DBgirl Posted October 7, 2019 Report Posted October 7, 2019 1 minute ago, Rushabhi said: Choodataniki entha amayakam ga undi Bagundhi kada kani Quote
Rushabhi Posted October 7, 2019 Report Posted October 7, 2019 1 minute ago, DBgirl said: Bagundhi kada kani Ayithe pelli chesukoni papam aunty ki life ivvu. Criminals lo chachipoyina vallalo kooda andham choosthav. Raviteja nee bondha raa gif please evaranna 1 Quote
JohnSnow Posted October 7, 2019 Report Posted October 7, 2019 19 minutes ago, Rushabhi said: Choodataniki entha amayakam ga undi 47 lo kuda aunty is hot no Quote
american_desi Posted October 7, 2019 Report Posted October 7, 2019 9 minutes ago, JohnSnow said: 47 lo kuda aunty is hot no Adi recent photo ai undaka povachchu. We will see real photo if there is mug shot photo but I dont think that concept is there in India (releasing mug shot to news papers) Quote
idlysambar Posted October 7, 2019 Report Posted October 7, 2019 జాలీదయా లేకుండా చంపేసింది అత్తింటివారిని, బంధువులను అంతంచేసిన కోడలు 14 సంవత్సరాల్లో 6 హత్యలు ఆస్తి కోసం దారుణం 17 ఏళ్ల పాటు ‘సమాధై’పోయిన నిజం కేరళలో వెలుగులోకి.. కొజికోడ్: కేరళలోని కోజికోడ్ జిల్లాలో పున్నమట్టోంది ఒక సంపన్న కుటుంబం. 2002 నుంచి 2016 వరకూ ఆ ఇంటికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఒకే రీతిలో హఠాన్మరణానికి గురయ్యారు. వారివి సహజమరణాలే అనుకున్నారంతా. కానీ వాస్తవం వేరు. ఆ వాస్తవం సుమారు 17 ఏళ్లపాటు మౌనంగా ‘సమాధి’ అయిపోయింది. అయితే, నిప్పులాంటి నిజం ‘సమాధు’ల్లో నుంచి తాజాగా బయటపడింది. నివ్వెరపరిచే విషయాలను కళ్లముందుంచింది. ఇంటి కోడలే ‘యమపాశమైన’ సంగతి వెలుగులోకి వచ్చింది. ఆ కోడలి పేరు జాలీ(47). ఆమె పకడ్బందీగా వ్యూహం పన్ని ఈ హత్యలన్నీ చేసింది. ఆమె తన రెండో భర్తతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు తలెత్తినప్పటికీ, అతడికి సంబంధం ఉన్నట్లు ప్రాథమికంగా సాక్ష్యాల్లేవీ కనపడటం లేదని పోలీసులు తాజాగా తెలిపారు. జాలీ ఓ ఆభరణాల సంస్థలో పనిచేసే మాథ్యూ అనే వ్యక్తి సాయంతో సైనేడ్ తెప్పించి ఆహారపదార్థాల్లో కలిపి కుటుంబసభ్యులను ఒక్కొక్కరిగా 14 ఏళ్ల వ్యవధిలో చంపేసింది. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన జాలీ, మాథ్యూ, సైనేడ్ సరఫరా చేసిన ప్రజిత్‌కుమార్‌లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జాలీ తొలి లక్ష్యం జాలీ అత్తగారు అన్నమ్మథామస్(57). మామ టామ్‌థామస్(66) చనిపోతే ఆస్తి ముందుగా అన్నమ్మ పరం అవుతుంది కాబట్టి తొలుత 2002లో ఆమెకు ఆహారంలో సైనేడ్ కలిపి ఇచ్చింది. తిన్న తర్వాత ఆమె ‘కుప్పకూలిపోయి’ మరణించారు. అన్నమ్మది సహజమరణమే అనుకున్నారంతా. ఆస్తిలో అధిక వాటా కొట్టేసేందుకు ఆ తర్వాత ఆరేళ్లకు టామ్ థామస్(66)కూ సైనేడ్ ఇవ్వడంతో ఆయన మరణించారు. ఆయనదీ గుండెపోటే అనుకున్నారు జనం. తన స్నేహాలను వ్యతిరేకిస్తూ...