ariel Posted March 13, 2020 Author Report Posted March 13, 2020 బాబుకు ఆ నోటీసు తప్పే.. డీజీపీ అంగీకారం ఇదేం పద్ధతి! ఇది రాష్ట్రమేనా? ఇక్కడ చట్టం అమలవుతోందా? పోలీస్ బాస్‌కు హైకోర్టు సూటి ప్రశ్నలు.. నోటీస్‌పై క్లాస్ చట్టం పాటించండి ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి అధికారులు నిష్పాక్షికంగా ఉండాలి డీజీపీగా ఉండి మాతో చెప్పించుకుంటే ఎలా? 151 సెక్షన్ కింద విపక్ష నేత అరెస్టు సరైనదేనా? అక్కడ తీవ్ర నేరం ఎవరు చేయబోయారు? న్యాయ పాలన చేయాల్సింది ఇలాగేనా? రాష్ట్రంలో నిబంధనల అమలు సరిగా లేదు రాజధాని గ్రామంలో అంతమంది పోలీసులా? కశ్మీర్‌లో 500 మందితో కవాతు చేస్తే సరే! ఇక్కడ చేయించాల్సిన అవసరం ఏమిటి? ఇలాగైతే జోక్యం చేసుకోక తప్పదు: హైకోర్టు బాబుకు ఆ నోటీసు తప్పే.. డీజీపీ అంగీకారం సెక్షన్‌ను ఆయనతో చదివించిన ధర్మాసనం సూటి ప్రశ్నలు... ఘాటు హెచ్చరికలు... తీవ్ర వ్యాఖ్యలు! రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, రెవెన్యూ శాఖల తీరుపై హైకోర్టు విరుచుకుపడింది. అసలు ఇది రాష్ట్రమా... మరొకటా! అని విస్మయం వ్యక్తం చేసింది.చట్ట నిబంధనలు అమలవుతున్నాయా అని సందేహించింది. విశాఖపట్నంలో విపక్ష నేతను సీఆర్పీసీ 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడంపై స్వయంగా హాజరైన డీజీపీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక... పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న భూసేకరణ తీరునూ తప్పుపట్టింది. పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని... అసైన్డ్ భూముల్లో వారికేం పని అని ప్రశ్నించింది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన పొలాలను ఇళ్ల స్థలాలకు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పోలీస్ బాస్ గౌతం సవాంగ్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ఇదేనా పద్ధతి’ అని నిలదీసింది. అటు విశాఖపట్నంలో సీఆర్పీసీ సెక్షన్ 151 కింద విపక్షనేత చంద్రబాబును అరెస్టు చేయడం... ఇటు రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపుపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి డీజీపీని ఉక్కిరి బిక్కిరి చేసింది. విశాఖ ఉదంతం అనంతరం... చంద్రబాబుకు తగిన భద్రత కల్పించాలని, ఆయన పర్యటనలు, శాంతియుత నిరసనలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేలా పోలీసుల్ని ఆదేశించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే టి.శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ గౌతం సవాంగ్ గురువారం త్రిసభ్య ధర్మాసనం ముందు హాజరయ్యారు. ప్రతిపక్ష నేతకు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. ఎందుకిలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? చట్ట నిబంధనలు/న్యాయపాలన అమలు తీరు ఇదేనా అని ప్రశ్నించింది. చట్టాల అమలుపై సాక్షాత్తు డీజీపీయే కోర్టుతో చెప్పించుకుంటే ఎలా? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మున్ముందు పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ జోక్యం తప్పదని, ఈ వ్యవహారాలపై తగు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక... ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్న రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం, వందలాదిమంది పోలీసుల్ని మోహరించడం, మహిళలు చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం పట్ల మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏముందో చదవండి! విశాఖలో చంద్రబాబుకు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన నేపథ్యంలో... ఆ సెక్షన్‌లో ఏముందో చదవండి అని డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. ఆయన చదివి వినిపించారు. ఆ తర్వాత... ఆ సెక్షన్ కింద విశాఖ డీసీపీ ఇచ్చిన నోటీసును కూడా డీజీపీతో చదివించింది. అనంతరం, విచారణ ఇలా జరిగింది... ధర్మాసనం: మీరు (పోలీసులు) ప్రతిపక్ష నేతకు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసు జారీ చేయవచ్చా? ఆ సెక్షన్ కింద ఆయనను అరెస్టు చేయవచ్చా? కాగ్నిజబుల్ (తీవ్ర) నేరాలకు పాల్పడే అవకాశముంటే, వాటిని అడ్డుకునేందుకు 151 నోటీసు ఇస్తారని మీరే చదివారు. ప్రతిపక్షనేత విశాఖ వచ్చినప్పుడు ఎవరు తీవ్ర నేరం చేయబోయారు? ఆ నేరానికి రూపకల్పన చేసిందెవరు? మీరెవరిని అరెస్టు చేశారు? దీనిని ఎలా సమర్థించుకుంటారు? చంద్రబాబు పర్యటనకు మీరే అనుమతి ఇచ్చారు కదా?! డీజీపీ: అక్కడ నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితుల కారణంగా 151 కింద నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అక్కడ నెలకొన్న ఉద్రిక్తలను అదుపు చేసేందుకు, మాజీ ముఖ్యమంత్రిని రక్షించేందుకు ఆ చర్యలు తీసుకున్నాం. ధర్మాసనం: పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యలను కాదనడం లేదు. అది పోలీసుల బాధ్యత కూడా! పరిస్థితులు చేయి దాటిపోతున్నాయనుకున్నప్పుడు నివారణ చర్యలు చేపట్టాల్సిందే. కానీ... ప్రతిపక్ష నేతపై సీఆర్పీసీ సెక్షన్ 151ని ఎలా ప్రయోగిస్తారు? ముందు జాగ్రత్త కోసం అరెస్టు చేసే విధానం ఇదేనా? మీ కింది ఉద్యోగి న్యాయంగా నడుచుకోలేదు. 151 కింద నోటీసు ఇచ్చిన ఏసీపీ వైఖరిని విశాఖ సీపీ కూడా సమర్థించారు. అందుకే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. మీ కింది ఉద్యోగి తప్పు చేయడం వల్లనే మిమ్మల్ని పిలిచాం! డీజీపీ: 151 కింద నోటీసు ఇవ్వాల్సింది కాదు. అది ఆ పరిస్థితులకు అనుగుణంగా లేదు. ధర్మాసనం: మీ విశాఖ సీపీ సమాధానంలో అలా లేదు. ఆ నోటీసును ఆయన సమర్థించుకున్నారు. చట్ట నియమాలను ఉల్లంఘించారు. డీజీపీ: ఆ నోటీసు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేదు. ధర్మాసనం: ప్రతిపక్షనేత విశాఖ వచ్చినప్పుడు ఎవరు తీవ్ర నేరం చేయబోయారు? ఆ నేరానికి రూపకల్పన చేసిందెవరు? మీరెవరిని అరెస్టు చేశారు? మీరు ఈ రాష్ట్రానికే డీజీపీ. రాష్ట్రంలో చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడడం మీ బాధ్యత. హైకోర్టు కల్పించుకుని చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే మేం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. రాష్ట్రంలో చట్ట నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదు. ఈ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలపై చాలా కేసులు మా ముందున్నాయి. అందుకే మిమ్మల్ని వ్యక్తిగతంగా నేరుగా రమ్మని పిలిపించాం. డీజీపీ: మీరు జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించి నడచుకుంటాం. వాటిని అమలు చేస్తాం. ధర్మాసనం: సీఆర్పీసీ 151 కింద నోటీసు ఇవ్వడం తప్పిదమేనని మీరు అంగీకరించారు. అందుకు బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు? డీజీపీ: ఈ వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి చర్యలు తీసుకోలేదు. కోర్టు ఆదేశాల కోసం చూస్తున్నాం. ధర్మాసనం: కోర్టులో ఉన్నదానికి, మీరు చర్యలు తీసుకోవడానికి సంబంధం లేదు. మీ కింది స్థాయి అధికారి తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకునే అధికారం మీకుంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి. డీజీపీ: బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ధర్మాసనం: విశాఖ ఏసీపీ తప్పు చేసినందున ఆయనపై చర్యలు తప్పవు. ఏసీపీ చర్యల్ని సమర్థించిన విశాఖ సీపీపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు? డీజీపీ: ఇద్దరిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం! ధర్మాసనం: ఆ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి. ‘రాజధాని’పై ఇలా...