Jump to content

Hyderabad news: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్‌

godfather03

Recommended Posts

Hyderabad news: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్‌

Hyderabad news: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్‌

హైదరాబాద్‌: పోలీసులను నాలుగు రోజులుగా ఉరుకులు పరుగులు పెట్టించిన గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. మహబూబ్‌నగర్‌ నుంచి ఈ నెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగి భార్య, మరదలిపై అత్యాచారం, ఆ తర్వాత ఒకరు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. కానీ, చివరికి అత్యాచార ఘటన అంతా కట్టుకథగా పోలీసులు తేల్చారు. గాంధీ ఆసుపత్రిలో మహిళపై అత్యాచారం జరిగిన ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా దృశ్యాలు, వైద్య నివేదిక, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళలు చేసిన ఆరోపణలు అవాస్తమని తేల్చారు. మత్తు ప్రయోగం, అత్యాచారం జరగలేదని నిర్ధారించారు. చిత్తభ్రమలకు లోనై సెక్యూరిటీగార్డుపై అత్యాచారం ఆరోపణలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ‘‘గాంధీ ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు మహిళలు కల్లుకు బానిసలు. భర్తను ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఐదు రోజుల పాటు అక్కా చెల్లెళ్లు కల్లు తాగలేదు. కల్లు తాగకపోవడంతో వారిలో విత్‌డ్రాయల్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆగస్టు 11న రోగిని గాంధీ ఆసుపత్రిలోనే వదిలేసి అక్క వెళ్లి పోయింది. ఆగస్టు 11 నుంచి 15 వరకు ఆసుపత్రి ఆవరణలోనే ఆమె చెల్లెలు ఉంది. ఆగస్టు 12, 14 తేదీల్లో సెక్యూరిటీ గార్డుతో ఆమె సన్నిహితంగా మెలిగింది. అన్నీ క్షుణ్నంగా పరిశీలించినా ఎక్కడా అత్యాచారం జరిగినట్టు ఆధారాల్లేవు’’ అని పోలీసులు తెలిపారు.

భర్తను గాంధీ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన మహిళను నారాయణగూడలోని ఓ ఔషధ దుకాణం వద్ద గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో భర్తను చేర్పించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందనే దానిపై ఆమెను చిలకలగూడ పోలీసులు విచారించారు. ఆమెను భరోసా సెంటర్‌కు పంపిన పోలీసుల అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. కేసు దర్యాప్తులో భాగంగా మహబూబ్‌నగర్‌కు వెళ్లిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. అక్కా చెల్లెళ్లు మద్యం ఉపసంహరణ లక్షణాల(ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌)తో ఉన్నారని గుర్తించారు. అక్కడి ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. దీంతో అసలు కథ వెలుగు చూసింది.

Link to comment
Share on other sites

4 minutes ago, paaparao said:

deenemma TG Police....

ee rape incident ayina kuda ladies drunkards ani cases close sesthunnaru. @3$%

rape kaledanta sir (as per the latest investigation)

Link to comment
Share on other sites

6 minutes ago, paaparao said:

deenemma TG Police....

ee rape incident ayina kuda ladies drunkards ani cases close sesthunnaru. @3$%

Ante after doctors report kuda .. ee policolle chesi pettina case nijam cheyalantava endhi 

  • Haha 1
Link to comment
Share on other sites

8 minutes ago, TOM_BHAYYA said:

Ante after doctors report kuda .. ee policolle chesi pettina case nijam cheyalantava endhi 

Aa lap assistant paristhiti em ayithado...vaadi photo anni news channels lo vachhesindi...

Link to comment
Share on other sites

4 minutes ago, godfather03 said:

Aa lap assistant paristhiti em ayithado...vaadi photo anni news channels lo vachhesindi...

Appatlo keesara dhaggara auto vadi ni itlane badnam chesindhi oka btech pori

  • Upvote 1
Link to comment
Share on other sites

24 minutes ago, paaparao said:

deenemma TG Police....

ee rape incident ayina kuda ladies drunkards ani cases close sesthunnaru. @3$%

Inka nuvuu 1990's lone agipoyav

Link to comment
Share on other sites

3 minutes ago, TOM_BHAYYA said:

Appatlo keesara dhaggara auto vadi ni itlane badnam chesindhi oka btech pori

Yes...atlantide inko incident jarigindi...inko thread esina chudu...BTW how is st.louis?

Link to comment
Share on other sites

17 minutes ago, chinnapillalabandi said:

Telangana lo dharidram ayna alavatu ee kallu thaaggam1🤮🤮. Family families koorchoni kallu thaagutharu👎

not just kallu, even liqour. I'm not against drinking but the amount of peer pressure and prestige people invest in it is beyond stupid

Link to comment
Share on other sites

25 minutes ago, chinnapillalabandi said:

Telangana lo dharidram ayna alavatu ee kallu thaaggam1🤮🤮. Family families koorchoni kallu thaagutharu👎

Andhra lo “pusthelu ammayina pulasa thinali “ antaru ... mem arusthunnama? 
thokkala chepalu thinadaniki pellam medalo pusthelu thempentha chettha edhavalu andhraites ani #NoOffense

Link to comment
Share on other sites

13 minutes ago, JustChill_Mama said:

Andhra lo “pusthelu ammayina pulasa thinali “ antaru ... mem arusthunnama? 
thokkala chepalu thinadaniki pellam medalo pusthelu thempentha chettha edhavalu andhraites ani #NoOffense

Telangana lo kallu thagadam dharidram alavatu ananu.. Nuvemo andhrites ni thiduthunav malli andhraforum loki vachi🤮🤮

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...