపానపోవడం లేదు.
 

ఆంధ్రాలో 129.. హైదరాబాద్‌లో 8..

అడుగడుగు శిల్పాలురా తెలగాణ.. నాట్యపు శిఖరాలురా అని రావెళ్ల తెలంగాణ చారిత్రక, శిల్ప సౌందర్యాన్ని ఏనాడో కీర్తించారు. తొలి శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు ఇలా అనేక రాజవంశాలు తెలంగాణను పాలించి ఇక్కడి సాంస్కృతిక, జీవన వైవిధ్యాన్ని నలుదిశలా చాటారు. నాటి ఘనమైన చరిత్ర నేడు ప్రతి పల్లెల్లోనూ సాక్షాత్కరిస్తున్నది. ఊరూరా ఇండ్లనే కోటలుగా కట్టుకున్న వారసత్వ సంపద తెలంగాణ సొంతం. దేశ, విదేశీ రాయబారులు ఎంతోమంది ఇక్కడి సంపదను మెచ్చుకొన్నారు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంతాల అధికారులు తెలంగాణ చారిత్రక, వారసత్వ సంపద మరుగునపడేశారు. ఏఎస్‌ఐ జాబితాలోని 137 ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్‌లో 129 ప్రాంతాలు ఆంధ్రాకు చెందినవి ఉంటే.. తెలంగాణ నుంచి 8 మాత్రమే చేర్చారు.
heritage-telangana1
రెండు కోటలు (గోల్కొండ, ఖిలా వరంగల్) రామప్ప, వేయి స్తంభాలగుడి, జానంపేట, ఆలంపూర్, చార్మినార్, కొండాపూర్‌ను మాత్రమే తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర పురావస్తుశాఖ తమ పరిధిలోకి తీసుకున్నది. రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రాంతాలను మాత్రమే నోటిఫై చేస్తూ హైదరాబాద్ ప్రత్యేక సర్కిల్ ఏర్పాటుచేశారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో గోల్కొండతోపాటు వరంగల్ సబ్ సర్కిల్ (వేయి స్తంభాల గుడి, రామప్ప, ఖిలా వరంగల్, జానంపేట) మాత్రమే ఉన్నాయి. నిజానికి ఆలంపూర్ (ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లా)లోని 8 మాన్యుమెంట్స్, శక్తిపీఠంతోసహా ఇక్కడ సబ్ సర్కిల్ చేయదగ్గ ప్రాంతం. ఇవేవీ పట్టించుకోకుండా.. ఉన్న హైదరాబాద్ సర్కిల్‌ను మినీసర్కిల్‌గా మార్చాలని ఏఎస్‌ఐలో ఉన్న ఆంధ్రా అధికారులు కుట్ర పన్నుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఏపీ సర్కిల్‌ను అమరావతి, మరో ప్రాంతం పేరుతో రెండు సర్కిళ్లు చేయాలని ప్రతిపాదనలు కూడా పెట్టినట్టు తెలిసింది.
 

మినీ సర్కిల్‌గా మారిస్తే..

వాస్తవంగా ఏఎస్‌ఐ బడ్జెట్ కేటాయింపులు చేస్తే హైదరాబాద్ సర్కిల్‌కు, ఆంధ్రా సర్కిల్‌కు సమానంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అదే హైదరాబాద్‌ను సబ్‌సర్కిల్ చేస్తే చాలావరకు నిధులు తగ్గుతాయి. అంతేకాకుండా సిబ్బంది స్థాయి కూడా మారిపోతుంది. నిధులు, అధికారుల పోస్టుల స్థాయిని పక్కనపెడితే.. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద ప్రాముఖ్యం తగ్గే ప్రమాదం అధికంగా పొంచి ఉన్నది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తెలంగాణ చారిత్రక ఇమేజ్ దెబ్బతింటుంది. తను చేయదు, చేయనివ్వదు అని ముద్రపడ్డ కేంద్ర పురావస్తుశాఖ తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ఔన్నత్యాన్ని మరింత దిగజార్చే కుట్ర లోపాయికారిగా చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...