snoww Posted July 19, 2019 Report Posted July 19, 2019 రాజధాని పనులు నిలిపేశారా? అమరావతిలో పనులు నిలిపివేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసిన మాట వాస్తవమేనా? సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టిన పనుల పురోగతి ఏమిటి? అని గిరిధర్‌రావు ప్రశ్నించారు. మంచి రాజధాని రావాలని కలలు కంటున్న రాష్ట్ర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఎక్కడో ఉన్న కాళేశ్వరం వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కసారి అమరావతిలో రాజధాని పనులు చూడలేరా? అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి 1.01 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి రూ.500 కోట్లు కేటాయిస్తే పనులెలా అవుతాయని నిలదీశారు. దీనికి మంత్రి బొత్స సమాధానం ఇస్తూ రాజధానిలో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కేవలం 10 పనులు మాత్రమే 50శాతం వరకు అయ్యాయని, మిగిలిన పనులు అన్నీ 25 శాతం లోపు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. రాజధానిని, అందులోని పుట్టలు, చెట్లను రోజూ చూస్తూనే ఉన్నామని, ఇంకేం చూడాలని బొత్స అన్నారు. తినడానికి తిండి లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్లుగా గత ప్రభుత్వంలో వ్యవహరించారని విమర్శించారు. రూ.500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు గానీ... 5 ఏళ్లలో తెదేపా ప్రభుత్వం ఇచ్చింది రూ.1105 కోట్లేనని చెప్పారు. గత సంవత్సరం రూ.232 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ రాజధాని అంటే లక్ష కోట్ల కుంభకోణం అని విమర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజధాని పేరుతో బయటి నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒకరికే అనుబంధ ప్రశ్న అడిగేందుకు అవకాశముంటుందని గతంలో స్పీకర్ రూలింగ్ ఇచ్చారని, అధికారపక్షంలో ఇందరికి అవకాశం ఎలా ఇస్తారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనిపై తెదేపా సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. Quote
Bestguy Posted July 19, 2019 Report Posted July 19, 2019 13 hours ago, snoww said: Jagan will hardly care for Amaravati . His main focus will be welfare schemes which will benefit majority people , not just few contractors and real estate business people. nee telivi telirantee vundhi lee..welfare schemes ki dabbulu ekkada nunchi vastayoo telisthee ee mata matladavu.. Quote
Respected_Sir Posted July 19, 2019 Report Posted July 19, 2019 Amaravati ayyelopu manam amarulam avtaamu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.