Jump to content

పిజ్జా బాయ్‌ నిర్వాకం..అశ్లీల గ్రూపుల్లో నటి నంబర్‌ ..


r2d2

Recommended Posts

తస్మాత్‌ జాగ్రత్త అంటున్న ‘అంజలి’ నటి

పిజ్జా బాయ్‌ నిర్వాకం..అశ్లీల గ్రూపుల్లో నటి నంబర్‌

చెన్నై: పిజ్జా డెలివరీ బాయ్‌ చేసిన నిర్వాకంతో ఓ నటి ఇబ్బందులకు గురయ్యారు. దీంతో సదరు నటి పోలీసులను ఆశ్రయించారు. అసలేం జరిగిందంటే.. మణిరత్నం తెరకెక్కించిన ‘అంజలి’ సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు గాయత్రి సాయి. ఆ తర్వాత ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె ఫోన్‌ నంబర్‌ను ఓ పిజ్జా డెలివరీ బాయ్ పలు అశ్లీల గ్రూప్‌ల్లో షేర్‌ చేశాడు. దీంతో ఆమెకు పలువురి నుంచి అసభ్యకరమైన సందేశాలు వచ్చాయి. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ నంబర్‌ను షేర్‌ చేయకుండా ఉండేలా ఆన్‌లైన్‌ యాప్స్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విటర్‌ వేదికగా సదరు డెలివరీ బాయ్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ పలు ట్వీట్లు పెట్టారు.

పిజ్జా బాయ్‌ నిర్వాకం..అశ్లీల గ్రూపుల్లో నటి నంబర్‌

‘ఈ నెల 9న పిజ్జా డెలివరీ కోసం ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతను నా ఫోన్‌ నంబర్‌ను పలు అశ్లీల గ్రూపుల్లో షేర్‌ చేశాడు. దీంతో పలువురి నుంచి అసభ్యకరమైన సందేశాలు, ఫోన్‌కాల్స్‌ నాకు వస్తున్నాయి. దీని గురించి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి’ అని గాయత్రిసాయి పేర్కొన్నారు. అంతేకాకుండా తనకి వచ్చిన చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను షేర్‌ చేసి ఆమె తమిళనాడు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘ఈ విధంగా అతను నా ఫోన్‌ నంబర్‌ను షేర్‌ చేశాడు. దయచేసి నాకు సాయం చేయండి’ అని ట్వీట్‌ చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్‌  చెప్పినట్లు గాయత్రి ట్వీట్‌ చేశారు.

Link to comment
Share on other sites

2 hours ago, kr123 said:

India lo kuda Swiggy and Uber customers numbers ni hide chestai

mari idi ela bayataki vachindi...chennai metro ne kada... it should be zomato/swiggy/domino's/pizzahut  etc

aadevado company name bayataki raakunda baane manage chesadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...