snoww Posted January 20, 2019 Report Share Posted January 20, 2019 రిసార్ట్‌లో కొట్టుకుని ఆసుపత్రిపాలైన ఎమ్మెల్యే 20-01-2019 14:50:22 బెంగళూరు: రిసార్ట్ రాజకీయాలు, రాజకీయ డ్రామాలు, పార్టీల్లో అంతర్గత పోరాటాలు కర్ణాటకకు కొత్తమీ కాదు. ఈసారి మాత్రం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటామాటా పెరిగి, ఆ తర్వాత కలబడటంతో వారిలో ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. బెంగళూరు ఈగల్ రిసార్ట్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, కాంపి ఎమ్మెల్యే జేఎన్ గణేష్‌లు ఆదివారం తెల్లవారుజామున గొడవ పడ్డారు. బీజేపీకి ఫిరాయించేందుకు గణేష్ ప్రయత్నిస్తున్నారన్న విషయంపై ఇద్దరి మధ్యా వాగ్వాదం చెలరేగింది. ఈ ఘర్షణలో గణేష్ మద్యం బాటిల్ తీసుకుని ఆనంద్ సింగ్ తలపై మోదినట్టు పార్టీ వర్గాల సమాచారం. గాయపడిన ఆనంద్ సింగ్‌ను శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఉదయం 7.05 గంటలకు ఆసుపత్రికి వచ్చిన ఆనంద్ సింగ్‌ను ఇన్-పేషెంట్ బ్లాక్‌లో చేర్చగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరవచ్చంటూ పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగడంతో గత శక్రవారం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌లో ఉంచారు. బలనిరూపణ కోసం ఈగల్టన్ రిసార్ట్‌కు రావాలంటూ తమ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. కాగా, రిసార్ట్‌లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాహాబాహీగా దిగారన్న వార్తలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మీడియాకు తెలిపారు. 'గొడవా లేదు, దాడులూ లేవు, లిక్కర్ బాటిళ్లూ లేవు. మీరంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలే మీడియాకు వివరణ ఇస్తారు. ఛాతీ నొప్పితోనే మా ఎమ్మెల్యే ఆసుపత్రిలో చేరారు' అని ఆయన చెప్పారు. కాగా, ఆసుపత్రిలో చేరిన ఆనంద్ సింగ్‌ను డీకే శివకుమార్ సోదరుడు, కనకపుర ఎమ్మెల్యే డీకే సురేష్ సహా పలువురు నేతలు పరామర్శించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted January 20, 2019 Report Share Posted January 20, 2019 If upa comes in central then kukkalu chimpina vistari ayyidi desham Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted January 20, 2019 Report Share Posted January 20, 2019 Ohh ee kottukovadama.. edho anukoni ocha dhaanike hospital entaa ani Quote Link to comment Share on other sites More sharing options...
mydhapindi Posted January 20, 2019 Report Share Posted January 20, 2019 33 minutes ago, TOM_BHAYYA said: Ohh ee kottukovadama.. edho anukoni ocha dhaanike hospital entaa ani same pinch ninu be ade anukoni vachha tom b... Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted January 20, 2019 Author Report Share Posted January 20, 2019 37 minutes ago, TOM_BHAYYA said: Ohh ee kottukovadama.. edho anukoni ocha dhaanike hospital entaa ani Lol. ABN vaadu pettina title. 2 MLA's kottukunnaru Ani rayochu gaa Quote Link to comment Share on other sites More sharing options...
Odale Posted January 20, 2019 Report Share Posted January 20, 2019 1 hour ago, TOM_BHAYYA said: Ohh ee kottukovadama.. edho anukoni ocha dhaanike hospital entaa ani 1 hour ago, TOM_BHAYYA said: Ohh ee kottukovadama.. edho anukoni ocha dhaanike hospital entaa ani Same 2 same anukuni vaccha.... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.