తనతో సరిగా ఉండని భర్త రాయ్‌పై పీకలదాకా ద్వేషం పెంచుకుని, తర్వాతి లక్ష్యంగా ఆయనను ఎంచుకుంది. 2011లో ఆమె పెట్టిన పప్పు అన్నం తిన్న రాయ్‌థామస్(44) మరణించారు. శవపరీక్షలో అతడి మృతికి విషం కారణమని తేలినప్పటికీ భర్తకు గుండెపోటు వచ్చినట్లు జాలీ వాదించింది. శవపరీక్షకోసం పట్టుబట్టిన అన్నమ్మ సోదరుడు మాథ్యూ మన్‌జదియల్(67)పై ద్వేషం పెంచుకుంది. 2014లో మాథ్యూ మన్‌జదియల్ సైతం అదే రీతిలో చనిపోయారు. అందరినీ ఒకే శ్మశానవాటికలో సమాధి చేశారు. అక్కడితో మరణాల పరంపర ఆగలేదు. 2016లో మామగారి సోదరుడి కుమారుడైన షాజూ రెండేళ్ల కుమార్తె ఆల్పైన్ కూడా ఒక్కసారిగా ‘గుండెపోటు’తో కుప్పకూలిపోయింది. చిన్నారి మరణించిన కొద్దినెలలకే ఆల్పైన్ తల్లి సిలీ(27) కూడా అలాగే చనిపోయింది. ఈ మధ్యలో ఆడపడుచు రెజీకి ఓ ఆయుర్వేద టానిక్‌లో విషపదార్థం కలిపి ఇచ్చినప్పటికీ ఆమె అస్వస్థతకు గురైనా ఎలాగో బతికిపోయారు. విషయం బయటకు వస్తే కుటుంబం పరువుపోతుందని తాను ఎవరికీ చెప్పలేదని రెజీ ఇప్పుడు వెల్లడించారు. కుమార్తె చేసిన ఈ ఘాతుకాల గురించి తమకేమీ తెలియదని జాలీ తలిదండ్రులు పోలీసులకు శనివారం చెప్పారు. ఆరుగురిని హత్య చేసిన తర్వాత జాలీ.. ఆల్పైన్ నాన్న షాజూను పెళ్లి చేసుకుంది. అతడు జాలీ మామగారి సోదరుడి కుమారుడే. మామగారైన థామస్ వీలునామా ప్రకారం ఆస్తిని తనకు అప్పగించాలని జాలీ వాదన మొదలు పెట్టింది. దీంతో అమెరికాలో ఉన్న థామస్ రెండోకుమారుడు మోజోకు అనుమానం వచ్చింది. ఆస్తికోరుతూ వదిన వేసిన వ్యాజ్యాన్ని సవాలు చేశారు. కుటుంబంలో మరణాల వెనక ఏదో మిస్టరీ ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరాతీస్తే తీగలాగితే డొంక కదిలినట్లు వాస్తవం వెలుగుచూసింది. సమాధులను తవ్వితీసి పరీక్షలు నిర్వహించగా మృతదేహాల్లో సైనైడ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. పాలిగ్రాఫ్ పరీక్ష చేయించుకోవలసిందిగా అధికారులు అడిగితే తనకు ఆరోగ్యం బాగాలేదని జాలీ తిరస్కరించడం గమనార్హం. ఈ సంచలనాత్మక కేసు ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఏవైనా లోటుపాట్లున్నాయా అనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు మరింతగా పరిశోధిస్తారని డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా తెలిపారు. Quote
DBgirl Posted October 7, 2019 Report Posted October 7, 2019 1 hour ago, Rushabhi said: Ayithe pelli chesukoni papam aunty ki life ivvu. Criminals lo chachipoyina vallalo kooda andham choosthav. Raviteja nee bondha raa gif please evaranna Yenthina sati amayi kada 😁👍 Quote
xano917 Posted October 7, 2019 Report Posted October 7, 2019 mana desi police inability idi postmortem is a joke actually in india yevadanna sucide chesukunte, postmortem chese vallu adugutharu real postmortem cheyyala or papers matram kavala ani. most of time body late ga vasthundhi ani family will just take the papers instead. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.