Jump to content

Telangana harvest 2014 vs 2019


Recommended Posts

Posted

Because of all irrigation projects going on through out the state the farm lands prices almost raised 10-100 times since TG was formed.  Add Rythu Bhandhu incentive to it. 

this is actual wealth creation. 

  • Upvote 1
Posted

Third crop bumper harvest isari....oil seeds, cotton, commercial crops, fine rice paddy varieties...

Even Maize and Corn kuda third crop vastundi...especially industrial grade maize/corn...

second crop procurement has just started...a data kuda bumper vundi..

  • Upvote 1
Posted
1 minute ago, snoww said:

Because of all irrigation projects going on through out the state the farm lands prices almost raised 10-100 times since TG was formed.  Add Rythu Bhandhu incentive to it. 

this is actual wealth creation. 

Rural wealth creation aithe baaga push vachindi...domestic consuption of good and services kuda kam se kam three fold increase ayi vuntadi...kastha a farm output okati efficent ga avuthe saal...

  • Upvote 1
Posted

Inka kaleshwaram complete aithe inka manaki tirugu ledu. Hats off to dora vision and kudos to the farming community. 

  • Upvote 1
Posted
13 minutes ago, snoww said:

Slipper shot to all to all parties and leaders who said your area is in high elevation , so Mee bathuku inthe, meeku water raavu. 

surprisingly Nalgonda of all districts..backed by the Integrated Fisheries Development Scheme has topped State in fish production in 2019. 

It topped in the State...link

  • Upvote 1
Posted
11 minutes ago, hyperbole said:

surprisingly Nalgonda of all districts..backed by the Integrated Fisheries Development Scheme has topped State in fish production in 2019. 

It topped in the State...link

Fisheries is another sector which will benefit because of kaaleshwaram. And tourism too. 

  • Upvote 2
Posted

సిరుల పంట

Feb 10, 2020 , 01:52:55
 
సిరుల పంట
 
  • రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి
  • ఐదేండ్ల పెరుగుదలతో పోల్చితే ఈసారి అత్యధికం
  • 2019-20 వానకాలం, యాసంగిలో 97.43 లక్షల ఎకరాల్లో పంటలసాగు
  • రెండుసీజన్లు కలిపి 130 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి
  • అర్థగణాంకశాఖ రెండోముందస్తు అంచనా నివేదికలో వెల్లడి
 

 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సిరులపంట పండుతున్నది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగనున్నది. గత ఐదేండ్లుగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మరింత అధికంగా రానున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు ఇతరప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం అంచనాలను మించి నమోదయింది. దీంతో ఉత్పత్తి కూడా అదేస్థాయిలో వస్తుందని అర్థగణాంకశాఖ నివేదిక వెల్లడించింది. 

 

2019-20 వానకాలం, యాసంగి సీజన్లు కలిపి 130 లక్షల మెట్రిక్‌ టన్నుల (1.30 కోట్ల మెట్రిక్‌ టన్నులు) ఆహారధాన్యాల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. ఇది గతేడాది కంటే 37.26 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికమని అర్థగణాంకశాఖ తన రెండోముందస్తు అంచనాల నివేదికలో వెల్లడించింది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఇదే అత్యధికమని కేంద్ర, రాష్ట్ర వ్యవసాయశాఖలకు అధికారులు నివేదించారు. ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా 97.43 లక్షల ఎకరాల్లో ఆహారపంటలు సాగయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 29.02 శాతం అధికం. 

 

ఇందులో వరి వానకాలంలో 37.09 శాతం, యాసంగిలో 53.7 శాతం అధికంగా సాగయింది. వానకాలంలో 78.68 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి రాగా, యాసంగిలో 51.33 లక్షల మెట్రిక్‌ టన్నులు రానున్నట్టు అర్థగణాంకశాఖ అంచనావేసింది. పప్పుధాన్యాల పంటల సాగు 13.10 లక్షల ఎకరాల్లో కాగా, ఉత్పత్తి మొత్తం 4.67 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్నది. ఇది గతేడాది కంటే 27 వేల టన్నులు అధికం. మిర్చి ఈసారి 24 వేల మెట్రిక్‌ టన్నులు పెరిగి 3.28 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని నివేదికలో పేర్కొన్నారు. కాగా, పసుపు ఉత్పత్తి గతం కంటే 14 వేల మెట్రిక్‌ టన్నులు తగ్గింది. ఈసారి 3 .05 లక్షల మెట్రిక్‌ టన్నులు అంచనా వేసింది.

