Jump to content

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారి కోసం కొన్ని జాగ్రత్తలివి


Yaman02

Recommended Posts

శ్రావణ మాసంలో అత్యంత ప్రీతికరమైన వరలక్ష్మీ వ్రతం రోజున బంగారు ఆభరణాన్ని అమ్మ ముందుంచి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆభరణాలు కొనుగోలు చేసే శక్తిలేని వారు ఆరోజున వ్రతం నిర్విఘ్నంగా సాగేందుకు వీలుగా కనీసం వరలక్ష్మీ బొమ్మతో కూడిన కాసును కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇదే అదనుగా కాసుల అమ్మకాల్లో వ్యాపారుల మోసాలు వెలుగుచూస్తుంటాయి. మహిళలు పసిడి ఆభరణాలకు ప్రాధాన్యం ఇస్తారు. సామాన్యులు డబ్బు దాచుకుని అప్పుడప్పుడు పసిడి దుకాణాలకు వెళ్తుంటారు. వివాహాది శుభాకార్యాల్లో బంగారు ఆభరణాల కొనుగోలు తప్పనిసరి అయిపోయింది. ఈ మాసంలో మహిళలు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ సందర్భంగా బంగారు కాసును కొనుగోలు చేసి పూజిస్తారు. తాహతుకు తగినట్టుగా బంగారు అభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ నెలరోజుల్లో రూ.కోట్లలో బంగారం వ్యాపారం సాగుతుంది. వినియోగదారులు అప్రమత్తంగా లేకుంటే పసిడి ఆభరణాల్లో నిలువునా మోసపోవాల్సి వస్తుంది. ఇప్పటికే బంగారం ధరలు ఆకాశానికి అంటిన నేపథ్యంలో చిన్నపాటి మోసం జరిగినా రూ.వేలల్లో నష్టపోవాల్సిందే...
 
 
హాల్‌మార్క్‌లో రెండు రకాలు
హాల్‌ మార్కు అంటే 91.6 అని అంతా భావిస్తుంటారు. కానీ ఇవి రెండురకాలుగా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఒకటి 91.6 హాల్‌మార్కు ఆభరణాలు, మరొకటి 75 హాల్‌మార్కు ఆభరణాలు. వాస్తవానికి మేలిమి బంగారం 24 క్యారెట్స్‌గా నిర్ణయిస్తారు. ఇది మెత్తగా ఉండడంతో ఆభరణం తయారీ సాధ్యంకాదు. ఇందులో కొంత రాగి, వెండి వంటి ఇతర లోహాల్ని మిళితం చేయాలి. దీంతో ఆభరణంలోని బంగారు శాతం తగ్గుతుంది. అందులోని బంగారం శాతాన్ని తెలుపుతూ హాల్‌మార్కు టచ్‌ వేస్తారు. 22 క్యారెట్ల బంగారం ఉంటే 91.6 హాల్‌మార్కు ముద్రవేస్తారు. బరువులో 91.6 శాతం బంగారం ఉందని దీని అర్ధం. 75 టచ్‌ హాల్‌మార్కు ఆభరణంలో 75 శాతం మాత్రమే పసిడి ఉంటుంది. ఈ విషయం తెలియని వినియోగదారులు హాల్‌మార్క్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే.
 
 
కాసుల అమ్మకాల్లో
వరలక్ష్మీ కాసుల అమ్మకాల్లో పసిడి వర్తకులు చేతివాటానికి తెరతీస్తున్నారు. కాసుల్లో పసిడి నాణ్యతను తగ్గించి విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికే దుకాణాల్లో శ్రావణలక్ష్మి బంగారు కాసులు సిద్ధం చేశారు. ప్రస్తుతం మేలిమి బంగారం ధర గ్రాము రూ.3,800కి పైగా పలుకుతుండగా వరలక్ష్మి కాసు ధర రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఉంది. అరగ్రాము కాసు ధర రూ.వెయ్యికి కూడా విక్రయిస్తున్నారు. ఇందులోనే అసలు మతలబుంది. కాసుల తయారీలో రాగి ఎక్కువగా కలుపుతున్నారు. 30 టచ్‌ ఉన్న కాసులు కూడా మార్కెట్‌లో లభ్యమవుతుంటాయి. కొనుగోలు చేసిన కాసులో కేవలం 30 శాతం మాత్రమే బంగారం ఉంటుంది. ఈ విషయం తెలియని వినియోగదారులు చౌకగా కాసు లభిస్తుందని మురిసిపోతున్నారు. అందులో మోసాన్ని గ్రహించలేకపోతున్నారు. కొన్ని దుకాణాల్లో హాల్‌మార్కు కాసులు ఉన్నప్పటికీ అధికలాభాలు చేకూర్చే కాసులే చూపిస్తున్నారు.
 
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
91.6 హాల్‌మార్కు బంగారం కాసులు కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
 
75 హాల్‌మార్కు, 91.6 హాల్‌మార్కు అనేది తీసుకునే ఆభరణంపై ముద్రించబడి ఉంటుంది. దీనిని పరిశీలించాలి.
 
బంగారం కొనుగోలు చేసిన తరువాత వినియోగదారులు రశీదు తీసుకోవాలి.
 
పలుషాపుల్లో రశీదులు ఇచ్చినప్పుడు ఎంత బంగారం అనేది ఎవరికీ అర్ధంకాకుండా అడ్డదిడ్డంగా రాస్తుంటారు. బంగారం బరువు, ధర అందరికీ తెలిసేలా రశీదు రాయించి స్వీకరించాలి.
 
హాల్‌మార్కులేని బంగారం కానుగోలు చేసినప్పుడు బంగారం ధరకంటే తక్కువగా ఇచ్చేందుకు వ్యాపారులు సిద్ధపడ్డారంటే దానిలో మోసం ఉందని గ్రహించాలి.
 
తీసుకున్న బంగారంలో నాణ్యతపై అనుమానాలుంటే గోల్డ్‌ టెస్టింగ్‌ సెంటర్‌కు వెళ్లి నిర్ధారణ చేయించుకోవాలలి.
 
కేవలం రూ.50 చెల్లిస్తే బంగారు ఆభరణం నాణ్యత తెలిపే ధ్రువపత్రం, ఫొటోతో సహా అందజేస్తారు.
 
గోల్డ్‌ టెస్టింగ్‌ తరువాత నాణ్యత తక్కువ ఉంటే షాపు యజమానిని నిలదీయవచ్చు. లేదంటే వినియోగదారుల ఫారంలో కేసు వేయవచ్చు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...