boeing747 Posted May 20, 2019 Report Share Posted May 20, 2019 అరుదైన బాంబే బ్లడ్‌గ్రూప్ యువకుడి ఆదర్శం ఈనాడు, విశాఖపట్నం: అరుదైన రక్త గ్రూపు ఉన్న యువకుడు పుణే నుంచి విశాఖకు సొంత ఖర్చులతో వచ్చి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. బాంబే బ్లడ్ గ్రూపు రక్తం ఉన్నవారు దేశం మొత్తంమీద 200 మంది వరకే ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రూపు రక్తం ఉన్న యువతి సంగీతకు రక్తం తక్షణ అవసరమని విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు తేల్చారు. సమాచార మాధ్యమాలు, రక్తదాతల గ్రూపులకు లైఫ్షేర్ బ్లడ్‌బ్యాంకు ప్రతినిధులు సమాచారం చేరవేయడంతో పుణేకు చెందిన చిరువ్యాపారి గణేశ్భవన్ లోఖండే(33) స్పందించారు. ఆయనే బ్లడ్‌బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి తానే సొంత ఖర్చుతో విశాఖకు వస్తానని హామీనిచ్చి బయలుదేరారు. పుణే నుంచి ముంబయికి అక్కడినుంచి విమానంలో ఆదివారం ఉదయం విశాఖకు చేరుకున్నారు. విశాఖలోని ఓ హోటల్లో తానే గది తీసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆదివారం మధ్యాహ్నం రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తదానం చేశారు. అత్యంత అరుదైన తన రక్తాన్ని అవసరమైనప్పుడు దానం చేయడమే సమాజానికి తాను చేసే మంచిగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 30 సార్లు రక్తదానం చేశానని, అడిగిన వెంటనే ఎక్కడికైనా వెళ్లి రక్తదానం చేస్తుంటానని తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted May 20, 2019 Report Share Posted May 20, 2019 good job Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted May 20, 2019 Report Share Posted May 20, 2019 Hats off gif please Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.