Jump to content

రఘురామ అనర్హతపై టెన్షన్- వివరణకు గడువు కోరితే-వైసీపీ చివరి అస్త్రం అదే...


NiranjanGaaru

Vote  

17 members have voted

  1. 1. ?

    • He will be disqualified
    • No he will remain as mp

This poll is closed to new votes

  • Please sign in or register to vote in this poll.
  • Poll closed on 07/31/2021 at 07:18 PM

Recommended Posts

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ విధానాలతో విభేదిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ తో నోటీసులు ఇప్పించడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. అయితే నోటీసులకు రఘురామ ఇచ్చే వివరణ తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. నిత్యం తమను చికాకుపెడుతున్న రఘురామపై ఈసారి ఎలాగైనా అనర్హత వేటు వేయించాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ.. ఇప్పటికే ప్రకటించిన విధంగా పార్లమెంటులో నిరసనలు చేపడుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

రఘురామ అనర్హతపై ఉత్కంఠ
 

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నుంచి అనర్హత వేటుపై వైసీపీ చేసిన ఫిర్యాదుపై నోటీసులు జారీ అయ్యాయి. వీటికి 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని లోక్ సభ సచివాలయం ఆయన్ను కోరింది. ఈ నేపథ్యంలో రఘురామ ఇచ్చే సమాధానం, ఆయనకు వ్యతిరేకంగా పార్లమెంటులో వైసీపీ చేపట్టాలనుకున్న నిరసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో రఘురామ వ్యవహారంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో తన ఎంపీలు టీడీపీకి ఫిరాయించినా వేటు వేయించుకోవడంలో విఫలమైన వైసీపీ.. ఈసారి రఘురామ విషయంలో తమ పంతం నెరవేర్చుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది.

పార్లమెంటు సమావేశాల్లోనే వేటు వేయించేలా...
 

ఈ నెల 19న పార్లమెంట్ వర్షాకాల సమవేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆగస్టు 23 వరకూ ఈ సమావేశాలు జరగబోతున్నాయి. దీంతో ఈ సమయంలోనే రఘురామరాజుపై వేటు కోసం వీలైనన్ని ప్రయత్నాలు చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం లోక సభ స్పీకర్ వద్ద లాబీయింగ్ ముమ్మరం చేయడంతో పాటు పార్లమెంటులోనూ ఒత్తిడి పెంచేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. లోక్ సభ స్పీకర్ అనర్హత ఫిర్యాదుపై స్పందించేందుకు రఘురామరాజుకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియబోతోంది. ఆ లోపు రఘురామ వివరణ వస్తే ఆ తర్వాత వైసీపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేయబోతోంది.

రఘురామ జవాబు కోసం వైసీపీ ఎదురుచూపులు
 

లోక్ సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు జవాబిచ్చేందుకు ఆయనకు ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేందుకు ఆగస్టు 23 వరకూ గడువు ఉంది. ఈ మధ్యలో రఘురామ నుంచి లోక్ సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు సమాధానం లభించే అవకాశం ఉంది. స్పీకర్ కు రఘురామ వివరణ అందగానే వెంటనే రంగంలోకి దిగి వేటు పడేలా ఒత్తిడి పెంచాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో రఘురామ కూడా ఆ మేరకు కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

గడువు లోగా రఘురామ వివరణ ఇస్తారా ?
 

లోక్ సభ సచివాలయం జారీ చేసిన నోటీసుల ప్రకారం వైసీపీ చేసిన అనర్హత ఫిర్యాదుపై స్పందించేందుకు రఘురామరాజుకు 15 రోజుల గడువు ఉంది. అంటే ఈ నెలాఖరులోపు ఆయన స్పందించాల్సి ఉంటుంది. అయితే వివరణ ఇవ్వలేకపోతే అందుకు తగిన కారణాలను ఆయన లోక్ సభ స్పీకర్ కు నిర్ణీత గడువులోగా వివరించాల్సి ఉంటుంది. స్పీకర్ అనుమతితో వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కూడా కోరే అవకాశముంది. పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్నందున ఆ తర్వాత వివరణ ఇస్తానని చెప్పేందుకు కూడా వీలుంది. అయితే రఘురామరాజు ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

రఘురామ వివరణ ఆలస్యమైతే ?
 

ఒకవేళ లోక్ సభ స్పీకర్ నోటీసుల ప్రకారం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వివరణ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే, లోక్ సభ అందుకు అనుమతిస్తే అప్పుడు వైసీపీ ఇరుకునపడుతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో రఘురామరాజుపై వేటు కోసం పార్లమెంటులో నిరసనలకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ స్పీకర్ నోటీసుల నేపథ్యంలో వెంటనే నిరసనలు చేపట్టడానికి బదులుగా.. ఈ వ్యవహారం ఆలస్యమైతేనే పార్లమెంటులో నిరసనలు చేసేందుకు వైసీపీ వ్యూహచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా గడువులోగా రఘురామ వివరణ ఇచ్చేస్తే వేటు కోసం లోక్ సభ స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని వైసీపీ భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారం అంతా తిరిగి రఘురామ చేతుల్లోనే ఉండేలా కనిపిస్తోంది.

Link to comment
Share on other sites

Just now, Ryzen_renoir said:

Just like Jagan bail case , nothing will happen. 

Evadu entha edchina RRR will finish his term

Jagan govt chestuna manchi panulu ni against ga matladtunna RRR matti kottukupovali ani jaffas aaratam poratam manasulo.... 

Link to comment
Share on other sites

Malli parliament samavasalu..... Ap prajalu eager ga chuse avasaram vachindi, after no confidence motion against BJP by tdp, ram mohan naidu speech 

Link to comment
Share on other sites

30 minutes ago, NiranjanGaaru said:

Malli parliament samavasalu..... Ap prajalu eager ga chuse avasaram vachindi, after no confidence motion against BJP by tdp, ram mohan naidu speech 

Devudi palana lo Me paytms ki happy no!?

5 rs credited for ur valuable service

Link to comment
Share on other sites

34 minutes ago, NiranjanGaaru said:

Malli parliament samavasalu..... Ap prajalu eager ga chuse avasaram vachindi, after no confidence motion against BJP by tdp, ram mohan naidu speech 

public donot care

Link to comment
Share on other sites

6 minutes ago, Rajnichitti said:

Devudi palana lo Me paytms ki happy no!?

5 rs credited for ur valuable service

Anduke anedhi pulkas ani.... Thread enti nuv vage chetha enti? 

Link to comment
Share on other sites

33 minutes ago, NiranjanGaaru said:

Anduke anedhi pulkas ani.... Thread enti nuv vage chetha enti? 

we are clear on parliament, what to raise, we raise visakha steel plant privatisation, what about you then? Musugu neutrals

 

Link to comment
Share on other sites

4 minutes ago, Rajnichitti said:

we are clear on parliament, what to raise, we raise visakha steel plant privatisation, what about you then? Musugu neutrals

 

Evar ra musugu neutral, nuv okadu, @futureofandhra okadu, context lekunda edo edo vaguntaru. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...