విశాఖ అంశం ముగిసిన వెంటనే రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ప్రారంభమైంది. ధర్మాసనం: మీరు పెన్‌డ్రైవ్‌లో ఉన్న వీడియోను చూశారా? డీజీపీ: చూశాను. ధర్మాసనం: ఆ గ్రామంలో 500 మంది పోలీసులు ఎందుకున్నారు? అక్కడ అంతమంది అవసరమా? ఆ వీడియోలోని పోలీసు హెచ్చరికలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అంత అవసరం ఏం వచ్చింది? డీజీపీ: అది జనవరి 10 తేదీన... రాజధాని ఆందోళనలు మొదలైన 22 రోజుల తరువాత మందడంలో జరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. ధర్మాసనం: నిరసన ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు అంతమంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు వ్యవహరించిన తీరు, వారి ప్రకటన మనం ప్రజాస్వామ్య దేశంలో లేమన్న భావన కలిగించేలా ఉంది. 500 మంది పోలీసులు కశ్మీర్‌లో ఫ్లాగ్‌మార్చ్ చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడంత అవసరమేమొచ్చింది? డీజీపీ: ఆ ఒక్కరోజే అలా జరిగింది. ధర్మాసనం: ఒక్కరోజు కాదు. వరుసగా జరుగుతూనే ఉంది. మీరు రాష్ట్ర పోలీస్ శాఖకు అధిపతి. చట్టప్రకారం నడుచుకోనివారిపై చర్యలు తీసుకోండి. దీనిపై మళ్లీ మళ్లీ చెప్పబోం. ‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ఎలా? నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే. అది ఈ రోజు నుంచే ప్రారంభం కావాలి. మా ఆదేశాలు అమలు చేస్తారని ఆశిస్తున్నాం. డీజీపీ: థ్యాంక్యూ సర్. చట్టాల్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాను. అది నా కర్తవ్యం. మీ ఆదేశాలను పాటిస్తాను. సాయంత్రం దాకా కోర్టులోనే! డీజీపీ గౌతం సవాంగ్ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైకోర్టులోనే గడిపారు. ఉదయం 10.25 గంటలకు కోర్టుకు వచ్చిన డీజీపీ సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆయనతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు సైతం కోర్టుకు వచ్చారు. Quote
DaatarBabu Posted March 13, 2020 Report Posted March 13, 2020 Just now, ariel said: Avakasam spelling mistake Anna... Inthaki endi matter... Tdp ki veyamantav... Sare veseddam... Matter over no! Quote
ariel Posted March 13, 2020 Author Report Posted March 13, 2020 Just now, pamogudu said: paytm batch ki matter dorakka ila sollu posts esukuni gadipestunnara Quote
pamogudu Posted March 13, 2020 Report Posted March 13, 2020 Just now, ariel said: paytm batch ki matter dorakka ila sollu posts esukuni gadipestunnara Quote
ariel Posted March 13, 2020 Author Report Posted March 13, 2020 2 minutes ago, snoww said: clickbait fake title chudadam kadu ra jaffa.. akkada video chudu vote ki asalu enduku money ivali chesina panulu development chusi votes vestaru annadu CBN.. volunteer program petti janam dabbuto salaries istu ycheap party supporters la inti intiki tippi vote veyakapote govt programs raddu ani cheppadam daniki me panikimalina jaffa batch support Quote
snoww Posted March 13, 2020 Report Posted March 13, 2020 26 minutes ago, ariel said: clickbait fake title chudadam kadu ra jaffa.. akkada video chudu vote ki asalu enduku money ivali chesina panulu development chusi votes vestaru annadu CBN.. volunteer program petti janam dabbuto salaries istu ycheap party supporters la inti intiki tippi vote veyakapote govt programs raddu ani cheppadam daniki me panikimalina jaffa batch support Nandhyala elections lo gelavaka pothe meeku panulu cheyya ani open gaa warning ichina baboru and pulkas ee seppali inka neethulu. Lol pulkas. Quote
ariel Posted March 13, 2020 Author Report Posted March 13, 2020 Just now, snoww said: Nandhyala elections lo gelavaka pothe meeku panulu cheyya ani open gaa warning ichina baboru and pulkas ee seppali inka neethulu. Lol pulkas. proof vey mundu fake sollu chana sustunnam Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.