Jump to content

అజ్ఞాతంలోకి రవిప్రకాశ్‌!


snoww

Recommended Posts

అజ్ఞాతంలోకి రవిప్రకాశ్‌!

సెల్‌ఫోన్ల స్విచ్ఛాఫ్‌
గాలిస్తున్న పోలీసులు

11main6a.jpgఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రాయదుర్గం: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సైబరాబాద్‌ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. టీవీ9కు సంబంధించిన పలు అంశాలు తెలుసుకునేందుకు సైబరాబాద్‌ ప్రత్యేక పోలీస్‌ బృందం, సైబర్‌ క్రైమ్‌ అధికారులు శనివారం బంజారాహిల్స్‌లో రవిప్రకాశ్‌ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్నవారిని వాకబుచేయగా.. బయటకు వెళ్లారని, ఎక్కడికి వెళుతున్నారో తమకు చెప్పలేదని వివరించారు. రవిప్రకాశ్‌ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఇందుకు పదిరోజుల గడువు కావాలని ఆయన న్యాయవాది పోలీస్‌ ఉన్నతాధికారులకు అభ్యర్థన పత్రం ఇచ్చారు. రవిప్రకాశ్‌ ఎక్కడికి వెళ్లారని ఆయన సన్నిహితులు, కొంతమంది టీవీ9 ఉద్యోగులను ప్రశ్నించగా.. వారు కూడా తమకు ఏమీ చెప్పలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. రవిప్రకాశ్‌ సెల్‌ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటంతో  అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని తెలిపారు. మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని పోలీసులు రెండోరోజూ విచారించారు. టీవీ9లో ఎవరు షేర్లు కొన్నారు? ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా? ఫోర్జరీ లేఖను ఎవరు తయారుచేశారు? అని ప్రశ్నించారు. ఇక విచారణకు హాజరుకాని నటుడు శివాజీకి మరోసారి తాఖీదులు ఇవ్వనున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Link to comment
Share on other sites

టీవీ9 రవి ప్రకాశ్‌, సీనీ నటుడు శివాజీపై వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా పలు విమర్శలు, వ్యంగోక్తులు చేశారు. విజిల్‌ బ్లోయర్స్‌ యాక్ట్‌, పీనల్‌ కోడ్‌ సెక్షన్ల గురించి ఉపన్యాసాలు దంచిన గరుడ పురాణం శివాజీ నాలుగు రోజులుగా ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నించారు. తన జాతకం తానకే తెలిసిపోవడంతో పరారీలో ఉంటున్నారని విమర్శించారు. ‘ రవి ప్రకాశ్‌ రక్షిస్తాడనుకుంటే ఆయనే రోడ్డునపడ్డాడు. ఫోన్లో కూడా దొరకట్లేదంటగా’ అంటూ వరుస ట్వీట్లతో శివాజీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

చదవండి : తెల్లకాగితం మీద అగ్రిమెంట్‌ రాసుకోవడమేంటో?

టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసు వ్యవహారంలో శుక్రవారం విచారణకు హాజరు కావాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టీవీ 9 మాజీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తి, రవి ప్రకాశ్‌, శివాజీలకు నోటీసులు అందించారు. వీరిలో ఎంకేవీఎన్‌ మూర్తి విచారణకు హాజరుకాగా.. రవిప్రకాశ్‌, శివాజీ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Makede gadu merigaina Samajam ani cheppi eede under ground poindu

Ie debba tho Ravi Prakash gadi chapter close anate

and much needed one....media heads baaga nilgudu ekuvaindi, ie debba tho migita kodukulu sakkaga aitaru

A boothu kitti gaadini kuda edo okati cheyale vaa...

Link to comment
Share on other sites

Veedu balloon laa undevadu starting lo.. taruvata six pack chesadu gaa..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...