Jump to content

34కేసులొస్తే.. 10.8కోట్ల మంది లాక్‌డౌన్‌!


Assam_Bhayya

Recommended Posts

34కేసులొస్తే.. 10.8కోట్ల మంది లాక్‌డౌన్‌!

చైనాలో మళ్లీ కరోనా కలకలం

chinabrk1a.jpg

 

బీజింగ్: చైనాలో పుట్టిన కరోనా అక్కడ అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ అక్కడ కలకలం సృష్టిస్తోంది. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వుహాన్లో 76 రోజుల పాటు కఠినంగా లాక్డౌన్ అమలు చేసిన చైనా ప్రభుత్వం ప్రస్తుతం నిబంధనల్ని పూర్తిగా సడలించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా జిలిన్ ప్రావిన్స్లో కొత్తగా 34 కేసులు బయట పడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 10.8 కోట్ల మంది జనాభా ఉండే జిలిన్ ప్రావిన్స్లో రోజు నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది

ఈశాన్య చైనాలో భాగమైన జిలిన్ ప్రాంతంలో బస్సులు, రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. పాఠశాలలు, కార్యాలయాలన్నీ మూతపడ్డాయన్నారు. శనివారం అకస్మాత్తుగా మూడు కేసులు నమోదు కాగా.. ఆదివారం మరో రెండు కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు.

హుబేయి రాష్ట్ర రాజధాని వుహాన్లో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు అవలంబిస్తున్నట్టు జిలిన్ రాష్ట్రంలోని షులాన్ నగర ప్రభుత్వం తెలిపింది. కరోనా బాధితులు/ అనుమానితులు ఉన్న ప్రదేశాలను పూర్తిగా మూసివేసినట్టు వెల్లడించింది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని, అదీ ప్రతి రెండు రోజులకు రెండు గంటల పాటు మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు.

ఒక్కసారిగా ఇలా కేసులు పెరగడానికి గల కారణాలేంటో అధికారులు ఇంకా నిర్ధారించలేదు. రష్యాలో ఉండే చైనా పౌరులు తిరిగి రావడంతో వారి ద్వారానే ఈ కేసులు వచ్చి ఉంటాయని కొందరు భావిస్తున్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత రష్యాలోనే భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 3లక్షల కేసులు రష్యాలో నమోదు కాగా.. వారిలో 2,722 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనాలో ఇప్పటివరకు దాదాపు 84వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 4,638మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం చైనాలో యాక్టివ్ కేసులు 2వేలే ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.

 

Link to comment
Share on other sites

WHO gallu next em sollu guidelines/warning announce chestharo, mana Ind and other govts malla etlaa react ayitharo . . inka lockdown down laanti pichi panulu vadhura babooo

pfdb_brahmi37.gif

Link to comment
Share on other sites

1 minute ago, Assam_Bhayya said:

WHO gallu next em sollu guidelines/warning announce chestharo, mana Ind and other govts malla etlaa react ayitharo . . inka lockdown down laanti pichi panulu vadhura babooo

 

:giggle:

yebbey - emi serious kaadhantaremo 

Link to comment
Share on other sites

30 minutes ago, JaiTDP said:

:giggle:

yebbey - emi serious kaadhantaremo 

_-_     Looks like, our Ind govt learnt the lesson and got smart . .l +_(

 

ఒకట్రెండు కేసులకే ఆఫీసులు మూసేయొద్దు

కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు

 

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ నెల 31 వరకు కొనసాగనుంది. ఆర్థిక కార్యకలపాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా పలు కార్యాలయాలు తెరుచుకొనేందుకు అనుమతిచ్చింది. నేపథ్యంలో పలు ప్రభుత్వ/ ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది

ఒకటి లేదా రెండు కేసులు వస్తే మొత్తం కార్యాలయాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయా కార్యాలయాలను శానిటైజేషన్ చేయాలని సూచించింది. ఒకవేళ భారీ సంఖ్యలో కేసులు నమోదైతే మాత్రం మొత్తం భవనాన్ని 48గంటల పాటు మూసివేయాలని ఆదేశించింది. కార్యాలయ భవనాలను శానిటైజ్ చేసి ఇక సిబ్బందిని అనుమతించవచ్చు అని చెప్పేవరకు అందరూ ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఎవరైనా సిబ్బందిలో కరోనా లక్షణాలు కనబడితే వాళ్లు ఆఫీస్కు వెళ్లకుండా వైద్యుల్ని సంప్రదించేలా చూడాలంది. ఒకవేళ కరోనాగా అనుమానం ఉన్నా.. నిర్ధారణ అయినా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం తెలపాలని సూచించిందికంటైన్మెంట్ జోన్లలో హోం క్వారంటైన్లో ఉన్న సిబ్బంది అడిగితే వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వాలని ఆదేశించిందిసమావేశాల నిర్వహణ, సందర్శకులను సమన్వయం చేయడం వంటి విషయాల్లో సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) మార్గదర్శకాలను చాలా జాగ్రత్తగా పాటించాలని సూచించింది. కార్యాలయాల్లో కారిడార్లు, ఎలివేటర్లు, మెట్లు, క్యాంటీన్, సమావేశ గదులు, కాన్ఫరెన్స్ హాళ్లలో దగ్గరగా మెలిగే అవకాశం ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఏదైనా అనుమానిత కేసు ఉంటే సమర్థంగా స్పందించాలని సూచించింది.

ఒకరు కన్నా ఎక్కువమంది వ్యక్తులు ఒకే గది/ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరిలోనైనా కరోనా లక్షణాలు బయటపడితే.. వ్యక్తిని ఐసోలేషన్ చేయాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, మిగతా వాళ్లు మాస్క్లు ధరించేలా చూడటంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని హోం క్వారంటైన్ చేయాలని సూచించింది

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...