Lorry_Driver Posted August 26, 2021 Report Share Posted August 26, 2021 ఢిల్లీ లో ఓ కంపెనీ ఉద్యోగం ప్రకటన లో ఒక షరతు పెట్టింది. "తిరగబడని వ్యక్తి కావాలి" అని చాలా రాష్ట్రాల వ్యక్తులు ఇంటర్వ్యూ కొచ్చారు. ఒక *ఆంధ్రుడు* కూడా అందు లో ఉన్నాడు. ఇంటర్వ్యూ మరి కొద్ది సేపటిలో మొదలవుతుంది అనగా... ఎవర్నీ ఇంటర్వ్యూ చేయకుండానే అక్కడ ఉన్న *ఆంధ్రా వ్యక్తిని* ఎంపిక చేసింది Management. దీంతో మిగిలిన రాష్ట్ర వ్యక్తులందరూ తిరగబడ్డారు... వెంటనే Management ..... ఇలా తిరగబడతారని తెలిసే మిమ్మల్ని ఎవరినీ ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేయలేదు. అని చెప్పింది. దాంతో అక్కడున్న పంజాబ్ వ్యక్తి... మరి అతన్ని ఎలా సెలక్ట్ చేశారు? అని ఎదురుప్రశ్నించాడు. ఆతన్నే ...ఎందుకు సెలెక్ట్ చేశామంటే....... వాళ్ళ *ఆంధ్ర రాష్ట్రం* విడిపోయినా, రాజధాని పోయినా, చెప్పిన హామీలు చేయకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, కొత్త సంస్థలు ఇవ్వకున్నా ఉన్న సంస్థలను మూసేస్తున్నా, తరిమేస్తున్నా, అమ్మేస్తున్నా, ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వక పోయినా రైల్వే జోను, ఇవ్వక పోయినా.. వాళ్ళ ప్రభుత్వం అధిక అప్పులు చేస్తూ, నిత్యవసర సరుకుల ధరలు పెంచేస్తున్నా, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేస్తున్నా, ప్రాజెక్టులు పూర్తి కాకున్నా, మద్యం వేరులై పారుతున్నా, రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నా, కొత్త కంపెనీలు రాకపోయినా, ఉన్నవి పారిపోతున్నా, ఉద్యోగాలు లేకున్నా, రాష్ట్రం సాంతం పాడై పోయినా... నిమ్మ కి నీరరెత్తినట్లు, బెల్లం కొట్టిన రాయిలా, ఏ మాత్రం రోషం, పౌరుషం లేకుండా శోభనం పెళ్లికొడుకు లా ఎలా సిగ్గు పడుతున్నాడో చూడండి... *ఆ ఆంధ్రుడు*... అందరూ అతన్నే చూస్తూ కరెక్టే అనుకుని claps కొట్టి వెనుదిరిగారు ఇంతలో తమిళాయన... ఇంతకీ ఈ కంపెనీ ఓనరుది ఏ రాష్ట్రం? అని అడిగాడు. తడుముకోకుండా చెప్పేడు, గుజరాత్ అని ఆ మ్యానేజరు. తప్పు లేదు అనుకుని బయల్దేరారు మిగిలిన రాష్ట్రాల అభ్యర్థులు.🤫☺️☺️☺️☺️ <Just received this in whatsap> Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.