thamudu_satyam Posted April 28, 2019 Report Posted April 28, 2019 @snoww bro please check @SonyKongara previous threads. You'll find lot of gems like Nile Crocodiles . Quote
snoww Posted April 28, 2019 Author Report Posted April 28, 2019 2 minutes ago, thamudu_satyam said: @snoww bro please check @SonyKongara previous threads. You'll find lot of gems like Nile Crocodiles . Thanks Bro. Will do it 1 Quote
snoww Posted April 28, 2019 Author Report Posted April 28, 2019 కూల్.. కూల్.. కేపిటల్ 31-01-2019 04:08:57 ఇంటింటికీ పైపు ద్వారా ఏసీ రాజధానికి వినూత్న చల్లదనం దుబాయ్ కంపెనీ ముందుకు రూ.260కోట్లు,20వేల టన్నుల సామర్థ్యంతో ఒక్కో ఏసీ ప్లాంటు భూమి,డక్ట్ సర్కార్ ఇస్తే చాలు ఖర్చంతా భరించనున్న కంపెనీ 2.5 ఎకరాల్లో ఏర్పడే ప్లాంటుతో 500 ఎకరాల్లోని భవంతికి ఏసీ అమరావతి: ఇంటింటికీ పైపుల ద్వారా మంచినీళ్లు, గ్యాస్ సరఫరా చేస్తున్నట్లే, ఏపీ కూడా సరఫరా చేసే రోజులు వచ్చేశాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇంటింటికీ పైపుల ద్వారా ఏసీని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ బుధవారం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఈ విష యం తెలిపారు. దుబాయ్‌కి చెందిన తబ్రీద్ అనే సంస్థ నూతన రాజధానిలో ఈ సౌకర్యం కల్పించడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థతో సీఆర్‌డీఏ ఇప్పటికే దీనిపై ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొంది. దుబాయ్‌లో ఇప్పటికే ఈ తరహా విధానం అమలు అవుతోంది. రాష్ట్ర ప్రభు త్వ అధికారులు అక్కడకు వెళ్లి చూసి సంతృప్తి చెందిన తర్వాత దానిని అమరావతిలో అమలు చేయడానికి పచ్చ జెండా ఊపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా ఈ విధానం అమల్లోకి వస్తుండటం విశేషం. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం అనే విధానం ద్వారా దీనిని అమలు చేస్తారు. Quote
snoww Posted April 28, 2019 Author Report Posted April 28, 2019 విశాఖలో గేమింగ్ సిటీ 16-02-2018 02:49:18 గేమింగ్, యానిమేషన్, గ్రాఫిక్స్ సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం డిస్నీల్యాండ్‌కూ ఆహ్వానం వినోద నగరంలో అంతర్జాతీయ సంస్థల ఏర్పాటే లక్ష్యంగా త్వరలో ఏవీజీసీ విధానం ఏపీలో వర్క్ ఫ్రం హోమ్ ప్రాజెక్టు లోకేశ్‌తో ‘ఫస్ట్ అమెరికా’ ప్రతినిధుల భేటీ అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): యానిమేషన్, వీఎ్‌ఫఎక్స్, గ్రాఫిక్స్, కామిక్స్ రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విశాఖపట్నంలో వినోద నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగు విభాగాలకు ఇటీవల కాలంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో వీటికి చెందిన సంస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సిద్ధమవుతోంది. ఫిల్మ్, మీడియా, ఏవీజీసీ(యానిమేషన్, వీఎ్‌ఫఎక్స్, గ్రాఫిక్స్, కామిక్స్) సిటీ పేరుతో 40 ఎకరాల్లో వినోద నగరాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం సినిమాల్లో యానిమేషన్, గ్రాఫిక్స్ ఓ భాగంగా మారిపోయాయి. పూర్తిస్థాయి యానిమేషన్ సినిమాలూ ఎక్కువగానే వస్తున్నాయి. బాహుబాలి లాంటి సినిమా తర్వాత వీఎ్‌ఫఎక్స్, గ్రాఫిక్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మరోవైపు గేమింగ్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో విశాఖలో అంతర్జాతీయ స్థాయిలో వినోద నగరాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. వినోద రంగానికి సంబంధించిన పలు సంస్థలు ఈ నగరంలో ఏర్పాటయ్యేలా చూస్తారు. దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థలు తమ యూనిట్లను ఇక్కడ పెట్టేలా చూడటంతోపాటు అమెరికాకు చెందిన డిస్నీల్యాండ్ సంస్థతో కూడా మాట్లాడి, ఆ సంస్థనూ ఆహ్వానించాలని ఐటీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ సిటీకి సంబంధించిన పూర్తిస్థాయి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏవీజీసీ రంగాల్లోని ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి వచ్చేలా ఆకర్షించేందుకు కొత్తగా ఏవీజీసీ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినోద నగరంలో సంస్థలను ఏర్పాటు చేసే కంపెనీలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు, వారికి కలిగే ప్రయోజనాలు తదితరాలన్నీ ఈ విధానంలో ఉంటాయి. ఫైబర్ గ్రిడ్‌తో వర్క్ ఫ్రమ్ హోం! రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్‌ను ఉపయోగించుకుని వర్క్ ఫ్రం హోమ్ ప్రాజెక్టును కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు ఫస్ట్ అమెరికా(ఇండియా) కంపెనీ పేర్కొంది. ఇంటి నుంచే ల్యాండ్ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని కంపెనీ ఉపాధ్యక్షుడు రఘు పేర్కొన్నారు. ఇది విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల ల్యాండ్ రికార్డులను కూడా ఏపీలో ఇంటి దగ్గర కూర్చునే డిజిటలైజ్ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఫలితంగా ఇంటి దగ్గర నుంచే పనిచేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చన్నారు. ఫస్ట్ అమెరికా ప్రతినిధులు గురువారం సచివాలయంలో మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఫైబర్‌గ్రిడ్‌ను ఉపయోగించుకుని గ్రామాల్లోని యువతీయువకులు ఇంటి నుంచే పని చేసుకునేలా ఒక మోడల్ అభివృద్ధి చేయాలని కోరారు. భూరికార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలు, గృహిణులకు శిక్షణ ఇచ్చి ఇంటి నుంచే పనిచేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటు చేయాలని ఫస్ట్ అమెరికా యాజమాన్యాన్ని ఆహ్వానించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ.. త్వరలోనే విజయవాడలో కంపెనీ ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరిస్తామన్నారు. క్యుబెక్ మంత్రితో ఏపీ ఆర్సీ భేటీ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతున్న గేమింగ్, డిజిటల్ లెర్నింగ్ హబ్‌పై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఈ హబ్ ఏర్పాటుకు గతేడాది డిసెంబరులో యునెస్కో ఎంజీఐఈపీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హబ్‌ను కెనడా దేశంలోని క్యుబెక్ ప్రావిన్స్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రావిన్స్ అంతర్జాతీయ సంబంధాల వ్యవహారాల మంత్రి క్రిస్టియన్ పియారితో గురువారం ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ సమావేశమయ్యారు. హబ్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం కల్పిస్తోన్న సౌకర్యాలు, పరిపాలనలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సరికొత్త టెక్నాలజీ గురించి ఆమెకు వివరించారు. నూతన రాజధాని అభివృద్ధిని పరిశీలించడానికి అమరావతిని సందర్శించాలని ఆయన ఆహ్వానించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.