r2d2 Posted December 20, 2020 Report Share Posted December 20, 2020 ‘వకీల్‌సాబ్’లో లీకుల పర్వం కొనసాగుతూనే ఉంది. పవర్‌స్టార్ సినిమా అంటేనే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. పవన్ సినిమా ప్రకటించింది మొదలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. షూటింగ్ ఎంత వరకు వచ్చింది..? అసలు ఈ సినిమాలో పవర్‌స్టార్ లుక్ ఎలా ఉండబోతుంది.? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అందుకే చిత్రబృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వరుసగా ఫొటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల పవర్‌స్టార్ ఫొటో ఒకటి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా మరో ఫొటో లీక్ అయింది. అయితే.. ఈ ఫొటో ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తీసినట్లు తెలుస్తోంది. అందులో హీరోహీరోయిన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కనిపిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కథానాయిక శృతిహాసన్. పవన్, శృతి కాంబినేషన్లో ఇది మూడో చిత్రం. ఇప్పటికే ‘గబ్బర్‌సింగ్’, ‘కాటమరాయుడు’ సినిమాల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. కాగా.. హిందీలో వచ్చి మంచి విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మగువా మగువా’ సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted December 20, 2020 Report Share Posted December 20, 2020 Shruthi back to fit days.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.