 

వరి అత్యధికం

రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం పెరుగడంతోపాటు, దిగుబడి కూడా పెరుగడంతో మొత్తం ఉత్పత్తిలో గణనీయ పెరుగుదల నమోదయింది. వానకాలం, యాసంగి సీజన్లలో వరి 68.50 లక్షల ఎకరాల్లో సాగైంది. 2018-19తో చూస్తే 20.76 లక్షల ఎకరాలు అధికంగా సాగవడం గమనార్హం. దీంతో వరిధాన్యం ఉత్పత్తి కూడా భారీగా వస్తున్నదని అర్థగణాంకశాఖ తెలిపింది. వానకాలంలో ఏకంగా 89.49 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 58.62 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి రానున్నట్లు అంచనా వేసింది. గత వానకాలంతో చూస్తే 2019లో 44.32 శాతం ఉత్పత్తి, యాసంగిలో 54.22 శాతం పెరుగుతున్నది. ఈ రెండు సీజన్లలో కలిపి 148.11 లక్షల మెట్రిక్‌ టన్నులు రానున్నట్లు పేర్కొంది. గతేడాదితో చూస్తే ఏకంగా 48.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి పెరుగనుండటం విశేషం. ఇక మొత్తం బియ్యంగా మారిస్తే 66.67 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తుందని నివేదికలో వివరించారు. 

 

పెరిగిన మక్కజొన్న.. తగ్గిన వేరుశనగ

మక్కజొన్న రెండు సీజన్లలో కలిపి 13.69 లక్షల ఎకరాల్లో సాగయింది. గతేడాది కంటే 27 వేల ఎకరాలు అధికంగా సాగుచేశారు. మొత్తం 25.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి రానున్నట్టు అంచనా వేశారు. గతేడాదితో చూస్తే 4.77 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది. వానకాలంలో 15.65 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 9.94 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి కానున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. పెసర గతేడాది ఈసారి ఒకేరకంగా 48 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. మినుములు ఉత్పత్తి పడిపోయింది. గతంలో 31 వేల మెట్రిక్‌ టన్నులు రాగా, ఇప్పుడు 18 వేల టన్నులకే పరిమితమయింది. సోయాబీన్‌ 88 వేల మెట్రిక్‌ టన్నులు పెరిగి ఈసారి 3.22 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనా. 

 

శనగ పంట 1.46 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 1.89 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. గతేడాది కంటే 1.04 లక్షల ఎకరాలు అధికంగా సాగు కావడంతో ఉత్పత్తి కూడా 25 వేల మెట్రిక్‌ టన్నులు పెరుగనున్నది. వేరుశనగ 3.27 లక్షల ఎకరాల్లో సాగు కాగా , గతం కంటే 32 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి తగ్గింది. 2.83 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తుందని నివేదించారు. నూనెగింజల ఉత్పత్తి ఈసారి పెరిగింది. 8.278 లక్షల ఎకరాల్లో సాగు నమోదు కాగా, 6.64 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనావేశారు. గతేడాది కంటే 42 వేల మెట్రిక్‌ టన్నులు పెరుగడం గమనార్హం. 

 

కంది దిగుబడి.. పత్తి ఉత్పత్తి పెరుగుదల

కంది పంటను వానకాలంలో 7.29 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. గతేడాది కంటే స్వల్పంగా తగ్గింది. అయితే ఉత్పత్తి మాత్రం 15 వేల మెట్రిక్‌ టన్నులు పెరిగింది. యాసంగిలో కందుల ఉత్పత్తి 2.07 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తున్నదని నివేదికలో పేర్కొన్నారు. ఇది గతేడాది 1.92 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్నది. రాష్ట్రంలో వరి తర్వాత ప్రధానపంట అయిన పత్తి ఈసారి 52.24 లక్షల ఎకరాల్లో సాగయింది. గతంకంటే 2.75 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు నమోదయింది. అయితే ఉత్పత్తిని 48.62 లక్షల బేల్స్‌ (ఒక్క బేల్‌ 170 కేజీలు)గా అంచనావేసింది.

 

 
Posted
1 minute ago, tom bhayya said:

Yellow media news lite antunna @snoww

Many of my family members are in farming through out TG. I don't need any media news to know the ground reality. 

  • Upvote 1
Posted

In certain areas, TG is doing really well. Fish production lo kuda antha baaga develop ayindi ani was kind of surprise. 

Poultry and Meat lo kuda production increased by three fold, rural lands la sheep grazing kosam people are willing to pay 10,000 per acre..and Poultry lo kuda, pretty much South India la consuption and production chala high lo vundi...comparatively to the size of the state, meat and poultry are doing very good.

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...