snoww Posted April 28, 2019 Author Report Posted April 28, 2019 రాజధానిలో ఆక్సిజన్ స్థాయి పెంచుతాం: సీఎం అమరావతిలో ఆక్సిజన్ స్థాయి పెంచడంతోపాటు కర్బన ఉద్ఘారాలను పూర్తిగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో రాజధాని రోడ్లపై వందశాతం ఎలక్ట్రికల్ వాహనాలు నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సీఎం బుధవారం పర్యటించి.. అక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్, ట్రంకు రోడ్లు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్లు, తాత్కాలిక హైకోర్టు.. తదితర నిర్మాణాలను పరిశీలించారు. నేలపాడు వద్ద విలేకరులతో మాట్లాడుతూ రూ.48,116 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, 320 కి.మీ. పొడవునా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. తాజ్‌మహల్, చార్మినార్ లాగా అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతాయన్నారు. గ్రీన్, ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్ హబ్‌గా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. కేసీఆర్‌కు చేతకాలేదు: బంగారుబాతు లాంటి హైదరాబాద్‌ను తెలంగాణకు అప్పగిస్తే.. నగరం నుంచి వస్తున్న ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చేతకాలేదని చంద్రబాబు విమర్శించారు. Quote
snoww Posted April 28, 2019 Author Report Posted April 28, 2019 అన్ని దారులూ అమరావతికే! 06-01-2019 03:22:57 రాజధాని నగర నిర్మాణాన్ని చూసేందుకు సందర్శకుల క్యూ అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అద్భుత కట్టడాలు. ఆకాశ హర్మ్యాలు. ఇటుక.. ఇసుక లేదు. పొద్దున చూస్తే ఖాళీ స్థలం.. సాయంత్రానికి అక్కడో నిర్మాణం... రాజధాని అమరావ తి నగర నిర్మాణంపై సాగుతున్న ప్రచారమిది. అంతా నిజమే నా? అవన్నీ గొప్పలేనా?.. ఒకరు చెప్పేదేంటి? చూసొస్తే పో లా? ఇవీ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చలు. అందుకే రాజధానిలో నిర్మాణాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. సందర్శకులకు రాష్ట్ర ప్రభుత్వమే రవాణా, భోజన సదుపాయాలను కల్పిస్తుండటంతో అధిక సంఖ్యలో జనం అమరావతికి తరలివస్తున్నారు. డిసెంబరు 28న ప్రభుత్వం అమరావతి పర్యటనను ప్రారంభించగా.. ఆదివారాన్ని మినహాయించి ఈ 8 రోజుల్లో సుమారుగా 12 వేల మంది అమరావతిని సందర్శించారు. వీరంతా బస్సుల్లో వచ్చినవారు కాగా.. సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకుని వస్తున్నవారూ ఉన్నారు. ప్రతి రోజూ వందలాదిమంది రాజధానికి వచ్చి.. పెద్దఎత్తున సాగుతున్న నిర్మాణాలను తిలకిస్తున్నారు. నిర్మాణ పనులను కనులారా వీక్షించామన్న తృప్తితో, చక్కటి అనుభూతులను మూటగట్టుకుని స్వస్థలాలకు వెళుతున్నారు. పోలవరం జలాశయ నిర్మాణ తీరుతెన్నుల గురించి అందరూ తెలుసుకునేందుకు వీలుగా కొన్ని నెలల క్రితం ప్రభుత్వం పోలవరం యాత్రలను ప్రారంభించిం ది. దీనికి రోజురోజుకూ ఆదరణ పెరగడమే కాకుండా.. పోలవ రం ప్రాజెక్టుకు సంబంధించి పెద్దఎత్తున సానుకూల ప్రచారం లభిస్తోంది. దీంతో పోలవరం యాత్రల మాదిరిగానే అమరావతి సందర్శన యాత్రలనూ ప్రభుత్వం నిర్వహిస్తోంది. వివిధ జిల్లాల అధికార యంత్రాంగం, ఏపీఎస్సార్టీసీ, సీఆర్డీయే తదితర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో అమరావతి సందర్శన యాత్రలను గత నెల 28వ తేదీన ప్రారంభించింది. ఈ యాత్రలను దృష్టిలో ఉంచుకుని ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో ‘రాజధాని మాస్టర్ ప్లాన్ 3డి’ నమూనాతో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది. రోజు రోజుకూ పెరుగుతున్న సందర్శకులు డిసెంబరు 28న మొదలైన అమరావతి సందర్శన యాత్రకు తొలి రోజున 12 ఆర్టీసీ బస్సుల్లో వివిధ జిల్లాలకు చెందిన 600 మంది వచ్చారు. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ.. శనివారం 39 బస్సుల్లో 1900 మంది అమరావతిని సందర్శించారు. అధికారికంగా ఇంతవరకు 11,700 మంది అమరావతిని సందర్శించారు. సందర్శకులంతా రాజధాని నిర్మా ణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ఉద్యోగులు, వేలాది మంది కార్మికులు, పెద్ద పెద్ద యంత్రాలు నిర్విరామంగా రాజధాని పనుల్లో నిమగ్నమవడం చూసి అచ్చెరువొందుతున్నారు. Quote
allari_alludu Posted April 28, 2019 Report Posted April 28, 2019 we need to do polling and pick the most important one out of all these comedies Quote
kothavani Posted April 28, 2019 Report Posted April 28, 2019 Anna Niku chala opika undi store chesukunava pics anni cbn kuda madichipoyi untadu Quote
Hydrockers Posted April 28, 2019 Report Posted April 28, 2019 Rajadhani ni AC latho cool chesara Quote
snoww Posted April 28, 2019 Author Report Posted April 28, 2019 2 hours ago, kothavani said: Anna Niku chala opika undi store chesukunava pics anni cbn kuda madichipoyi untadu Used search feature in this DB and found PPTs Quote
kothavani Posted April 28, 2019 Report Posted April 28, 2019 16 minutes ago, snoww said: Used search feature in this DB and found PPTs Ok 🤣 Quote
JambaKrantu Posted April 28, 2019 Report Posted April 28, 2019 Vammo enni comedies chesaru last 5 years Quote
snoww Posted April 28, 2019 Author Report Posted April 28, 2019 2 hours ago, JambaKrantu said: Vammo enni comedies chesaru last 5 years My Fav is Flying Taxis and Water Taxis PPT's in Amaravati Not able to find those now Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.